హరివిల్లు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నాగ రమేష్ మట్టపర్తి
ఓటు విలువ ఇకనైనా తెలుసుకో…..!!!
ఓ… భారత పౌరుడా…!
అందుకోకు నోటు
అమ్ముకోకు ఓటు
అది భవిష్యత్తుకు చేటు
ఓ చెట్టు విన్నపం…..!!!
రక్షించి చూడు…
నన్ను కొంతకాలం
రక్షిస్తూనే ఉంటా…
నువ్వు ఉన్నంత కాలం
అతి అనర్థానికి మూలం…..!!!
ప్రతి విషయంలో అతి
పోగొట్టును మతి
మార్చును మన స్థితి
తెచ్చిపెట్టును అధోగతి
అమూల్య మధుర స్మృతులు…..!!!
నీ జ్ఞాపకాలే
పలు వర్ణాలుగా
హృదయాంతరాళం లో
విరిసెనే హరివిల్లుగా