మా మూగ ప్రేమ

మా మూగ ప్రేమ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఎన్.ధనలక్ష్మి

 నా జీవితంలో ఈ రోజు ఎక్సయిట్ అయినంతగ ఏ రోజువ్వలేదు. నాకు ఏదో గిఫ్ట్ అది మర్చిపోలేని ప్రేమ కానుక  తేస్తానంటూ, నేను ఆ కానుక చూసి మస్తు సర్ప్రైజ్ అవుతానంటునన్ను కన్ఫ్యూజ్ లో పెట్టీ మరి పోయాడు నా దిల్ క దడకన్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడే నా ప్రాణం నన్ను ఎప్పుడు లాంగ్ డ్రైవ్ కి తీసుకుని వెళ్ళేవాడు. నాకోసం ఏ పని అయినా సరే ఓపికగా చేస్తూ, ఎంత కష్టం అయిన ఎంతో ఇష్టంగా చేసేవాడు. నాకు తెగ ముద్దులు పెట్టేవాడు. నన్ను హగ్ చేసుకునే వాడు, నేను పక్కన లేకపోతే వాడికి అసలు నిద్ర పట్టేది కాదు.  రకరకాలుగా నాకు మేకప్ వేసి అందంగా మార్చి ఫోటోలు తెగ  తీసుకునే వాళ్ళుము. మా మధ్య గల ప్రేమను చూసి అందరు కుళ్లుకునేవాళ్లు. అయిన కూడా నా దిల్ కా దడకన్ కి నా మీద కొంచెం కూడా  ప్రేమ తగ్గలేదు సరికదా ఇంకా పెరిగింది. తన జీతం మొత్తం నా కోసమే వాడేవాడు అంతేనా నా పుట్టినరోజు అంటే అదేదో పెద్ద పండుగలాగ ఘనంగా చేసేవాడు. ఇది తెలిసి వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అయిన సరే నన్ను వీడలేదు. నా మీద వాడికున్న ప్యార్ ని చూసి నాకు ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. ఒక రోజు నేను దాకొన్ని వాడిని భయపెట్టాను. అంతే పాపం వాడు ఆ కొద్దీ సేపు దూరాన్ని తట్టుకోలేకపోయాడు. కనపడకపోయినా నా మీద బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకునేవాడు. వాడితో చాలా సార్లు దాగుడుమూతలు ఆడడం వల్ల పాపం జ్వరం తెచ్చుకొని దవాఖానకు చాలాసార్లు పోయాడు.
నాకు చాలా బాధ వేసింది. అప్పటినుంచి నేను కాస్త వాడితో ఆడుకోవడం తగ్గించుకున్న. వాడికి ఏమైనా అయితే నా జీవితం ఏమీ కాను. అరే బైక్ సౌండ్ వచ్చింది అంటే నా పోరడు వచ్చాడు. బాబరే పెద్ద కవర్లో తెస్తున్నాడు ఇంతకీ ఏమి గిఫ్ట్ అయి ఉంటుంది. నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి నా మెడలో ఎదో వేశాడు. నేను కళ్ళు మూసుకొని మనసులోనే నా కోసం బంగారు ఏమైనా తెచ్చాడు ఏమో అనుకొన్న నేను అంటే ఎందుకు రా నీకింత పిచ్చి ప్రేమ అనుకొని కళ్ళు తెరిచా నా కోసం ఏమి తెచ్చాడోని. కానీ వాడు తెచ్చింది బెల్ట్ …కుక్క బెల్ట్.
నేను షాక్ నుంచి తేరుకొనేలోపే  నా మెడకు తగిలించి బెల్ట్ ను  విండో కి తగిలించాడు. రేయ్ టోనీ గా నీకోసం వెతికి మరీ తెచ్చారా అది బంగారు పూత పూసిన గొలుసు రా అన్నాడు. నేను ఇప్పుడే వస్తానని లోపలకి వెళ్ళాడు. రేయ్ నిన్ను అనవసరంగా పోగిడాను కదా రా. నా ఫ్రీడమ్ లాగేసావు. రోజు అలా వీధి వెంబడి తిరిగి పక్క వీధిలో ఉన్న జారని  రెండు నెలలు నుండి లైన్ వేస్తూ ఉంటే ఇప్పటికీ సెట్ అయింది. ఈ రోజు తన మనసులో మాట చెపుతాను అంది రా. ఇప్పుడు నన్ను ఇలా కట్టిపడేసావూ కదా రా. ఇప్పుడెలా తనని నేను చేరుకోవాలి.” ఎలా ఉందిరా టోనీ నా ప్రేమ కానుక.. పోలా అదిరిపొల! ఇంకా నుంచి నువ్వు ఫ్రీగా ఎక్కడికి పోలేవు. పక్క వీధిలో ఉన్న నా ఎనిమి రాహుల్ గాడి జార తో నీకు ఏంది రా దోస్తీ! అందుకే నిన్ను ఇలా కట్టి పడేశా. లేకపోతే ఆ జార కోసం నువ్వు వెళ్ళడం. ఆ రాహుల్ గాడు గర్వంగా ఫోటో తీసి నన్ను పరేషాన్ చేయడం అవసరమా చెప్పు. ఎంజాయ్ విత్ మై లవ్లీ గిఫ్ట్ ” అంటు బైక్ లో ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెధవన్నర వెధవ..
