ఓ అభిలాష కథ

ఓ అభిలాష కథ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

రచన: ఎన్. ధనలక్ష్మి

సూర్య, విద్య గారి ఏకైక సంతానం జ్వాల. సూర్య గారు బ్యాంకులో అకౌంట్ గా పని చేస్తుంటారు, విద్య గారు ఇంటి దగ్గర బోటిక్ నడుపుతుంటారు. జ్వాల ప్రగతి పత్రికలో జర్నలిస్టు. ఎవరికి తెలియని ఎన్నో విషయాలను కథనాలుగా రాస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఓ ఆదివారం ఉదయం అందరు టిఫిన్ చేస్తూ టివి లో న్యూస్ చూస్తున్నారు. జైల్ లో జరిగిన దాడి గురించిన న్యూస్ టెలికాస్ అవుతోంది. న్యూస్ సారాంశం ఏమిటంటే, “ఈ రోజు ఎస్పీ చరణ్ గారి పుట్టినరోజు. ఆయన ఖైదీలకు పళ్ళని పంచి పెడుతున్నారు. ఇంతలో ఒక ఖైదీ ఆయన మీద దాడి చేసింది. పైగా దాడి చేసిన ఆ ఖైదీ తన శిక్షాకాలం పూర్తి అయి ఓ గంటలో భయటపడతాను అనగా? ఎస్పి పై దాడి చేస్తుంటే పక్కనే ఉన్న కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడు. అప్పుడు ఆ ఖైదీకి  ఫిట్స్ వచ్చాయీ..తను ప్రస్తుతం కస్తూరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అసలు తానేవరు. తను ఏమి నేరం చేసింది? కావాలని చేసిందా? దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా?? తెలుసుకోవాలంటే మా న్యూస్ ఛానెల్ చూస్తూ ఉండండి. అని న్యూస్ ఎండ్ చేసింది. ఇంటరెస్టింగ్ గా ఉంది! ఇంకా కొద్ది క్షణాల్లో విడుదల అవుతుంది అనగా. ఇంట్రెస్ట్ గా ఉంది కదా ఈ న్యూస్ నాన్న. అవును రా బంగారం. చూస్తుంటే ఆ అమ్మాయీ వెనుక ఏదో తెలియని కథ ఉంది. అది ఏంటో తెలుసుకో తల్లీ…హా నాన్న! డిఎస్పి ప్రసాద్ గారితో మాట్లాడి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ లెటర్ తీసుకుంటానని ఫోన్ తీసుకొని మాట్లాడి పర్మిషన్ తీసుకుంది జ్వాలా..తన స్నేహితుడు విజయ్(విజ్జు) తో కలిసి కస్తూరి హాస్పిటల్ కు చేరుకుంది. రూం బయట ఉన్న కానిస్టేబుల్ వాళ్ళకి పర్మిషన్ లెటర్ చూపించి లోపలకి వెళ్ళారు విజ్జు, జ్వాల ఆ అమ్మాయీ కూర్చొని డ్రాయింగ్స్ వేస్తూ ఉంది.”హాయ్ మేము ప్రగతి పేపర్ నుంచి వచ్చాము. నిన్న జరగిన సంఘటన గురించి మీతో మాట్లాడాలి. ఎవరు మీరు? మీ పేరు ఏంటి? ఏమి నేరం చేసి జైల్ కి వచ్చారు? ఇంకా విడుదల అవుతానని తెలిసి ఎందుకు ఎస్పీ చరణ్ గారి మీద దాడి చేసారు? ఎన్ని ప్రశ్నలు అడిగిన ఆ అమ్మాయీ సైలెంట్ గా తన పనిని తను చేసుకుంటూ బొమ్మ వేస్తుంటుంది. ఓ పది నిమిషాలు ఆగి తను ఏమి వేసింది అని చూస్తారు. జ్వాల, విజ్జుల బొమ్మ వేసి ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకేసారి వావ్ అని అంటారు. ఆ అమ్మాయీ వైపు మెచ్చుకోలుగా చూస్తారు. జ్వాల ఎన్ని రకాలుగా అడిగిన సరే ఆ అమ్మాయి నుంచి ఒక మాట కూడా రావట్లేదు. “చూడండి..