ఊహలు

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

ఊహలు

రచయిత :: పద్మావతి తల్లోజు

మెల్లగా కదిలి వెళ్లే మబ్బులపై స్వారీ చేయాలనే పిచ్చి కోరిక నిలువనీయదు
వృధా ప్రయత్నమని తెలిసినా.,
మనసు గాలిలో మేడలు కట్టడం మానదు
మదిలోని ఊహలకి రెక్కలొచ్చి
మబ్బులతో పోటీగా
విహంగాలై ఎగురుతున్నాయ్..
ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ
పరుగులు తీస్తున్నది కాలం
క్షణ భంగుర మైనా కూడా
కాలకూట విషంలోని
చేదును తలపించే ఈ జీవితంలో
ఊహలే లేకపోతే .. !?
బాప్ రే……
ఊహించుకోవడానికే భయంగా ఉంది
ఆశల మెట్లను పరిచి, ఆకాశానికి నిచ్చెన వేసి
ప్రేమ శిఖరం అధిరోహించాలని ఆశ!
నెరవేరుతుందా?
అంతదాకా…
ఊహలే నాకు ఊపిరి పోస్తాయ్!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!