ఆత్మవేదన

ఆత్మవేదన

రచయిత :: జయకుమారి


దివ్య ఎందుకే  అలా అలుగుతావు.!

మేము రాలేదు అంటే ఎక్సమ్స్ ఉన్నాయి.!

అయిన నాన్న పంపించరు తెలుసుగా.!
అర్థం చేసుకోవే!
అంటు జయ బ్రతిమాలడటం ,దివ్య ఇంకా బెట్టు చేస్తుంది.

జయ దగ్గర నుండి ఫోన్ తీసుకొని ,
మేము రాలేదు సరే ,నీవు వచ్చి అమ్మని , నాన్న ని అడిగి మమ్మలిని తీసుకువెళ్ళు!

ఎలాగు  సెలవలు వస్తున్నాయి కదా ! అని అంది ప్రవీణ.

పక్కనే ఉన్న శిరీష కూడా అవును నిజమే! దివ్యనే వచ్చి తీసుకుని వెళ్ళమని బా చెప్పావు ప్రవి.!

జయ:- ఊరుకోండి ఇద్దరు రమ చనిపోయిన తర్వాత మనం అస్సలు వెళ్ళలేదు.పాపం అది ఒక్కదే అయ్యిపోయింది కదా.!చిన్నఅమ్మమ్మ కూడా రమ్మంది  కదా.!

ప్రవి:- రమ్మంది కానీ మనం ఎలా వెళతాం అమ్మ పంపాలి కదా.
(జయ,ప్రవీణ అక్కచెల్లలు, శిరీష వీళ్ళ మావయ్య గారి అమ్మాయి, అయిన జయ,ప్రవీణ లతో మేనత్త దగ్గరే ఎక్కువ పెరిగింది.)
(దివ్య వీళ్ళ చుట్టాల అమ్మాయి.)

శిరీష:-సరే జయ దివ్య వస్తాను అంటే,శివ ను కూడా రమ్మందాం.!
జయ:-సరేలే ముందు పడుకోండి, నాన్న వస్తే ముగ్గురి కి పడతాయి.
అలా కబురులు చెప్పుకుంటూ నిద్రపోయారు.
జయ:- చదువుకోవడానికి అలారం పెట్టుకుని లేచింది కానీ. ఏదో అలజడి భయం,చనిపోయిన రమే కల్లో కూడా !అదే ఆలోచిస్తూ బాత్రూమ్ కి వెళ్లి వస్తుంటే ఒకటే దడ గా, భయం గా అనిపించింది.ఎవరో అక్కడ నిలబడి ఉన్నట్టు అనిపించి. వెనుక కు తిరిగి చూసే సరికి ఎవరో పరికిని ఓణి వేసుకున్న అమ్మాయి అక్కడ నుంచిని ఉంది.!ఎవరు అని దగ్గరకు వెళ్లి చూస్తే ఎవరులేరు. కొంచెం భయం గా అనిపించి ఇంట్లోకి వెళ్లిపోదాం అనుకునే సరికి మళ్ళీ వేరే చోట ఉన్నట్టు అనిపించింది!ఇక అంతే అక్కడ ప్రాణాలు పోయినట్టు అనిపించింది.!ఒకటే చెమటలు, అక్కడి నుచి వెళ్లిపోదాం అనుకుంటున్నా కానీ అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతుంది.

ఒక్క పరుగున గదిలోకి పరిగేట్టుకొని వెళ్లి మంచం మీద దేవుడు ఫోటో పెట్టుకొని.శ్రీఆంజనేయం అనుకుంటూ కురుచుంది.రమ నే చాలా గుర్తుకు వస్తుంది. నేను ఇప్పుడు అక్కడ చూసింది తనే నా ఇంకెవరో నా, తను చనిపోయింది గా తను ఎలా?వామ్మో తను ఆత్మ నా!తన భయం ఇంకా ఎక్కువ అయ్యింది.తన జ్ఞాపకాలు  ఊపిరి ఆడనివ్వడం లేదు.తన తో ఆడుకున్న ఆటలు, గొడవలు ,తన అలకలు అన్ని గుర్తువస్తున్నాయి.!హఠాత్తుగా ఫోన్ రింగ్ అయిన శబ్దం విని వెళ్ళింది కానీ ఫోన్ రింగ్ అక్కడికిి వెళ్లి చూస్తే, రింగ్ అవ్వలేదు.

