హృదయం

హృదయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

రామయ్య, లక్ష్మయ్య అనే అన్నదమ్ములు  వారిలో రామయ్య కాస్త ఉన్నావాడు. లక్ష్మయ్య బీదవాడు.అన్నకు తమ్ముడు అంటే కొంచెం అయినా ప్రేమ గాని కాస్త “జాలిమనసు” చూపేవాడు కాడు, అసలు తమ్ముడు ఒకడు ఉన్నట్లు కూడా కనబరచని “హృదయం”లేని వ్యక్తి, అన్న రామయ్య లక్ష్మయ్య తన అన్నయ్య స్థతిపరుడు తనకు అండగా ఉంటాడని తన “మనస్సులో “నే కాక అందరితో చెప్పుతుండే వారు. కానీ అన్న కు తమ్ముడు మీద కాసంత మనసు ప్రేమ ఉండేది కాదు, ఐతే ఇద్దరికి మొనిపిటి కే పెళ్లిళ్ళు జరిగి పోవడం వల్ల లక్ష్మయ్య కు సంసారం ఈదటం  కాస్త బరువు ఐ ఒక రోజు భార్యతో చూడు మా అన్నయ్య  లా మనం కాస్త మెరుగు పడాలంటే సంపాదించాల నేను అలా బయట ఊరు పోయి నాలుగు డబ్బులు పోగుచేసు కోని వస్తాను. అని భార్య కుచెప్పగా! సరే అని భార్య ను దారి లో తినడానికి ఏమైన పెట్టమన్నాడు. భార్య ఇంట్లో ఉన్న నూకలు పిండి కొట్టి కాస్త బెల్లం పాకం పట్టి కుడుములు చేసి  పెట్టింది. లక్ష్మయ్య భార్య!
లక్ష్మయ్య  సంపాదన కోసం అని బయలు దేరి సాయంత్రానికి ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఒక చెరువు దాని పక్కనే ఒక గుడి అది కాస్త పాడుపడిన ఆలయం కనిపించాయి! ఆ చెరువు లో కాసిని నీళ్లు తాగి తెచ్చుకొన్న సామానుల తో పాటు భార్య చేసిపెట్టిన కుడుములు కూడా ఆ ఆలయంలో ఉన్న ఒక గూటిలో పెట్టాడు. బాగా అలసి పోయిఉంటం చేత ఆ గుడి లోనే నిద్రపోయాడు. అలా ఏమీ తినకుండా నే కునికి కునికి బాగా నిద్ర పోయాడు. లక్ష్మయ్య ఆ రాత్రి తెచ్చు కొన్న కుడుములు గుడి గూటిలోనే ఉన్నాయి అతను ఖాళీ కడుపు తోనే నిద్రపోతుండగా! ఆ సమయం లో రోజు కొంత మంది దేవతలు ఆ  ఆలయంకు వచ్చి ఎరైనా నైవేద్యం పెట్టారేమో అని చూసి పోతారు, అదే అలవాటు గా ఆరోజు కూడా దేవతలు రాగా  వారికి పిండి వంటలు వాసన వచ్చింది. అలా చూడగా ఆలయ గూటిలో ఏదో కనపడగా ఆ దేవతలు ఆ ఉన్న మూటను తీసిచూడగా అందులో కుడుములు కనపడగా ఆ దేవతలు అవి తమ కోసమే పెట్టిన నైవేద్యం గా బావించి ఆరగించి మరల మూటను చేసి గూటిలో పెట్టి దేవతలు తిరిగి వెళ్ళి పోయారు. లక్ష్మయ్యకు సూర్యుడు చురుకుగా తగలగా లేచి లేవగానే భలే ఆకలి వేయటం తో మూట విప్పి చూసేసరికి అందలో కొంత ధనం దానితో పాటు కమ్మటి భోజనం కూడా కనిపించింది. ఉబ్బు చూడగానే అతని “మనసు”చలించక పోగా! భోజనం చూడగానే బాగా ఆకలి పుట్టింది. ఆ కనిపించ భోజనం తన భార్యే పెట్టినదని బావించి సృష్టి గా భోంచేసిన తరువాత