కలలు కల్లలైనవేళ

కలలు కల్లలైనవేళ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

ఆకాశహార్మ్యాలు కట్టుకొని ఆనందంగా జీవించాలనే కల కల్లలైనవేళ.
అంతరీక్షాన్ని జయించి అక్కడే నివాసముండాలనే కల కల్లలైనవేళ.
చంద్రునిపై నివాసలేర్పరుచుకుందామని కల కల్లలైనవేళ.
పచ్చని పంటపోలాలు నిత్యపంటలు పండేరోజులకల కల్లలైనవేళ.
శీతలపవనాలనందించే తరువులు తనువులను పులకరించే కల కల్లలైనవేళ.
సామాన్యుని జీవితం సాఫిగా సాగేకల కల్లలైనవేళ.
శ్రమజీవులకష్టాలకు తగినప్రతిఫలం అందేకల కల్లలైనవేళ.
నిరుద్యోగలందరకి ఉపాధిలభించేకల కల్లలైనవేళ.
అత్యాచారపర్వాలు జరగనికల కల్లలైనవేళ.
అవినీతి పీఢనలులేని సమాజపుకల కల్లలైనవేళ
అనాధలందరికి ఆశ్రయంలభించేకల కల్లలైనవేళ.
హక్కులకోసం పోరాటాలు ఆందోళనలు జరగనిదేశపుకల కల్లలైనవేళ.
సరిహద్దుల్లో ఆక్రమణలులేనికల కల్లలైనవేళ.
అంతర్జాతీయంగా అన్నిదేశాలు సామరస్యంగా మెసులుకొనేకల కల్లలైనవేళ.
శాంతిసుహృద్భావంతో ప్రపంచమంతా ఒకటైనకల కల్లలైనవేళ.
సమసమాజనిర్మాణపుకల కల్లలైనవేళ.
మతసామరస్యంతో మనషులంతా ఒక్కటైనకల కల్లలైనవేళ.
కులవిభేధాలు లేనికల కల్లలైనవేళ….
మానవసమాజం నీర్వీర్యం అవుతుందేమో….?
ప్రపంచమేధావులారా ఆలోచించండి….!
ఒక్కక్షణం సగటుకలలు కల్లలుకాకూడదని ఆశించండి….!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!