రమ చనిపోయే ముందు రోజు ఫోన్ చేసి జయతో మాట్లాడాలి జయను ఫోన్ చెయ్యమను  అని  శ్రీ కి చెప్పడం, జయ అదే టైం కి ఆటలు పోటీ కి వేరే ఊరు వెళ్లే హడావిడిలో ఉండి ఫోన్చెయ్యలేకపోవడం ,

తను తిరిగి వచ్చేటప్పటికి.! రమ కిరోసిన్ పోసుకుని చనిపోయింది అని తెలియడం,తన మీద బెంగ తో జ్వరం రావడం, అంతగుర్తుకు వచ్చి  ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. నిద్రలోనే ఏవో శబ్దాలు, ఎవరో ఏడుస్తున్నట్లు ఒకటే కలవరం . ఎందుకు ఏడాది నుంచి లేని అలజడి దివ్య కాల్ చేసిన దగ్గర నుండే మొదలు అయ్యింది.

నేను రమ గురించి ఆలోచించడం వల్ల, లేక రమ ఆరోజు నాతో ఏమైనా చెప్పుకోవాలి అని అనుకుందా! అందుకేనా నేను వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చిన దగ్గర నుండి ఇలా అనిపిస్తుందా నాకు !ఏమో తెలుసుకోవాలి తను ఏదో చెప్పాలి అనుకుంటుంది.! నా ద్వారా తను ఏదైనా చెప్పాలి అనుకుంటుందా!హ్మ్మ్” సరే ఏమి జరుగుతుందో చూద్దాం.! ముందు అమ్మని ఎలా అయినా ఒప్పించాలి.మాతో పాటు శివ గాడిని(తమ్ముడు) తీసుకువెళ్లాలి.అమ్మని ఒప్పించారు ,అందరు రమ ఊరికి బయలుదేరి వెళ్లారు.అక్కడ అడుగు పెట్టగానే ఏదో బలంగా నన్ను తాకినట్టు అయ్యింది.ఆ స్పర్శ తెలుస్తుంది నాకు.మాతో పాటు అమ్మ వాళ్ళు కూడా వచ్చారు.ఎలా? ఎలా! తెలుసుకోవాలి రమ గురించి, ఎవరిని అడగాలి?.
సరే నన్ను ఇక్కడి వరకు తీసుకోచ్చావు కదా  రమ, తరువాత  ఏమి చెయ్యాలో నీవే దారి చూపించు. ఇంతలో మాకు ఆ ఊరి లో చాలా మంది చుట్టాలు ఉన్నారు. ఒకోక్కరి ఇంటికి వేళదాం అని భయలు దేరాము. ముందు దేవి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము.!
ఎప్పుడు వచ్చారు,అమ్మ వాళ్ళు కూడా వచ్చారా!
హా పిన్ని వచ్చారు! దివ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు.!

“ఏంటి వాళ్ళ ఇంటికి వచ్చారా!”

ఆ… ఎందుకు పిన్ని అలా అంటున్నారు.!
ఎప్పుడు ఇక్కడకు వచ్చిన  అక్కడే ఉంటాం కదా!
అంటే అది  కాదు.
వాళ్ళ ఇంటి గురించి ఊరిలో రకరకాలుగా అనుకుంటున్నారు.
ఏమి అనుకుంటున్నారు పిన్ని?
వాళ్ళ అమ్మాయి రమ చనిపోయింది కదా!
అవును పిన్ని అప్పటినుంచి రానేలేదు మేము. దివ్య ఏడుస్తుంది, అందుకే వచ్చాము.!

అవును !కానీ ,పరిస్థితులు బాలెనేప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే బాగుంటుంది కదా అని  అంటున్న జయ.!
ఏమి పరిస్థితులు పిన్ని అని సిరి,ప్రవి అడిగే సరికి పిన్ని ముఖంలో కంగారు.
అబ్బే! అదేమి లేదు అంటూ మాటలో తడబాటు.!

