చేదు రుచి

చేదు రుచి

రచన:: మంగు కృష్ణకుమారి

అయ్యో? అయ్యయ్యో! టొమాటో!
నీ వ్యవహారం అంతా వింతే ఏమిటో!
హఠాత్తుగా కిలో ఎనభై అవుతుంది,
సామాన్యుల గుండెల్లొ మాటల్లో
అలజడి మొదలయి తీరుతుంది!
గృహిణుల వాడకంలో తేడా వచ్చేస్తుంది
చారుల్లో పులుసుల్లో వేయడం ఆగిపోతుంది
మహా అయితే టొమాటో తో చేస్తారేమో పప్పూ!
ఏ పిల్లలో పారేసారా, వదులుతుంది
ఇంటిల్లి పాతికీ, చెవుల తుప్పూ!
పేపర్లో టాప్ న్యూస్ టొమాటోదే!
మీడియా అంతా టొమాటో రైతుల
కడగండ్లే! ఎసెంబ్లీ దద్దరిల్లుతుంది!
టొమాటోని బాంబులా ఒకరు వేస్తే,
మరొకరు బంతిలా ఒకరు కేచ్ చేస్తారు!
వెనకాతల ఏమవుతుందో ఎవరికీ తెలీదు!
మళ్లీ ధర తగ్గి వస్తుంది!
ఆనందంగా ఆడవాళ్లు పచ్చళ్లూ , పండగా చేసేస్తారు!
నాలుగు టొమాటాలు కింద పడ్డాయనో
రంగు బాగా లేదనో పారేసిందికి వెనుకాడరు
అసలు కష్ట పడేది ఎక్కడో పేద రైతులు
ఏనాడు ఉండవు కిట్టుబాటు ధరలు,
ఆ నాలికకి టొమాటో రుచి ఎప్పుడూ చేదే!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!