చిట్టిమొగుడు

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

చిట్టిమొగుడు

రచయిత :: జయకుమారి

నుదుట నిలువునామం.!
తలకి కొబ్బరినూనె.!
ఎవరే ఎవరేవరే ఇతగాడు.!!

అమాయకపు చక్రవర్తిలా ఉన్నాడు.!
అనుకున్నంత సేపు పట్టానే లేదు సుమీ.!!

రూపం వెనుక దాగివున్న చాదస్తం.
చిన్నపిల్లలా గారం పోయే చిట్టి మొగుడు.!!
మాటమంతి అంటే అమ్మో అమ్మ ఉంది అంటాడు.!!
నగ, నట్ర అంటే నారాయణ నాన్న తిడతారు అంటారు.!!

ఎట్టా ఏగేది ఛాందసపు పెనిమిటితో.!
పోనీ ముద్దుమురిపం అంటే ముసలోళ్లు ఉన్నారంటాడు.!!

కాలం కలిసోచ్చి వచ్చాడు మంచి మొగుడన్నారు.!!
తిరమోస్తూ చూస్తే కలల్ని చిదిమెసే మొరటు మొగుడయ్యాడు.!!

మార్చేదెట్టగా ,ఏమార్చేదెట్టాగ .!!
ప్రపంచంలో ని మూఢనమ్మకాలన్నిటిని
మూటగట్టుకున్న ముత్యమంటి మనసున్న
చాదస్తపు మొగుడిని.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!