ఏమైంది పిన్ని?

అదేమి లేదు లే బాబు!

నాకెందుకు వచ్చింది లేమ్మా! మీరు జాగ్రత్తగా ఉండండి.అంటూ  లోపలికి వెళ్ళిపోయింది.
కనీసం కూర్చోండి అని కూడా అనలేదు.
ఎవరి ఇంటికి వెళ్లినా అదే పరిస్థితి ఎదురయ్యింది.
అక్క వీళ్ళందరికి ఏమి అయ్యిందే,వీళ్ళందరిని చూస్తే భయం వేస్తుంది.!

ఏదో తేడ కొడుతోంది వెళ్ళిపొదామే మనం, అనే సరికి ప్రవి,సిరి నవ్వుతూ..

ఎక్కడికి వేళతావ్ రా! రమ తో మాట్లాడాలి గా నువ్వు ఈరోజు నైట్.!

అక్క చూడవే ఇది… అలా అన్నావు అంటే మా అమ్మతో చెబుతా!.

అబ్బా! సిరి నువ్వు ఆగు.

అయిన నువ్వేంటి రా శివ ,అలా బయపడుతున్నావ్.! కాసేపు మీ గోల పక్కన పెట్టి అందరూ అలా ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసుకోవాలి? నాకు అర్ధం కావడం లేదు. ఒక పని చేద్దాం!

రమ ఎందుకు చనిపోియిందో  రజని ని అడుగు ప్రవి.!

తను నీతో బా మాట్లాడుతుంది  కదా!
సరే అక్క నేను వెళ్లి అడుగుతా, మీరు ఈ లోపు రమ బుక్స్ వెతకండి.!

సిరి :- రమ బుక్స్ ఎందుకు నానమ్మ చూస్తే బాధ  పడుతుంది.!

శివ:- ఆ.. ఎందుకు అంటే రమ కోసం అని చెబుతావా ! పిచ్చి అంటూ సిరి ని ఒకటి వేస్తాడు.!

మీరు ఆ గొడవ ఆపితే వచ్చిన పని చూద్దాం.
జయకు రమ పేరు ఎత్తినప్పుడళ్ల ఎవరివో ఏడుపు వినిపించేది  అది  ఎవరు? రమ దా ఆ గొష  అనిపించేది.!
ప్రవి వెళ్లి రజని ని అడిగింది.

రజని చెప్పిన మాటలు ,ఇంటికి వచ్చి జయ,సిరి,శివ తో చెప్పింది ప్రవి.

ఆ మాటలు విని జయ కళ్ళలో నీళ్లు, ఎందుకు? ఇలా చేశావ్ రమ అంటూ ఏడుస్తుంది.!

శివ అక్క ఏంటి ఇది  ఎవరైనా చూస్తే  ఏమనునకుంటారు. దివ్య చూస్తే బాగోదు.

మరి ఏమిటి రా ఇది. అది ఎంత దాని వయస్సు ఎంత ? దాని మీద అంత పెద్ద నింద వేస్తారా చెప్పు? అది ఎందుకు చనిపోవాలి అనుకుందో,ఏ బాధ ఉందో మరి ఎవరికి తెలుసు?
అవును నేను ఒప్పుకుంటాను!.అది చేసింది తింగరిపని,అది అలా చెయ్యడం వల్ల అందరం బాధ పడుతున్నాం.!క్షణికావేశంలో  ఏమి చేస్తుందో తెలియని స్ధితిలో చేస్తే దాని మీద, ఎవరి తోనో తిరిగి చనిపోయింది అంటారా!తప్పు చేసి తెలిసిపోతుంది అని ఆత్మహత్య చేసుకుంది అంటారా! ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి.!సిరి,ప్రవి,శివతో జయ ఎలా అయినా రమ ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలి.రమ చనిపోయే రెండు రోజుల ముందు నాకుఫోన్ చేసిఆ రోజు నేను ఫోన్  తిరిగి చేసి ఉంటే తను మనకి దూరం అయ్యేది కాదు.!

