అంశం: చీకటి వెలుగులు
ఒకే కొమ్మకు పూసిన పూలు
రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర
ఒకే కొమ్మకు పూసిన పూలే
బొమ్మ బొరుసులు
ఒకరినొకరు ఎరుగని బంధువులు..
ఒకే కొమ్మకు పూసిన పూలే
సుఖ దుఃఖాలు
వెనకింటికి బాధను పంచలేని సోదరులు…
ఒకే కొమ్మకు పూసిన పూలే
పాప పుణ్యాలు
ఒక కంటి నీటిని మరో కంటి హాసాన్ని చూడలేని దురదృష్టవంతులు…
ఒకే కొమ్మకు పూసిన పూలే
చీకటి వెలుగులు
ఒకేసారి ఉండలేని విరహ ప్రేమికులు…
ఒకే కొమ్మకు పూసిన పూలే
మంచి చెడులు
పోటాపోటీగా జగతినేలే నాయకులు…!