సాంత్వన

సాంత్వన

– ఆర్కా

ఓ ప్రియా…
నాపై ప్రేమ లేదా? ప్రేమ తగ్గినదా?
చిక్కటి చీకటి,
మన రాసలీల కోసం చూస్తున్నది …
నీ జడను ముడిచిన విరులు,
మన తనువుల వేడి సెగలలో రంగుమరాలనుకున్నాయి…
మేని పై వలువలు,
బిగి కౌగిలిలో నలిగిపోవాలనుకున్నాయి…
మెత్తని పానుపు మన సైయ్యాటకు,
వేదిక కావాలనుకున్నది…
హ్మ్మ్
నీ చేతిలో నా చెయ్యి ఉంచాలనుకున్నా
కానీ
దూరశ్రవణము నీ చేతిని ఆక్రమించుకున్నది…అని చెయ్యి చతికిలపడింది…

నీ ఊసులు వినడానికి నా చెవులు వేచి ఉన్నవి…
కానీ
నీ ఊసులు వెరెవరో వింటున్నారు… అని నా చెవులు ఉసూరుమన్నవి…

అందాలని చూడాలి… నీ కనులు… అని
అందాలన్నీ తహతహలాడాయి…
కానీ
నీ కన్నులు దురదర్శనమున కదిలే బొమ్మలను చూడటంలో లీనమయ్యాయి…అని అందాలు ఘోల్లుమన్నాయి…

మనువాడిన మనసు సరిగమల సరసములు కోరుతున్నది…జీవన సమరం లో అలసిన దేహము… నీ దేహపు సాంత్వన కోరుతున్నది…
కానీ
జీవనయానములో నలిగిన నీ మస్థిష్కము రేపటి కోసం ఆలోచిస్తున్నదని… నా మనసు విలవిలలాడినది…నీ దేహపు సంత్వన అందని నా దేహము విరహముతో రగులుతున్నది…

ప్రియా…
ముద్దుకు ముచ్చట చాలు…
అనుమతి అవసరం లేదు…
సరసానికి సరిగమలు చాలు…
సమయపాలన అవసరం లేదు…

దేహములు ఏకమై, మనసులు మమేకమై,
ఒకరికి ఒకరు, ఒకరిలో ఒకరు కలిసిన క్షణములు…
సరసాల సరిగమలలో మైమరచిన మగతలో…
సంసారపు ఒడిదుడుకులు ఏపాటివి…
వాటిని అధిగమించుట ఎంత పని…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!