సుమధుర జ్ఞాపకము

సుమధుర జ్ఞాపకము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి.

   సూర్యోదయం మొదలు మంచిగా జీవితం వెళ్ళాలని ప్రతి మనీషి ఆశ మధురాతి మధురం జ్ఞాపకము. బాల్యం మొదలు ఎన్నో జ్ఞాపకాలు. మంచి బొమ్మ తాత కొనిచ్చినప్పుడు, స్కూల్ లో బహుమతులు వచ్చినప్పుడు, అందరూ పొగిడి నప్పుడు ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు ఏమిని చెప్పను.
శోభ కృతి ఒక జాతీయ స్థాయి సింగర్ ఆమెకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. సినీ గాయనిగా పిలిచారు కానీ సనాతన సంప్రదాయ కుటుంబం నుంచి వెళ్ళాలి అంటే ఎంతో మంది పెద్దలు ఒప్పుకోవాలి. సంగీతం ఆ ఇంటి విద్య. తండ్రి, తాత కూడా అదే రంగంలో ఉన్నారు. వాళ్ళు రేడియో టి.వి కి పరిమితము. అందులో అటు పోట్లు ఉండవు. నెల జీతం వస్తుంది. ఎవరికీ అయిన జీతం మీదే జీవితము. నువ్వు కూడా ఎండ మావుల వెంట కాక కాలేజీ లెక్చరర్ గా వేళ్ళు కడుపులో నీళ్ళు కదలవు.
ప్రతి ఏడు ఓ వందమంది మీ కాలేజ్ నుంచి బయటకు వెడతారు. సినిమాలు వద్దు, స్టేజ్ షోలు వద్దు అంటూ ఇంటిల్లిపాది అన్నారు.
నీకు ఈ యేడాది పెళ్లి చేసేస్తాం వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళే తప్పక నిన్ను సినిమాలో పాడిస్తారు.
ఎవరైనా చిన్న మాట పెళ్లి చూపులకు వచ్చి అంటే మేము సహించము అన్నారు.
ఒక పెద్ద ఛానల్ నుంచి పొందిన మొదటి బహుమతి జీవితంలో ఎంతో మధుర జ్ఞాపకమే. కానీ పెద్దలకు అది అవరోధం అందుకే ఆలోచించింది. తానెమో ప్రేమ పెళ్లి చేసుకుని వచ్చిన అవకాశం వినియోగించు కోవాలి అంటే అసలు ప్రేమించడం రాదు. కానీ తన మొర ఆలకించి అన్నయ్య రామ్ తన ఫ్రెండ్ నీ అడిగాడు ఇది మా ఇంటి పరిస్థితి అని.
“వెంకట రమణ అందుకు నవ్వి.. సరే నేను మాత్రం ఒప్పుకున్న మా ఇంటి వాళ్ళు ఒప్పుకోవాలి కదా! సెలబ్రిటీ కోడలు అంటే బాగానే ఉంది. కానీ మరి మా ఇంట్లో వాళ్ళని అడిగి చేసుకోవాలి”. ఈలోగా రెండు మూడు చూశారు పిల్ల పాటకి ముగ్ధులు అయ్యారు కానీ సినిమా రంగం అంటే భయం. అది ఒక కళల కలల మాయాజాలం నువ్వు అందులో నెగ్గుకు రాగలవా!? అన్నారు కొందరు.
వెంకట రమణ మాత్రం శోభ సంగీతం అంటే ఇష్టం దూరం చుట్టరికం కూడా ఉన్నది. “సరే నేను మా ఇంట్లో చెప్పి చేసుకుంటాను అన్నాడు.” “ఒకే శుభ శ్య శీఘ్రం అన్నారు”. పెళ్లికి అన్ని రకాలు మెరుగులు చేశారు సినీ రంగం వాళ్ళు కూడా వచ్చారు మంచి అవకాశం వదిలి పెళ్లి చేసుకుంటుంది అన్నారు.
