జన్మదిన శుభాకాంక్షలు ఆనంద్

జన్మదిన శుభాకాంక్షలు ఆనంద్ 💐

నా తొలి మిత్రుడు – నా తోబుట్టువు
ఆనంద్ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు

ప్రాణం పోసేవారు తల్లితండ్రులైతే,
తొలి స్నేహితుడిగా నా భావాలు
అర్ధం చేసుకున్న నేస్తం నా తోబుట్టువు

చిన్నతనంలో కోపతాపాలు, చిలిపి గొడవలు,
అలకలు మన మధ్య లేవు కానీ
చదువులో నువ్వు ముందున్నపుడు,
నాకు మాత్రం కాస్తంత అసూయా ఉండేది.
చదువును కష్టపడి చదివేకంటే..
ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అనడానికి నువ్వే నిదర్శనం
ఇప్పటికీ చదువుపట్ల నీకున్న వ్యామోహానికి నా జోహార్లు

నాకంటే వయసులో చిన్నవాడివైనా,
పరిపక్వత గల నీ ఆలోచనలు, మాటలు, పనులు
పరిస్థితులను చక్కదిద్దుకోవడం చూస్తే…
నాకెంతో గర్వంగా అనిపిస్తుంది.
నిన్ను చూసి చాలా నేర్చుకుంటున్నాను.

మట్టిలో మాణిక్యంలాంటి వాడివి,
నిన్ను అర్థం చేసుకున్నవారు
ఎప్పటికీ నిన్ను విడువరు..
నీ సహజ గుణం, సహాయతత్వం,
పెద్దల పట్ల గౌరవం, దైవత్వం లాంటి
మంచి గుణాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

ప్రతి కష్టంలోనూ సుఖం ఉంటుంది,
ప్రతి సుఖంలోను కష్టం ఉంటుంది
కష్ట సుఖాలు ఎన్ని వచ్చినా..
మన ఇద్దరి బాంధవ్యం ఎన్నటికి మారదు.

నీవంటి సత్వ గుణాలున్న తోబుట్టువు
నాకు ఉన్నందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను

నీ కోరికలన్నీ ఫలించగా..
నీ ఆశయాలు సిద్దించగా..
నీవు ఆయురారోగ్యాలతో,
ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని
భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ..
పుట్టినరోజు శుభాకాంక్షలు “ఆనంద్”♥️

అక్క – శ్రీలక్ష్మి
బావ – రాజేష్
మేనకోడలు – శాన్వి
మేనల్లుడు – అద్విక్

జీవితంలో నువు కొరుకున్నవి అన్నీ జరగాలని,

నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ,

పుట్టినరోజు శుభాకాంక్షలు
మేమంత దూరంగా ఉన్నా మా ఆశీస్సులు సదా నీతోనే ఉంటాయి “ఆనంద్”

అమ్మ – లత
నాన్న – సత్యనారాయణ మూర్తి
అమ్మమ్మ – సుందరంబ, నానమ్మ మరియు తాతయ్యలు.

 

జన్మదిన శుభాకాంక్షలు ఆనంద్ ప్రసాద్ గారు 💐
తపస్వి & టీమ్ 

You May Also Like

5 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు ఆనంద్

  1. Happy Birthday Anand garu.
    మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!