అలజడి

అలజడి

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రేపాక రఘునందన్

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆలోచనలతో ఉనికిని కోల్పోతానేమోనని  భయంగా ఉంది.
అలజడి సృష్టిస్తూ
అయోమయంలో పడేయటమే  కాకుండా
భావావిష్కరణలో ప్రధాన శత్రువులుగా  రూపాంతరం చెందుతున్నాయి.
దేహం ఒకటే అయినా అనంతాలై  అక్షరాలను ఆవేదనకు గురి చేస్తున్నాయి,
శతవిధాల ప్రయత్నించినా ఒక కొలిక్కి రాకుండా  విలాసంగా నవ్వుతూ,
హేళన చేస్తూ పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తున్నాయి…. ఎందుకో.. ఏమో…
నిన్న మొన్నటి వరకు నా చెప్పుచేతల్లోనే ఉంటూ అకస్మాత్తుగా దారి తప్పి
మానసికంగా నన్ను హింసిస్తున్నాయి. అంకురాలనుకుంటే
అంకుశాలుగా మారి
ఆవేదనను మిగిల్చి
అడ్డదారుల్లో పయనిస్తున్నాయి.
హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ
బుజ్జగిఃపుల్న  చులకన చేస్తూ.
సంచరిస్తూనే ఉన్నాయి.
ఉవ్వెత్తున ఎగసి పడే కడలి కెరటాల్లా
ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని సైతం నియంత్రిస్తున్నాయంటే.
వాటికింత తెగువ ఎక్కడినుంచి వచ్చిందో
అర్థం కావడం లేదు
నిస్సత్తువ కమ్మేస్తుంది
వెలితి గాను ఉంది.
ఏడుపు కూడా వచ్చేస్తుంది.
వాటిని అదుపు చేయలేక పోతున్నందుకు..
దీనికి పరిష్కారం కాలమా… సంయమనమా…
ఎటూ తేల్చుకోలేని అగమ్యగోచర స్థితి.
నాది బయటకు చెప్పుకోలేని విచిత్ర.
అనిర్వచనీయ పరిస్థితి నాది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!