నేను ఓ జర్నలిస్టుగా అడగడం లేదు, ఓ అమ్మాయి గా అడుగుతున్న. నన్ను మీ అక్కగా భావించి చెప్పండి అని ప్రేమగా అడుగుతుంది. ఆ అమ్మాయీ కంట్లో నీళ్లు వస్తాయి. డాక్టర్ వచ్చి ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఓ ఐదు నిమిషాలు మీరు కాస్త బయటకు వెళ్ళండి చెప్పడంతో బయటకి వచ్చేశారు. ఈ అమ్మాయీ పెద్ద మొండిగట్టంలా ఉంది కదా. “మొండిగట్టం కాదు విజ్జు. పరిస్థితుల ప్రభావం వల్ల తను అలా ప్రవర్తిస్తోంది. నువ్వు గమనించావో లేదో ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. మనిద్దరి బొమ్మ ఎంత అద్భుతంగా గీసింది. నన్ను అక్క అనుకోమంటే తను కాస్త ఎమోషనల్ అయింది కూడా, ఆ అమ్మాయికి మన మీద నమ్మకం కలిగితే తనే చెపుతుంది.” లెట్స్ సీ జ్వాలా..ఓ 15 నిమిషాల తరువాత, దయచేసి మీ కథేంటో చెప్పండి. మీ వైపు న్యాయం ఉంటే నేను తప్పక సాయం చేస్తాను. ఓ జర్నలిస్టుగా కాదు ఓ అక్కగా. నువ్వు ఎవరు, మీ అమ్మ , నాన్న ఏమి చేస్తూ ఉంటారు. అన్న, తమ్ముడు గాని ఎవరైనా ఉన్నారా నీకు. చూడు మౌనంగా ఉండడం చాలా పెద్ద తప్పురా. తప్పు చేసినవాళ్లు మౌనాన్ని ఆశ్రయిస్తారు. నువ్వు ఏమి తప్పు చేసి ఉండవు అని నేను నమ్ముతున్న. అసలు నువ్వు జైల్ కి ఎందుకు వచ్చావు. అని జ్వాల ప్రేమగా అడగడంతో ఆ అమ్మాయీ తనని హత్తుకొని ఏడుస్తుంది. తను తనువుతీరా ఏడిచిన తరువాత మీరు నమ్ముతున్నారు కదా! నేను ఏమి తప్పు చేయలేదని. అవును రా నమ్ముతున్న. అక్క నా పేరు ‘అభిలాష’. అమ్మ, నాన్న, తమ్ముడు వీళ్ళే నా ప్రపంచం. నాన్న లారిడైవర్ గా పని చేసేవారు. అమ్మ ఇంటి దగ్గర బీడీలు చుట్టేది. మా పేదరికం తోడు నాకు రోగం ఉంది. భయపడిన, టెన్షన్ పడిన నాకు పిట్స్ వస్తాయి. మా నాన్నకు నేను అంటే ప్రాణం. నన్ను కంటికి రెప్పల చూసుకునే వారు. మీకు తెలుసా అక్క నేను ఎప్పుడు క్లాసులో ఫస్ట్ వచ్చే దానిని. నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న ఏక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటినుంచి మా కష్టాలు రెట్టింపు అయ్యాయి. మేము ఉన్న గ్రామాన్ని వదిలిపెట్టి పట్నంకి వెళ్లి బ్రతకాలి అని బయలుదేరాము. అమ్మ నన్ను రైల్వే స్టేషన్లలో కూర్చోపెట్టి తమ్ముడిని తీసుకోని నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. అలా ఆ రోజంతా తను రాలేదు. భయంతో ఎంత ఏడ్చనో తెలుసా అక్క. ఇంతలో ఒక ఆటో అన్న వచ్చి నన్ను అడిగారు. నేను జరీగింది చెప్పాను. ఆ అన్న నవ్వి “తల్లి నీకు అర్థం కాలేదా మీ అమ్మ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బహుశా