ఆకలి దెయ్యం

(అంశం:”అల్లరి దెయ్యం”)

ఆకలి దెయ్యం

రచన: సంజన కృతజ్ఞ

మిఠాయి వ్యాపారం చేయడం కోసం శివయ్య సిరిపురం అనే ఊరికి వలస వచ్చాడు.
శివయ్య అదే ఊర్లో లో ఇల్లు కొందామని నిర్ణయించుకుంటాడు. ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు పాత ఇల్లు ఏదైనా అమ్మకానికి ఉంటే చెప్పండి నేను కొనుక్కుంటాను. చాలా తక్కువ మొత్తానికి వచ్చే ఇల్లు ఒకటుంది కానీ అక్కడ దయ్యాలు ఉంటాయని పుకార్లు ఉండడం వల్ల ఆ ఇల్లు ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు.
ఏంటి ఈ కాలంలో దయ్యాల అలాంటి వాటి మీద నమ్మకం లేదు ఆ ఇంటిని నేను కొనుక్కుంటాను. అప్పుడు ఊరిపెద్ద శివయ్యని ఆ ఇంటికి తీసుకువెళ్లాడు కొంత డబ్బు ఇచ్చి ఆ ఇంటిని కొనుక్కున్నాడు.
ఆ ఇల్లు ఎప్పటినుంచో అలానే ఉండటం వల్ల బాగా పాడైపోయింది. దానికి మరమ్మతులు చేయించి శుభ్రం చేయించుకున్నాడు వేసవి సెలవులు కావడంతో కొడుకు గోపాలాన్ని వాళ్ళ నాయనమ్మ ఇంటిదగ్గర వదిలి శివయ్య అతని భార్య తీసుకున్న కొత్త ఇంటి దగ్గరికి వెళ్లారు.
ఆ ఇంటి ముందు ఒక బావి ఉంది అందులో ఎప్పట్నుంచో రెండు దయ్యాలు ఉంటున్నాయి. ఒకటి ఆకలి దెయ్యం, రెండోది అల్లరి దయ్యం.

