షీలా పిల్లి మనోవేదన

షీలా పిల్లి మనోవేధన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కందర్ప మూర్తి

మూర్తి  గారింట్లో తిస్టేసుకుని ఖుషీగా రోజులు గడుపుతున్న షీలా పిల్లికి చచ్చిన చావొచ్చి పడింది. పాల పేకెట్లు గుమ్మం దగ్గర లేటుగా తీస్తే వాటికి రంద్రం చేసి పాలు తాగే చాన్సు, పిల్లి మూతి పెట్టిందని పారపోసే పాలు మస్తుగా దక్కేవి. ఇంట్లో పాలు విరిగిపోయినా వాష్ బేసిన్లో పోయకుండా నాకే నా టబ్ లో వేసేవారు. నేనెన్ని చిలిపి పనులు చేసినా ఎప్పుడూ నన్ను తిట్టంది లేదు. నా జననం మూర్తి  గారింట్లోనే  జరిగిందట. నేను పుట్టగానే కొద్ది రోజులు నా ఆలనా పాలనా చూసి నన్ను ఇక్కడ వదిలేసి అమ్మ మరో ఇంటికి షిఫ్టు అయిపోయిందట. నా డెలివరీ టైముకి మూర్తి గారి ఇంటి అటక అనుకూలంగా నేను ఆడుకోడానికి వీలుగా ఉందని ఇక్కడ తిష్ట వేసిందట. తర్వాత మూర్తి గారి కుటుంబ సబ్యులు నన్ను చేరదీసి  ” షీలా ” పేరు పెట్టి పాలు పోసి పెద్ద చేసారు. నేను ఇంట్లో అందరికీ ముద్దుగా ఉండటానికి కారణం గోధుమ శరీర రంగు  ముఖం మీద తెల్లని నిలువు నామం మచ్చ ఉండటమే. నాకు ఈ ఇంట్లో  కొన్ని సమస్యలూ లేకపోలేదు. మూర్తిగారు శుద్ధ వైదిక బ్రాహ్మణులు. ఆచార వ్యవహారాలెక్కువ. చాదస్తపు మనిషి. పక్కాశాకాహారి. శకునాల పిచ్చి ఎక్కువ. ఉదయాన్నే నా మొహం చూడకూడదట. పూజలూ పండగలు వ్రతాలప్పుడు మడి పాటిస్తారు. నా పని అటక మీద కూర్చోవటమే. మూర్తి గారు శాకాహారైనా నాకు  మాంసాహారానికి లోటు లేదు.
వారి సామాన్ల స్టోర్ రూమ్ లో ఎంతో కాలం నుంచి మూషిక కుటుంబాలు నివాశ ముంటున్నాయి. నాకు నాన్ వెజ్ తినాలను కున్నప్పుడు అటో లుక్కేస్తాను.
అమ్మ గారికి మడితో పాటు వ్రతాలు పూజలూ బాగానే చేస్తూంటారు. అందువల్ల నాకు పాలు వెన్న నెయ్యి ప్రసాదాలు మస్తుగా దక్కుతూంటాయి.
పట్నంలో ఉండే మూర్తి గారి ఎనిదేళ్ల మనవడు బాబి శలవ లపుడు ఇక్కడి కొస్తే నన్ను వదిలి పెట్టడు. మిల్క్ బికీలు కేకులు తినిపిస్తాడు. ఇప్పుడు నా వయసు ఆరేళ్లు. ఎలాగంటే బాబి పుట్టిన రెండేళ్లకి నేను పుట్టానట. ఇలా హాయిగా ఆనందంగా ఈ ఇంట్లో రోజులు గడిచి పోతున్నాయి. ఇప్పుడు మూర్తి గారు మొత్తం ఇంటిని అపార్టుమెంటు కట్టడానికి కాంటాక్టుకి ఇచ్చేసారట. పాత ఇల్లు పడగొట్టి పునాదులు తవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మూర్తి గారు ఇంటి సామాన్లు ఎక్కడికి షిఫ్టు చేస్తారో తెలియక తికమకగా ఉంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!