నీకు ఉన్న అనారోగ్యం, పైగా అమ్మాయీవి కదా, ఒంటరి మహిళ కదా. కొడుకును చూసుకుంటే చాలు అనుకుని ఉంటుంది. సరే అమ్మా, నాతో రా అని తన అక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆవిడ ఇంటి పనులు చేయడానికి ఓ మనిషీ కావాలని. ఆ ఆటో అన్న నన్ను పనిమనిషిగా తీసుకొని వెళ్ళాడని అర్థం అయింది. నాకు కూడా వేరే అవకాశం లేదు. అమ్మ ఎటు వెళ్లిందో కూడా తెలియదు. నాకు వాళ్ళ గోడ్డు చావడిలో ఉండడానికి చోటు ఇచ్చారు. ఆవిడకు ఇద్దరు పిల్లలు, వాళ్లను చూస్తే నాకు తమ్ముడు గుర్తుకు వచ్చేవారు. వాళ్ళు కూడా నన్ను అక్క అనేవారు. ఆవుల దగ్గర నుంచి ఇంటి పని అంతా నేనే చేసేదానిని. నాకు సరిగ్గా ఆహారం కూడా పెట్టలేదు. నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఎన్నో రోజులు గడిపానో తెలుసా అక్క. ఆవిడ భర్త వేరే ఊరిలో జాబ్ చేసేవారు. ఆయన కూడా నన్ను కూతురిలా ఆదరించేవారు. వాళ్ల పిల్లలకి ఏమి తెచ్చిన నాకు కూడా తెచ్చి ఇచ్చేవారు. అది ఆవిడకి నచ్చలేదు. ఆ వస్తువులను నా దగ్గర నుండి తీసుకుని నన్ను తిట్టేది. నేను బాబాయి, పిన్ని అని వాళ్లను పిలిచే దానిని. ఆ పిల్లల దగ్గర పుస్తకాలను తీసుకొని చదువుకునే దాన్ని. ఒక సారి ఆ పిలల్లకి డౌట్ వస్తే నేను చెప్పాను. అది చూసిన బాబాయి నన్ను కూడా చదివిస్తాను అన్నారు. అది పిన్నికి నచ్చ లేదు. నా మీద ఇంకా కోపం పెరిగిపోయింది.
ఒక రోజు బాబాయి పక్క ఊరిలో జరిగే జాతర కి మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళాలి అనుకొన్నారు. పిన్ని కూడా ఏమి అభ్యంతరం చెప్పలేదు. సడన్ గా పిన్నికి కడుపు నొప్పి మొదలు అయింది. తను రాలేను మమల్ని వెళ్ళమంది. కానీ నేను తనని అలా ఒంటరిగా వదిలి పెట్టడం ఇష్టం లేక నేను ఉంటాను. వాళ్లను వెళ్ళమన్న లేదు అంటే తమ్ముళ్లు బాధపడతారు అని చెప్పాను. వాళ్ళు వెళ్లిపోయిన తరువాత పిన్ని కి సూప్ కలిపి ఇచ్చి తనకి కావలసినవి అమర్చి తను నిద్రపోయింది అని తెలుసుకున్నాక చావిడిలో కూర్చొని డ్రాయింగ్స్ వేస్తూ ఉన్న. అలా ఒక గంట తరువాత ఇంట్లో నుంచి పిన్ని అరుపు వినపడి ఏమి అయిందో చూద్దాం అని లోపలికి వెళ్ళా తన తల నుండి రక్తం కారుతూ ఉంది. ఏమైంది పిన్ని ఏమి జరగింది అని అడిగాను లోపలికి వెళ్ళి చూడు అని నన్ను వాళ్ళ రూంలో వెళ్లి బీరువా తీయమంది.  