ఒకరోజు రెండు దయ్యాలు ఇలా అనుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎంతో హాయిగా ఉన్నాం కానీ ఇప్పుడు ఈ ఇంట్లోకి ఎవరో వచ్చేసారు మనం ఎప్పటినుండో ఇక్కడే ఉంటున్నాము.
ఇప్పుడు ఎవరో వస్తే మనం వెళ్ళిపోవడం ఏంటి.
మరుసటి రోజు శివయ్య మిఠాయి దుకాణంకి వెళ్ళిపోయాడు. శారద వంట చేయడం మొదలు పెట్టింది. ఆకలి దెయ్యం తన తిండి కోసం ఊర్లోకి వెళ్ళింది శారద వంట చేస్తూ ఉండగా చిన్న పని ఉండి పక్కకు వెళ్ళింది.
ఇదంతా కిటికీలోనుంచి గమనించిన అల్లరి దయ్యం ఆ వంట లో చిన్న చిన్న రాళ్ళు వేసి ఏమీ తెలియనట్టుగా చెట్టెక్కి కూర్చుంది.
ఇదంతా గమనించని శారద భోజనానికి సిద్ధం చేసింది. ఇంతలోకి ఊర్లోకి వెళ్లిన ఆకలి దెయ్యం వస్తూనే ఆ వాసనకి ఇలా అంది .
ఆహా ఇంత మసాలా వాసన తగిలి ఎంతకాలం అయిందో ఎలాగైనా తినాలి అనుకొని కిటికీలోనుంచి చెయ్యి చాపి ఎక్కడో దూరాన ఉన్న వాటిని కూడా తీసుకొని ఒక్కసారిగా నోట్లో వేసుకుంది .
నవలగానే దాని పళ్ళు ఊడి కింద పడ్డాయి. విరిగిన పళ్ళని చూసుకుంటూ ఇలా అంది. అమ్మో నా పళ్ళు అయ్యో దేవుడా అయ్యో ఇది కచ్చితంగా ఆ అల్లరి దయ్యం చేసి ఉంటుంది.
అబ్బా నా పళ్ళు ఎంత పని అయిపోయింది. ఇకనుండి తినడం ఎంత కష్టమో ఏంటో ఇదంతా పై నుంచి చూస్తున్న అల్లరి దయ్యం దీనికి బాగా అయిందని తెగ నవ్వుకుంటుంది.
ఒసేయ్ నీకసలు బుద్ధుందా ఆవిడ చేసిన వంటల్లో రాళ్లు ఎందుకు వేసావే పిచ్చి మొఖం దానా అయినా వాళ్ళ వంటల్లో రాళ్లు వేస్తే నీకెందుకే నా ఇష్టం నేను వేసుకుంటాను .
నీవల్ల నాకున్న రెండు పళ్ళు కూడా ఊడిపోయాయి. అయినా పొద్దున్నే తిండికోసం ఊరు మీద పడిందె కాక పళ్ళు కూడా రాళ్ల గొట్టుకొని నన్ను అంటావేంటి.
నాకు ఏదో ఆకలి వేసి తిందామని ఆశ గా వెళ్లాను ఊర్లో ఏదైనా తిను వస్తావ అనుకున్నా కక్కుర్తిపడి వాళ్ళ ఇంట్లో కూడా దూరి తింటావ్ అని నేనేమన్నా కలగన్నానా.
అయినా నా గురించి తెలుసుగా తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది అని మనం ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు ఎవరో వస్తే మనం వెళ్లి పోవడం ఏంటి.
ఇంతలో శివయ్య దుకాణం నుండి తిరిగి వచ్చాడు ఏం వండావు ఈరోజు వాసన గుమగుమ లాడుతుంది.
ఈరోజు మీకు ఇష్టమైన వంటే చేసానండి రండి వడ్డిస్తాను అవునా !
సరే త్వరగా పెట్టు చాలా ఆకలిగా ఉంది అబ్బా నా పళ్ళు. ఏమిటిది నీ మొహం మండ రాళ్ళు వేసి చేసావ్ ఏంటి వంట కాదండి భలేవారే మీరు.
ఏడిచావులే మరి ఈ రాళ్ళు ఎక్కడినుంచి వచ్చాయి. నా పళ్ళు విడగొట్టాలని కంకణం కట్టుకున్నావా ఏంటి అయ్యో అదేం లేదండి .
నేను వండినప్పుడు ఆ రాళేవి లేవు ఇప్పుడు ఎలా వచ్చాయి నాకు నిజంగానే తెలియదండి.
అయితే ఏ దయ్యమౌ వచ్చి వేసింది అంటావా అసలా ఆ రాళ్లు ఎలా వచ్చాయో ఏంటో.

