హిట్లర్ మొగుడు

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

హిట్లర్ మొగుడు

రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )

చెప్పకున్న ఆయన భావాలను అర్థం చేసుకోవాలి
మనసులోని భావాల్ని బయటకు చెప్పకూడదు

ఆయన సంతోషించే పనులనే చేయాలి
నాకు నచ్చిన ఏ చిన్న పని కూడా చేయకూడదు

ఆయన నవ్వించి నప్పుడే నేను నవ్వాలి
ఎప్పుడైనా ఆనందమొస్తే మనసారా నవ్వకుడదు

ఆయనను ఎప్పుడూ బాధ పడకుండా చూసుకోవాలి
నాకు బాధ కలిగితే కళ్ళ నుండి కన్నీళ్ళు కూడా రాకూడదు

ఆయనను పదిమందిలో గొప్పవాడని చెప్పాలి
పది మందిలో నేను గుర్తింపు పొందకుడదు

బుజు పట్టిన పాత సంప్రదాయాలనే అనుసరించాలి
నాకు తోచిన క్రొత్త సంస్కరణలు అసలుకే పాటించకూడదు

ఆయన మూర్ఖపు చాదస్తపు ఆలోచనలను గౌరవించాలి
నాలోని క్రొత్త ఆలోచనలను ఎవరికి చెప్పకూడదు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!