నేను వెళ్లి అలాగే చేసా. నేను బీరువా తీయగానే లోపల ఉన్న వస్తువులు కింద పడ్డాయి. అవి నేను ఎత్తి పెట్టాలి అనుకునే లోపు సడన్ గా పోలీసులు వచ్చారు. పిన్ని వచ్చి ” సర్ వీళ్ళమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోతే మా తమ్ముడు తీసుకు రావడంతో తనని మేము మా బిడ్డలా చూసుకున్నాము. కానీ ఈ అభిలాష డబ్బు మీద ఆశతో మా ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసుకొని నన్ను ఇలా కొట్టి ఇలా డబ్బులు తీసుకొని పారిపోవాలని చూసింది. మీరు రాకుంటే నన్ను కూడా చంపేసేది. నాకు అర్థమైంది పిన్ని ఇంటి నుంచి పంపిచి చేయాలని ఇలా చేసింది అని. నాకు ఆ క్షణం అర్థం అయింది. మా అమ్మే నన్ను వద్దు అనుకున్నప్పుడు పిన్ని అనుకోవడంలో తప్పు ఏమీ ఉంది. అప్పటికే అక్కడకి వచ్చిన బాబాయ్ పిన్ని గాయంతో చూసి నన్ను అపార్థం చేసుకొన్నారు. నాకు కూడా నిజం చెప్పాలి అనిపించలేదు. ఎందుకంటే నేను నిజం చెప్పితే పిన్ని అందరి దృష్టిలో చెడ్డ వారవుతారు. ఎంత లేదు అనుకొన్న నాకు ఆహారం పెట్టిన ఇల్లు. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. అలా నాకు జైల్ శిక్ష పడింది. అయ్యో అభి! ఇన్ని కష్టాలు పడ్డావా అని జ్వాల తనని హత్తుకుంది. విజ్జు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. అభి కి వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చారు. అభి అని వాళ్ళ నాన్నే పిలిచే వారు. మరి ఎందుకు నిన్న ఎస్పీ మీద దాడి చేసావు. ఇంకా కొద్దీ క్షణాల్లో విడుదల అవుతుంటే. అక్క కావాలనే చేసా. జైల్ నుంచి బయటకు వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి. నాకంటూ ఎవరు లేరు. నేను ఇక్కడే ఉండాలి అంటే నేను మళ్ళీ ఏదో ఒక్క నేరం చేయాలి అని అలా సార్ మీద దాడి చేసా. అప్పుడు నేను అక్కడే ఉండవచ్చు కదా. అభి! బాధపడకు ఇంకా నుంచి నీకు మీ అక్క ఉంది. నిన్ను చూసుకుంటుంది. నువ్వు హ్యాపీ గా చదువుకో, అసలు విషయం ఎస్పీ గారికి చెప్పి నీ మీద కేసు లేకుండా చేస్తాను. అక్క పేపర్లో ఇదంతా రాస్తారా. అవును అభి! వద్దు అక్క! పిన్ని నా వల్ల బాధపడడం ఇష్టం లేదు. అభి నేను రాస్తాను. కాకపోతే మీ పిన్ని వివరాలు ఏవీ రాయను. అర్థం అయిందా! నీ కథ అందరికీ తెలియాలి. నువ్వు రెస్ట్ తీసుకో, బై అభి. ఆ తరువాత రోజు అభిలాష కథ అంటు కథనం ప్రచురితమయింది. అభిలాష కథ చదివి చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. అభిలాష మీద కేస్ కొట్టేసిన, సూర్య గారి పర్మిషన్ తో జ్వాల తనకి ఇంటికి తీసుకొని వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో మనిషిలాగ తనని చూసుకుంటున్నారు. తనతో పదో తరగతి పరీక్షలు రాయించారు. అందులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఆ తరువాత తనని కాలేజ్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం అభిలాష చక్కగా చదువుకుంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!