అతనికి ఆ ధనం చూసి ఆశ్చర్యంగా చూస్తూ తిరిగి వెంటనే పోయి భార్యతో జరిగిన సంగతి చెప్పాడు. మరునాడు ఆ చుట్టుపక్కల వారిని పిలిచి భోజనం పెట్టి కానుకలు ఇచ్చి పంపగా వచ్చిన వారంతా లక్ష్మయ్య గురించి వింత గా చెప్పుకుంటూ వెళ్ళి పోయారు. ఈ సంగతి రామయ్య చెవిన పడింది, రామయ్య “మనసులో ” ఇలా కుళ్ళు కో సాగారు. తమ్ముడు కి కలిగిన ఈ అదృష్టం గురించి స్థితి మంతుడైన అన్నా “మనసారా” సంతోషించాలసింది పోయి “మనసులోఅసూయ చెలరేగింది. కాని కాస్త ప్రేమ కురిపిస్తూ కపటం లేని లక్ష్మయ్య దగ్గరకు వచ్చి తమ్ముడు అంటూ “హృదయం కరిగేలా నటిస్తూ!అతనికి ఇంత ధనం ఏలా! వచ్చిందో తెలుసుకున్నాడు. లక్ష్మయ్య జరిగిన దంతా మనసులో దాచుకొక అన్నాగారైన రామయ్య కు చెప్పాడు. వెంటనే  రామయ్య భార్య ఆ రాత్రి కి రాత్రే కుడుములు చేసి తన భర్తను పంపగా, రామయ్య కూడ లక్ష్మయ్య పోయి నిద్ర పోయిన ఆలయాలకు పోయి రామయ్య కూడ ఆ కుడుములని అదే గూటిలో పెట్టి నిద్రపోసాగాడు. ఆరోజు కూడా దేవతలు ఆలయం కు వచ్చి మూట లో చూసి కుడుములు చూసి వాటిని తినక పోగా! ఏలాంటి సహాయం చేయకనే, ఇలా ఎన్ని సార్లు మనం వరాలు ఇచ్చినా ఈ మానవులకు “మనసు”తృప్తి పడరు అందుకే ఈ మానవుల మీద కనికరం చూపడం మనదే బుద్ధి తక్కువ ఈ మానవులకు దరిద్రమే ఎక్కువ అని వీడికి ఇంటికి పోగానే దరిద్రం పట్టుగాక అని శపించి ఆ మూట గూటిలో ఉంచి మరోసారి ఇలా వస్తే తగిన శాస్తి జరుగుతుందని అనుకొని దేవతలు పైకి వెళ్ళి పోయారు. ఆ వెనువెంటనే అన్న రామయ్య తనకు కూడా దేవతలు మనులు ధనం పెట్టే ఉంటారు. అని తోందగా ఇంటికి పోయి భార్యను పిలిచి ఇదిగో నీవు కుడుములు పెట్టన మూట నీవు జాగత్తగా పెట్టు.అని పక్క రోజు ఆ చుట్టు ప్రక్కల వారికి విందుకూ పిలిచారు. కానీ తమ్మున్ని పిలువ లేదు అందరూ విందు చేయుటకు ఇరుగుపొరుగు వారు రాగ ఆమూట విప్పగా అందులో వారు ఉంచిన సద్దిపోయిన కుడుములు మాత్రం మే ఉండగా!చూసి రామయ్య, అతని భార్య గొల్లుమన్నారు. అంతేగాక ఇంట్లో ఉన్న కాస్త కూస్తో పిలిచిన వారికి దానం చేయ సరిపోయింది. రామయ్య అత్యాశకు పోయి దరిద్రం తెచ్చుకున్న అతనికి తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని గ్రహించి. తన తమ్మడి దగ్గరకు పోయి “మనసు”పూర్తిగా క్షమించమని కొరగా లక్ష్మయ్య “హృదయం”గల మనిషి కాబట్టి  అన్నాకు “మనసు”పూర్తిగా దేవతలు ఇచ్చి ధనంలో సగభాగం పంచగా అన్నా ఆరోజునుంచి మంచిగా మారి ఇద్దరూ మనసు పూర్తిగా కలసి జీవించసాగారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!