అనురాగ దాంపత్యం

అనురాగ దాంపత్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లహరి

అది ఒక అందమైన పల్లెటూరు ..అక్కడే  అల్లారు ముద్దుగా పెరిగింది శ్రావణి. ఇల్లే ప్రపంచంగా  పెరిగింది. ఆ ఊరికి దగ్గర్లో ఉన్న టౌన్ లో డిగ్రీ కాలేజికి రోజు వాళ్ళ నాన్న గారు తీసుకొచ్చి తీసుకువెళ్ళేవారు. అలా డిగ్రీ పూర్తి చేసింది.
డిగ్రీ పూర్తవ్వగానే ఓ సంబంధం రూపవతి ఐన శ్రావణిని వెతుక్కుంటూ వచ్చింది. అందగాడు, ఆస్థిపరుడు, ఉన్నత ఉద్యోగం ఇంతకంటే ఏమి కావాలి అని శ్రావణి తల్లి దండ్రులు సంబంధం ఒప్పుకుని వారిరువురికి పెళ్లి చేసారు. ఉద్యోగరీత్యా ఆనంద్ శ్రావణితో పాటు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇద్దరు రత్నాల లాంటి పిల్లలు పుట్టారు. అయినా శ్రావణికి ఎదో తెలియని దిగులు, ఇరుగు పొరుగు భార్య , భర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, చేతినిండా సంపాదించుకుంటున్నారు. కానీ తాను మాత్రం చదివిన చదువు వదిలేసి ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ ఇంటి పట్టున ఉండడం తనకు నచ్చడం లేదు ఇరుగు, పొరుగు వారి లాగే చేతినిండా సంపాదించి వైభోగాలు అనుభవించాలి అని ఇలాంటి ఎన్నో ఆలోచనలతో లేని పోనీ అనారోగ్యం తెచ్చుకుని మదనపడుతుండేది.
భార్య పరిస్థితి గమనించిన ఆనంద్ తన మార్పు కోసం ప్రయత్నించేవాడు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఒకరి సంతోషం మన సంతోషం కాదు మన జీవితం దేవుడు వడ్డించిన విస్తరి. మనకు ఎంత దక్కితే దానితోనే తృప్తిపడాలి అంటూ ఎన్ని మంచి మాటలు చెప్పినా అర్ధంచేసుకోలేకపోయేది.
ఏమి లేని నిస్సహాయులని చూపిస్తూ మార్చడానికి ప్రయత్నం చేసేవాడు, నీకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు నిన్ను మంచిగా అర్ధం చేసుకునే నన్ను ఇచ్చాడు, బంగారంలాంటి బిడ్డలు ఇంతకంటే ఐశ్వర్యం ఏముంటుంది. ఉన్నదానితో తృప్తిపడుతూ, ఉన్నతస్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలి అంతేకానీ పక్క విస్తరిలో నోరూరించే పదార్థాలు ఉన్నాయని మన విస్తరి పారేసుకోము కదా ! కాళ్ళకు ఖరీదైన చెప్పులు లేవని బాధపడకు అసలు కాళ్ళే లేని వారికంటే నయం కదా అనుకో ఇప్పటికైనా విజ్ఞత తెచ్చుకో సంతోషంగా, సంతృప్తిగా బతకడం నేర్చుకో అందరు మెచ్చుకునేలా అర్థవంతంగా మారు. నీ ఆరోగ్యాన్ని అనవసర ఆలోచనలతో పాడుచేసుకోవడం కాదు మనం పోయినా మన గురించి నలుగురూ మంచిగా చెప్పుకోవాలి. నలుగురికి మనం ఆదర్శంగా నిలవాలి. అదే జీవిత పరమార్థం అజ్ఞానం అనే భ్రమ పొరలు, పొరలుగా చీలిపోతుంటే అసంతృప్తి మెల్లిగా అడుగంటిపోతుంటే సరికొత్తగా, తనని తాను కనుక్కున్నట్లు మెల్లిగా ఆనంద్ కౌగిలిలో చేరిపోయింది. మీరు నా పక్కన ఉన్నంతవరకు ఏ అసంతృప్తిని నా ఆలోచనలోకి రానివ్వను అంటూ ఒదిగిపోయింది. ఆ మార్పుని ఆనంద్, సంతోషంగా స్వాగతించాడు వాళ్ళ అన్యోన్యతను చూసి పిల్లలు కూడా ముచ్చట పడ్డారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!