మానవత్వమే మహనీయ తత్వం

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మానవత్వమే మహనీయ తత్వం

రచయిత :: సత్య కామఋషి ‘ రుద్ర ‘

గుక్కెడు నీటిని దోసిట పోసి, ఓ
తడియారిన గొంతు దప్పిక తీర్చగ

నాలుగు మెతుకులు గుప్పిట
నింపి, ఓ కడుపు ఆకలి తీర్చగ.,

ముందుకు సాగలేక కుదేలైన
నడకకు కూసింత ఊతమివ్వగ.,

చేవలేక చేయలేక చతికిలబడి
చితికిన చేతికింత చేయూతనివ్వగ.,

ఆయువు నిలుపుకొనగ పరితపిస్తూ
విలవిలలాడే ప్రాణానికింత ఊపిరూదగా.,

పెదవి దాటని మౌనమై తల్లడిల్లి మది
పలికే భాషలేని ఊసులకు చెమర్చిన
కళ్లకు ఊరడింపుగా ఓదార్పునివ్వగా.,

ఏ రంగులు పులుముకున్న ఏ జెండానో,
స్వప్రయోజనాల హంగుల ఏ ఆర్భాటమో.!
ఏ పేరు , ఏ ఊరు,  ఏమి కావాలనో.!
ఏ కలిమి, ఏ బలిమి ఏల అవసరమో.!

ఏ పంతాలు, ప్రయోజనాలు, ప్రలోభాలు
చూడక చేసే సాయమే కదా సేవంటే..!
అలాంటి నిజమైన నిస్వార్ధమైన మానవ
సేవయే పైవాడు మెచ్చే మేటి మాధవసేవ.!
మానవత్వమే నిఖార్సైన మహనీయ తత్వం.!!

You May Also Like

6 thoughts on “మానవత్వమే మహనీయ తత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!