సరే అసలు కారణం తెలుసుకొని తన మీద పడ్డ నిందను పోగొట్టాలి.!

అక్క రమ చనిపోయినప్పుడు వాళ్ళ నానమ్మ ఒక్కదే ఇంట్లో ఉంది అని అనుకున్నారు.!

హా అవును జయ మా అమ్మ వాళ్ళు అనుకుంటుంటే నేను, ప్రవి అక్కడే ఉన్నాం.!

హ్మ్మ్ సరే ముందు రమ బుక్స్ వెతకాలి.

ఇప్పుడు వద్దు రేపు వెతుకుదాం, దివ్య కి కూడా విషయం చెపితే మంచిది అక్క అని శివ అన్న మాటలకి ప్రవి,సిరి కూడా అవును విడు చెప్పినట్లు చేద్దాం.! దివ్య కి వాళ్ళు చెయ్యాలి అనుకున్న పని గురించి చెప్పి. వాళ్ళ నానమ్మ గురించి అడిగారు.! దివ్య చెప్పిన మాటలు బట్టి రమ మరణం వెనుక ఈవిడ హస్తం కూడా ఉండి ఉంటుంది. సరే రేపు మాట్లాడదాం పడుకోండి.!

అందరూ ఎవరి ప్లేసులో వాళ్ళు  నిద్రపోయారు. కానీ జయ పూర్తిగా రమ ఆలోచనలతో మునిగిపోయింది.అద్దరాత్రి అయిన నిద్రపట్టలేదు. కుక్కలు ఒక పక్క అరుస్తున్నాయి. సరిగ్గా అదే టైం కి కరెంటు పోవడంతో జయలో నెమ్మదిగా భయం మొదలు అయ్యింది. ఈలోపు కరెంట్ పోవడంతో గాలి లేక, సిరి, ప్రవి,శివ,దివ్య కూడా లేచారు.

అక్క నువ్వు ఇంకా నిద్ర పోలేదా అనే శివ, ప్రవి మాటలకి, సిరి జయ గురించి తెలుసిందిగే గా, రమ ఆలోచనలు తనని నిద్రపోనివవ్వు.తన మీద పడిన నింద ను అబద్ధం అని నిరూపించే వరకు నిద్రపోదు.! ఈ లోపు కుక్కల అరుపులు విని వీళ్ళకి భయం మొదలు అయ్యింది.

చీకటిలో  డోర్  తీసుకొని నెమ్మదిగా బయటకు వచ్చారు ఐదుగురు.
గాలి దుమ్ము కూడా మొదలైంది.
దివ్య,సిరి,ప్రవి వాష్రూమ్ కి వెళ్లారు. కానీ  భయంతో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవడం చూసి శివ నవ్వుకుంటూ..
శివ చూడు అక్క వాళ్ళ ముగ్గురిని, నేను బయటకు వెళ్ళొస్తా అక్క.

వద్దు రా చీకటిలో ఒక్కడివే ఎందుకు ? వాళ్ళు రాని నువ్వు వెల్దువు గాని.

శివ:- ఏమి అనుకుంటున్నావ్ అక్క ఈ శివ గాడు అంటే.

ఏడిచావులే ఎందుకు చెబుతున్నానో విను.!

లేదు అక్క ఇప్పుడు మాత్రం వినను.!

నా ధైర్యం ఏమిటోఆ ముగ్గురికి చూపిస్తా.!

వాడి కర్మ నీకెందుకు జయ అని దివ్య, సిరి

వేళ్ళు ఆ మూలనే రమ కనిపించింది అంట అంటూ ప్రవి.!

వాళ్ళ ముందు పోజ్ కొట్టుకుంటూ వెళ్ళాడే కానీ లోపల మ్యూజిక్, వణుకు అన్ని మొదలయ్యాయి.! అది వాడి ఫేస్ లో గమనించి జయ వద్దు అంది.! వాడు వెళ్తున్న వైపు చెట్లు గాలికి బాగా ఊగుతున్న యి. వెనకాల గాలికి ఎగిరి వచ్చి ఆకులు అవి బాగా పడుతున్నాయి. కొంచెం భయం అల్లా ఎక్కువైంది.