పర్వాలేదు నేను అన్ని రకాల ఆలోచించి ఈ పెళ్లికి రెడీ అయ్యాను అని మిగిలిన సింగర్స్ తో అన్నది.
వెంకట రమణ ఎం.బి.ఎ చదివి మార్కెటింగ్ రంగంలో ఉన్నాడు. అత్తగారు, మామగారు ఉంటారు. ఆడబడుచులిద్దరికి పెళ్ళిళ్ళు చేశారు. సరే విధి నిర్ణయం ఎలా ఉంటే అలా, పెద్ద వాళ్ళ కోరిక తీరింది. అయితే అదే ఊళ్ళో వెంకట రమణ  జాబ్ కనుక అంతా దగ్గరలోనే ఉంటారు. శోభ కృతి ఒక నెలలో ఇంటిల్లి పాదికి తన జీవిత ధ్యేయం గురించి చెప్పి ఆడబడుచుల ద్వారా ఒప్పించి. సినిమా ఛాన్స్ పొందింది. సినిమాలో ఐదు పాటలు పాడింది ఒక ప్రముఖ గాయకుడుతో రెండు యుగళ గీతలు పాడింది.
ఇంకేమి పెద్ద డైరెక్టర్ ద్వారా ఎంట్రీ వచ్చింది కనుక అతి తొందరలోనే అనుకున్నది సాధించింది. చాలా మందికి కుటుంబం అండ ఉంటుంది. ఇల్లు, పిల్లలు కుటుంబం చూసుకుంటూ జీవితంలో ఎదగడానికి నేటి స్త్రీ తనవ్యక్తిత్వన్ని చాటు కోవడానికి ఇష్టత చూపుతోంది. వెంకట రమణ కుటుంబం కోడలు ఉన్నతికి ఎంతో ఆనందపడ్డారు. సినిమా రంగం లో గుర్తింపు రావడం వల్ల శోభ కృతి ఎంతో ఆనంద  పడింది. ఇది వరలో ఎన్నో బహుమతులు వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు.
పుట్టింటి వారు మాత్రం వారి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. కానీ వెంకట రమణ
విశాల హృదయంతో భార్య కళను గౌరవించే ప్రేమించే వ్యక్తిగా తన విశాల హృదయం చాటుకున్నాడు. జీవిత గమ్యం లో ఎన్నో అటు పొట్లు అవీ జ్ఞానంతో చాటు కోవాలి. నా నాటి బ్రతుకు నాటకము అన్న శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కృతి జీవిత సారము మానవ జీవితానికి ఒక అపురూప అమూల్య అదృష్ట అమృత సంపద. శోభకృతి జీవితంలో శోభకృతి నామ సంవత్సరంలో ఎన్నో అవార్డ్స్. అవన్నీ మధురమైన మరపురాని జ్ఞాపకాలు అని ఒక అవార్డ్స్ ఫంక్షన్ ఇంటర్వ్యులో చెప్పింది. వచ్చిన కళకు తగిన ప్రోత్సహాం కుటుంబం నుంచి ఇస్తే అంతా కంటే మరపురాని జ్ఞాపకం మరోకటి ఏమిటి? స్త్రీ ఎప్పుడు కుటుంబ వృద్ది ఆకాంక్షించి వృత్తిని గౌరవిస్తుంది. ఎందరో శోభకృతి లాంటి అమ్మాయిలు తమ వృత్తిని గౌరవిస్తూ జీవితంలో ముందడుగు వేస్తారు. శోభకృతి ఆ ఏడాది బెస్ట్ సింగర్ అవార్డ్స్ పోంది ప్రముఖుల ప్రశంసలు పొందారు. అది ఒక మరపురాని మధుర జ్ఞాపకమే. ఎన్నో ఛానెల్స్ లో ఆమే ఇంటర్వ్యూలు వచ్చాయి. భావి తరాలకు ఒక స్పూర్తి ప్రదాత గా గుర్తింపు వచ్చింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!