ముసుగులు తీస్తే మేలు

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

ముసుగులు తీస్తే మేలు

రచయిత :: గుడిపూడి రాధికారాణి

మనిషితనం జాడలో
మంచితనం నీడలో
స్వార్థ చింతన పెరిగింది
వ్యాపార ధోరణిలో

మేలు చేయనేం లాభము?
ఏదోయ్ నాకు ప్రతిఫలము?
మనకెందుకు పోనిమ్మని
ఊరుకుంటె ఏం నష్టము?

నేటి మనిషి ధోరణిదే
ఎవరి గోల వారలదే
కొద్దిమంది సజ్జనులను
శంకించు కారణమదే

పేపరులో వస్తుందా?
టీవీలో వస్తుందా?
కీర్తి కండూతి మహిమ
ఆకలికి తెలుస్తుందా?

ఫేసుబుక్కు చూసుకుంటు
లైకులు లెక్కెట్టుకుంటు
వాట్సాప్ స్టేటస్సులను
అప్డేటులు చేసుకుంటు

పలచనయ్యెను మానవత
బలపడెరా బలహీనత
డబ్బులిచ్చి కీర్తి కొనే
నేటి ఘనుల గొప్ప నడత

విరాళాలు పోగేసి
వారిని తెగ పొగిడేసి
కొంతధనం జేబులోకి
చూడరు దీనులకేసి

ఈ ధోరణి మారాలి
ఈ నైజం మానాలి
మనిషినుండి మనీషిగా
మనమంతా ఎదగాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!