వెదవా ! నీకు ఎందుకురా ఎదవా టీ..టి..లు నువ్వు మళ్ళీ పెద్ద బిల్డప్  చావు వేదవా! అనుకుంటూ నోట్లో తనలో తానే తిట్టుకుంటూ.
ఒక చోట ఆగి తన పని తాను వచ్చిన పని పూర్తి చేసుకుందాం అన్నట్టు గా,ఈ లోపు గాలి ఎక్కువ అయ్యి పక్కనే దండెం మీద వున్న చూన్ని ఒకటి  గాలికి ఎగిరి వచ్చి మీద పడే
సరికి వాడికి కింద మీద తడిసిపోయి,
మమ్మీ …..మమ్మీ… అంటూ..
ఎలా పరిగెట్టాడో తనకే తెలియకుండా పరిగేట్టుకుంటూ  వెళ్ళి జయను పట్టుకుని.
అక్కా.. అక్క..!

వద్దే ..వెళ్లిపోదాం నేను ఒక్క రోజు కూడా ఉండను అంటూ ఏడుపు మొదలు పెట్టాడు.!

సిరి,ప్రవి,దివ్య కి కూడా ఒక పక్క భయం,ఒకపక్క శివగాడి ఫేస్ చూస్తే నవ్వు, ఏడుపు కలిపి  వస్తుంది.!

అక్క నువ్వు రా!

ఈ ఎదవాల్ని ఇక్కడే చావని, వద్దు రాను అంటున్నా నన్ను లాక్కుని వచ్చారు ఈ దొంగ మొఖాలు.! శివ చేసిన అల్లరికి కాసేపు నవ్వుకుంటూ.!.

ఇంట్లోకి వెళ్లారు కానీ ఎవరికి నిద్ర పట్టక రమ బుక్స్ వెతకడం మొదలు పెట్టారు.! రమ చిన్నప్పటి నుంచి చిరుతిళ్ళు తినే అలవాటు. వాటకి డబ్బులు లేకపోతె  ఇంట్లో చెప్పకుండా దొంగతనంగా తీసే అలవాటు ఉంది అని జయవాళ్ళకి తెలుసు!.

చనిపోయే ముందు రోజు కూడా అలా తీసి ఏదో కొనుక్కుని  ఉంటుంది.అని ఒక బుక్ లో ఏవేవో రాసి కోట్టిసినట్లు అవి సరిగా అర్ధం కాకుండా ఉన్నాయి. సరే మేటర్ అర్ధం అయ్యింది.! దివ్య మాములుగా మీ నానమ్మ ను అడుగు ఏమి చేబుతుందో చూద్దాం అంటూ అనుకున్నారు.

మరుసటి రోజు మధ్యాహ్నం దివ్య వాళ్ళ నానమ్మ దగ్గర కుర్చుని అస్సలు అక్క ఎందుకు అలా చేసుకుంది నానమ్మ.

ఆవిడ ఏమో ఏమి చేసిందో నాకేమి తెలుసు. నిప్పు అంటించుకున్నకా చూసా నేను. మీ నాన్న జేబులోంచి డబ్బులు దొంగిలించి వాడు తిడతాడు అని భయంతో అలా చేసుకుంది ఏమో అంత కన్నా నాకు ఏమి తెలియదు అంటూ అక్కడి నుంచి తప్పుకోడానికి ప్రయత్నం చెయ్యడం, ఆవిడ మాటల్లో తడబాటు లో దివ్య కి అర్ధం అయ్యింది.

