జీవన సమరం

జీవన సమరం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

పుట్టుక నుంచి మరణం వరకు
మానవుడు నిరంతరం మనుగడ కొరకై
పోరాటం చేస్తు జీవనయాత్ర కొనసాగిస్తు ఉంటాడు
బాల్యంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల
అదుపు- ఆజ్ఞలో, ఆలనా- పాలనలో
ఉన్నతస్థితి పొందుటకై విద్యాసంస్థలలో,
ఇరుగు పొరుగు వారితో పోటీపడటమే
మొదటి జీవనపోరాటం…… !!
ఉద్యోగాన్వేషణకై ఉన్నతచదువులు చదివినా
కాలంతో పోరాటం, ప్రమోషన్లకై ఆరాటం,
తదుపరి వివాహమై జీవితభాగస్వామితో చెలగాటం,
సంతానం విషయమై వారి
ఉన్నతి కోసం పగలనక,రేయనక
ఉరుకుల,పరుగుల జీవితంతో సగటు జీవి
నిత్య పోరాటం……!!
కాలం ఎవరికోసం ఆగదు కదా.
విశ్రాంత జీవితాన భాగస్వామితో యాత్రలు,
దేవుళ్ళ సందర్శనాలు చేస్తు
మనుమల ఆట పాటలతో ఆనందించే వేళ
ఆదిశంకరులు చెప్పినట్లు
కన్ను,పన్ను వంటి రుగ్మతలు జాగ్రత్త
నీ జీవిత ప్రయాణం లో ఆఖరి మజిలీ అనుకునే లోపునే
అనుకోకుండా శ్రీరామచంద్రుని పాదాల దరికి
నలుబది సంవత్సరాలు నాతో కలసి
ఆలనా పాలన చూసేమీ కేమి తెలియదు
ఎలా బ్రతుకుతారో అన్న సహధర్మచారిణి పరలోకపయనం.
కావున మనిషి జీవితమంతా జీవన సమరమే ఇది తెలుసుకుని
జీవిత పరమార్ధాన్ని అర్ధం చేసుకో మానవా మానవత్వమే మాధవత్వమని
ప్రేమతత్వమే మోక్షత్వమని తెలుసుకో……!!
……..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!