ఎటు పోతోంది ఈ ప్రపంచం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

ఎటు పోతోంది ఈ ప్రపంచం

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

ప్రేమలు కరువయ్యాయి
ఆదరణలు ఆకాశాన్ని అంటాయి
మానవత్వం కలగిన మనసులు మంటల్లో కలశాయి
సాయం చేసే చేతులు, చోరీలు కొనసాగించాయి
ప్రాణం పొయ్యాల్సిన ఆ వృత్తిలో, పచ్చనోట్లపై ఆశలు మోసం పెంచేశాయి
స్వార్ధం కోసం సేవలు, పేరు కోసం దానాలు ఎన్నో రాజకీయ పార్టీలు చేశాయి
మధ్య తరగతి బతుకుల్లోని దైనందిక జీవితాలు, చావలేక నిలిచాయి
చేయూత, ఆదరాభిమానాలు కరువయ్యాయి
ఆరోగ్యం పేరుతో ఇంటి పట్టునే గడిపెయ్యటంతో,
తామరాకు పై నీటి బొట్టులాంటి ఈ జీవితంలో తన పర భందాలు మరిచాయి ఈ బతుకులు
పైసా ఉంటే పరమాత్మ లేకుంటే దైవంలో ఐక్యం
ఇదే నేటి కలుషితమైన ప్రపంచంలో వ్యాపార సూత్రమయ్యింది
ప్రతి ఒక్కరి హృదయంలో భంధాల విలువ తగ్గిపోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!