ఎంజాయ్ ఏంటి రా !! నువ్వు నీ పిచ్చి !!!
కొంచెం కూడా నీకు హార్ట్ లేదబ్బా. ఇంతకీ నా జార ఏమి చేస్తుందొ. నా కోసం గేట్ దగ్గరా నిలపడి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏమో.
నా పై ఉన్న ప్రేమను నువ్వు చెప్పితే వినాలి అని ఎంత ఆరాట పడుతున్న. ఈ ఇడియట్ నన్ను లాక్ చేసేశాడు. ఐ యాం సో సారీ జార. ఐ మిస్ యూ బేబీ. జార. అరెరే ! ఈ టైమ్ కి వచ్చే మై పాగల్ పోరడు ఎందుకు రాలేదు అబ్బా. నా వెనకే వచ్చి తెగ తోక ఊపుతూ నా వైపు ఎంత ప్రేమగా చూస్తూ నన్ను మాయ చేసేవాడు. ఇంకా వారితో కలిసి ఆడుకుంది చాలు, నా వెనక తిప్పించుకుంది చాలు ఈ రోజు నా ప్రేమని ఎలాగైనా చెప్పి తీరుతాను. మా మూగ ప్రేమకు ఈ రోజైనా పాడాలి చరమగీతం.
“ఏంటే జార ! గేట్ వైపు నిలపడి తెగ తిరుగుతున్నావు!?? నీ దిల్ రాజ్ కోసమా..” హి హి.. వీడికి ఎలా తెలుసు. వీడెంటి కోట శ్రీనివాస రావు లాగ తెగ కిచ్చ కిచ్చ నవ్వుతున్నాడు. ఏంట్రా ఏమి చేసావు రా నా పాగాల్ గాడిని. నీ లుక్  అర్థమైందిలే. ఏమి చేసావు రా నా పాగాల్ గాడిని. అనే కదా. నువ్వు  ఆ టోనితో గ్రౌండ్ లో తిరుగుతూ ఆడుకుంటున్న పిక్స్ తీసి ఆ చరణ్ గాడికి పంపాను. వాడు నీ పోరడు ని హౌజ్ అరెస్ట్ చేశారు. నువ్వు ఎప్పటికీ కలవలేవు. 30,000 సంపాదించే నాకే ఏ లవర్ లేదు. నాకే లేనప్పుడు నీకే ఎందుకు.!? నేను కమిట్ అయ్యేవరకు నాతోనే తిరగాలి, నాతోనే అడుకోవాలి. దా మంచిగా సెల్ఫీస్స్ తీసుకొని “ఐ లవ్ యు జార” అంటు క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పెట్టుకుంటాను. దెబ్బకి ఆ ఫోటోను
చూసినవారందరూ అబ్బా ఈ అబ్బాయికి పెట్స్ అంత ఎంత ఇష్టమో అనుకోవాలి. సెల్ఫీ! ఏంట్రా… సెల్ఫీస్ వెధవా! నీ సాడిసం తగలయ్య. నువ్వు సింగిల్ గా ఉన్నావని నేను ఉండాలా వెధవన్నర వెధవ నా టోనీ గాడికి ఎప్పుడు నా ప్రేమను తెలపాలో ఏంటో. ఏంటో ఈ మనుషులు అసలు అర్థం కారు, మీ మధ్య ఉన్న పగ వల్ల మేము బాధ పడతున్నాము. మాకు ప్రేమలు ఉండవా ఏంటి…??? ఏంటో ఈ మనుషులంతా స్వార్థపరులు. కొంచమైనా మారండి బాబు ఇది మా తరుపున చిన్న విన్నపం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!