నేలనేలే నాయకుడు

నేలనేలే నాయకుడు

రచన :: జె వి కుమార్ చేపూరి

బీడు నేలను పచ్చని మాగాణిగ మలచి
పంట సిరుల పండించు శ్రమజీవి రైతన్న
సకల ప్రాణుల జీవశక్తికాధారమైన
ఆహారాన్ని అందించే అన్నదాత రైతన్న

ప్రాణవాయువిచ్చి మన ప్రాణాలు నిలిపే
మొక్కల పెంచిపోషించు ప్రకృతి ప్రియుడు రైతన్న
వీరోచితంగా ప్రకృతి ప్రళయ విపత్తుల కెదురొడ్డి
పంట సాగుచేయు వీర జవాను రైతన్న

ఇల పశుపక్ష్యాదుల ప్రేమగ పెంచి
లాలించే ఏకైక జంతు ప్రేమికుడు రైతన్న
తాము పస్తులు పడుకున్నా పరుల
కడుపు నింపు పరంధాముడు రైతన్న

వేరే వృత్తిని ఎన్నడూ మరగని వాడు
నెలతల్లినే నమ్మిన నమ్మకస్థుడు రైతన్న
ఆరు నూరైనా వ్యవసాయమే తన వృత్తి
సాటి మనిషికి తిండి పంచడమే తన ప్రవృతి

వ్యవసాయమే దేశానికి అసలైన సిరి
అదివున్న దేశానికి తిరుగే లేదు మరి
బువ్వ బొక్కేటప్పుడైనా ఒకసారి
రైతన్నను తలచుకుందాం మనసారి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!