ఈ లోపులో జయ పెద్ద పెద్దగా ఏడుస్తూ,కాసేపు పెద్ద పెద్దగా నవ్వుతూ వింతగా ప్రవర్తిస్తుంది. ఎవరు మాట్లాడిన కేకలు వేస్తుంది. వీళ్ళకి భయం మొదలు అయ్యింది. అందరూ వచ్చి జయ జయ అంటుంటే .
ఆహా.. ఆహా.. ఎవ్వడు రా జయ…
అంతే ఆ మాటకి అందరికి చెమటలు పట్టాయి.
జయ అరిచే అరుపులుకు చూట్టూ పక్కల జనాలు పెద్దగా గుంపులు గా చేరారు.
వాళ్ళని చూసి ఇంకా గట్టిగా కేకలు,హడావిడి చేస్తూ దివ్య వాళ్ళ నానమ్మ ను పట్టుకొని చెప్పు నన్ను ఎందుకు చంపేశావ్? అని రెండు ఉతకడం మొదలు పెట్టింది.
ఆ దెబ్బలకి  తట్టు కోలేక నేను నిన్ను చంపేసాన రామ..రామా.. నేనా..
జయ మాటలకి రమ వాళ్ళ అమ్మ ,నాన్న కూడా ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయారు.

లేదు నిజం చెప్పు ముసలి ఈ రోజు నువ్వు నిజం చెప్పనిదే నేను నిన్ను వదలను. నన్ను చంపేసి నేను ఎవరినో ప్రేమించి వాడి కోసం ఇంట్లో డబ్బులు దొంగిలించనా.!

నిజం చెప్పుతావ లేదా అని అక్కడ చీపురు కట్ట తీసుకొని పరిగెత్తించి,పరిగెత్తించి మరి బెదిరించడం చూసి జయ సిరి వాళ్ళ కి నవ్వు ఆగడం లేదు.
చివరికి ఆవిడికి అలుపు వచ్చి ఆగవే.. ఆగవే..ఆగు.. చెబుతా నిజం చెబుతా.!
కానీ నిన్ను నేను చంపలేదు.!
మరి ఏమి చేసావు చెప్పు, నేను ఎందుకు? చనిపోవలసి వచ్చింది.!నేను ఎవరితోనో తిరేగాన,నిజం చెప్పు.

నీ మనవరాలనే కదే  నిప్పు అంటుకొని  కాపాడండి, కాపాడండి అని ఏడుస్తున్న నా దగ్గరకు ఎవరు రాలేదే మీరు అస్సలు మనుష్యులేనా,! 15 ఏళ్ళు కూడా లేవు నాకు ,లేని పోనీ తప్పుడు పనులు చేశానని ప్రచారం చేస్తారా! ఏమి అన్యాయం చేసా నేను చెప్పు. ఇంకో రెండు ఉతికే సరికి .!
అవును నువ్వు ఏమి తప్పు చెయ్యలేదు. ఆ డబ్బులు నేనే తీసాను, నువ్వు తీసావని మీ నాన్న కి నేనే చెప్పి వాడికి నీ మీద కోపం వచ్చేటట్లు చేసాను.
అదే ఎందుకు అని అడుగుతున్నా చెప్పు అని గట్టిగా అరిచేసరికి,
హా! చెబుతా చెబుతా నన్ను ఏమి చెయ్యకు.
మరి చెప్పు,!
నేను డబ్బులు తీయడం రమ చూసింది. అది మళ్ళీ వాళ్ళ నాన్న తో చెబుతుంది అని ,దాని కన్నా మొదట నేనే తన మీదకు నెట్టేసాను. నా మాటలకి వాడు తనని కొడతాడు అని భయపడి అది ఆ పని చేసింది. అంతే కానీ అది ఏ తప్పు చెయ్యలేదు. అని ఏడవడం మొదలు పెట్టింది.!
ఆ మాటకి దివ్య  వాళ్ళ నాన్న ఎంత పని చేశావ్. నా కూతురి చావుకు నువ్వు కారణం అయ్యావు.! అది చిన్నపిల్ల కదా ఎలా చెయ్యగలిగావు ఆ పని. అది నిప్పు అంటుకొని ఆ మంట కి విలవిల ఆడిపోయివుంటుంది. పాపం నేను ఎక్కడ దానిని ఏమైనా చేస్తానని. క్షణికావేశంలో,భయం తో ఏదో తొందరపాటులో చేసింది. పెద్ద దానివి ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేకుండా పోయింది. నువ్వు ముందు నా ఇంట్లో నుంచి వెళ్లిపో ఒక్క క్షణం కూడా ఉండటానికి లేదు నా ఇంట్లో, పో..పో..అని🙏
ఆవిడ అక్కడ నుండి వెళ్తుంటే చుట్టు పక్కన వాళ్ళు ఎంత పని చేసింది ఈ ముసలిది మనవరాలనే ప్రేమ లేదు,కనీసం జాలి కూడా లేదు,ఎన్ని అబద్ధాలు చెప్పింది. పాపం ఆ పిల్ల చిన్నపిల్ల ఎంత బాధ పడి వుంటుంది. ఏ తప్పు చెయ్యని పిల్లా అన్యాయం గా బలి అయ్యిపోయింది. అని అనుకుంటూ వెళ్తుంటే…

