ఆకాశానికి నిచ్చెన

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

ఆకాశానికి నిచ్చెన

రచయిత :: మల్లాదిసోమేశ్వరశర్మ

మింగ మెతుకు లేదు
మీసాలకు సంపెంగనూనె
తినడానికి తిండి ఉండదు
ఇంట్లో కుండలు కొట్టుకుంటాయ్
బయటకు వచ్చి లొల్లాయ్ కబుర్లు
బడాయ్ కబుర్లు
గొప్పలు చెప్పడానికి అంతుఉండదు
వినేవారుండాలికాని
ఏవేవో మాటలు
చేతల్లో శూన్యం
ఆకాశానికి నిచ్చెనలు
ఇది సంబధ్ధమా
అసంబధ్ధమా
అనికూడా చూడరు
ఊకదంపుడు
అనవసరపు కోతలు
ఎంతవరకూ ఉండాలో
అంతవరకూ ఉండాలి
మితి మీరిన మాటలొద్దు
ఆకాశానికి నిచ్చెనలేయద్దు
పదిమంది లో చులకనవద్దు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!