ఇదంతా చెట్టు పై నుంచి చూస్తున్న ఆ రెండు దయ్యాలు నవ్వు కుంటాయి. ఒకరోజు శివయ్యతో శారద ఇలా అంది. కొంచెం బావిలో నీరు తోడి పెట్టకోడదు .ఎప్పుడూ ఏదో పని చెప్తుంటావ్. నీ దుంప తెగ ఈ ఒక్క రోజుకి తోడడండి రోజు మిమ్మల్ని తోడమంటున్న ఏంటి. సర్లే నాకు తప్పుతుందా ఇలా అని పాత్రలో నీళ్లు నింపి శివయ్య దుకాణానికి వెళ్ళిపోయాడు.
ఈ బావి మాది ఎప్పటినుండో ఇక్కడే ఉంటున్నాం మా బావిలో నీళ్ళు తీసుకోవటానికి వీళ్ళు ఎవరు. ఇలా అంటూ పాత్రలో ఉన్న నీళ్లన్నీ మళ్లీ బావిలోకి పోసేసి చెట్టెక్కి కూర్చొని నవ్వుకోవడం మొదలుపెట్టాయి.
అక్కడికి వచ్చి ఖాళీ పాత్రలను చూసిన శారద ఎలా వేగాలు ఈ అయోమయం మనిషితో నీళ్ల నీ తోడేసాను అన్నారు. ఇక్కడ చూస్తేనేమో చుక్క నీళ్ళు లేవు నీళ్లు మళ్లీ తోడుతుంది శారద .
మరుసటి రోజు యధావిధి గానే శారద వంట చేసి శివయ్య కోసం సిద్ధంగా పెట్టింది.
ఆహా ఎంత మంచి వాసన వస్తుంది లోపల తిండి నా కోసం ఉర్రూతలూగిస్తుంది. ఎలాగైనా ఓ పట్టు పట్టాలి ఈ పూట అనుకుంటూ వెళ్లి వండిన దాంట్లో సగం లాగించేసింది .
ఇంతలో శివయ్య దుకాణం నుండి వచ్చి భోజనానికి కూర్చోగా శారద వడ్డీద్దామని మూత తీసేసరికి కొంచెమే ఉన్న ఆహారాన్ని చూసి శివయ్య ఇలా అన్నాడు.
ఏంది నాకంటే ముందు నువ్వు తినేసావా అయ్యో లేదండి. నేను ఎక్కువ వండాను ఇందులో సగం ఎలా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. సర్లే నాకు పెట్టు తినేసి తొందరగా వెళ్లాలి .
నువ్వు మళ్ళీ వండుకో ఇవన్నీ చూసి అయోమయం లో ఉన్న శారద ఇక్కడ అనుమానస్పదంగా ఏదో జరుగుతుందని భయంతో నిద్ర పట్టక అలా ఆలోచిస్తూనే ఉంది.
గాలికి రెపరెపలాడుతున్న కిటికీలను మూసి మళ్ళీ పడుకుంది .
అలా పరధ్యానంలో ఉన్న శారద ఒకేసారి పైకి చూసేసరికి పేలు చూసుకుంటున్న రెండు దయ్యాలు కనపడ్డాయి. ఒకేసారి ఉలిక్కిపడి గట్టిగా అరిచిన అరుపుకి శివయ్య లేచి కూర్చొని ఇలా అన్నాడు.
ఏమైంది అర్ధరాత్రి ఏంటి గోల పైన రెండు దయ్యాలు ఉన్నాయి అని కళ్ళు మూసుకొని చూపించింది.
అక్కడ ఎవరూ లేరు అంతా నీ భ్రమ ప్రశాంతంగా పడుకో.
ఇంట్లో దయ్యాలు ఉన్నాయండి ఖాళీ చేసి వెళ్ళిపోదాం.
అలాంటివి ఏమీ లేవు నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు ఇక్కడ భయపడటానికి ఏం లేదు శారద బావిలోని నీళ్లు తోడడం మొదలుపెట్టాక ఏదో బరువైనది పైకి లాగుతూన్నట్టుగా అనిపించింది.
పైకి వచ్చేసరికి ఖాళీ బిందె బయటికి వచ్చింది అప్పటికి ఎంతో భయంతో ఉన్న శారద ఆ నీళ్ళు తోడడం ఆపేసి ఇంట్లోకి పరుగుతీసింది.
శివయ్య ఇంటికి రాగానే ఇలా అంది మన బావిలో కూడా దయ్యం ఉందండి నాకు చాలా భయంగా ఉంది .
ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఇక్కడ ఎటువంటి దయ్యాలు లేవు నువ్వు ఏవేవో ఊహించుకొని భయపడుతున్నావు అలా సర్దిచెప్పడానికి శివయ్యని లెక్కచేయకుండా శారద ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
ఇదంతా పై నుంచి చూస్తున్న కేరింతలు కొడుతున్న దయ్యాలు ఇలా అనుకున్నాయి అమ్మయ్య ఒక పని అయిపోయింది.
వీడిని కూడా త్వరలో తరిమేస్తే మనం మళ్లీ ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!