జయ నెమ్మదిగా శాంతిించిన్నట్లు ప్రశాంతంగా నవ్వుతూ కళ్ళు తిరిగిపడిపోతుంది. అప్పుడు అందరూ వచ్చి కొన్ని నీళ్లు చిమ్మి లోపలికి తీసుకు వెళ్లి పడుకో బెట్టి,సిరి, ప్రవి,శివ,దివ్యలను తోడుగా  బెట్టి  అందరూ బయటకి వచ్చేస్తారు.!

వాళ్ళు ఇలా బయటకి రాగానే ఐదుగురు ఒకే సారి నవ్వుతూ జయ అక్క నువ్వు సూపర్ ముసలిదానితో భలే ఆడుకొని నిజం చెప్పించావ్. జయని అందరూ కౌగిలించుకొని. అక్క  ఇప్పుడు సంతోషమే గా నీకు , రమ ఏ తప్పు చేయలేదని అందరి ముందు చెప్పించావ్ కదా !  అనుకున్నది సాధించావ్.

సిరి,ప్రవి ఎలా వచ్చింది నీకు ఈ ఐడియా .

హ్మ్మ్ దివ్య అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఆవిడ తడబాటు వెనుక ఏదో కారణం వుంటుంది. అని నాకు అనిపించింది.

అది ఎవరు అడిగిన నిజం చెప్ప దు !!.
ఎలాగూ రమ దెయ్యం అయ్యి తిరుగుతుంది అని చెబుతున్నారు కదా! అని, రమ అయితే నే
ఆవిడ భయపడి నిజం చెబుతుంది అని పించి ట్ర్య్ చేసా విజయం సాధించి రమ ఏ తప్పు చేయ్యలేదని  నిరూపించి తనను తిట్టిన వాళ్ళు  కూడా ఏ తప్పు చెయ్య లేదు,తను మంచి పిల్ల అనిపించాను.అప్పుడు కానీ జయ మనస్సు శాంతించ లేదు!.

ఒక విషయం దెయ్యాలు, ఆత్మలు వుంటాయో లేదో కూడా నాకు తెలియదు.! కానీ ఒక చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ పిల్ల మానసిక స్థితి ఏ విధంగా ఉందొ ,ఎంత భయపడి ఉండి ఉంటుంది అని కూడా తెల్సుకోకుండా .! ఆ చిన్నపిల్ల మీద పెద్ద నింద లు వేశారు. పాపం ఆ తల్లీ తండ్రి ఎంత బాధ పడివుంటారో. చనిపోయిన మనిషికి నిజం గా ఆత్మ అనేది ఉండి ఉంటే తను ఎంత క్షోభించి ఉంటుందో కదా!. దయ చేసి అందరికి ఒక విషయం చెప్పాలి నుకుంటున్న!.

ఏ ఆడ పిల్ల గురించి అయినా పూర్తిగా తెలుసుకోకుండా వారి మీదా నిందలు వేయకండి.!

వారి తప్పు చేసివుంటే ఆ తప్పును సరిచేసి, అలా చెయ్యకూడదు అని నెమ్మదిగా చెప్పండి. వారికి మనం ఉన్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి.
వారిని ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడండి🙏

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!