ఇకనైనా…

 ఇకనైనా...

రచయిత: రాజ్

ఈ జమీనుపై..
జీవుల జీవయాత్ర ఆరంభమై ..
యెన్నో వేలకోట్ల వత్సరమ్ములాయెను!
మరి ఈ జీవకోటిలో..
జంతువులు…మానవులు..
పశుపక్ష్యాదులు..
క్రిమి కీటకాదులు..
జల నిధులు..జడ నిధులు..
అడవులు…ఎడారులు..
ఇలా ఎన్నో..ఎన్నెన్నో..
జీవ వైవిధ్య…పరిరక్షణలో!

జీవులన్నింటిలో..
జాగరూకుడు..జాగృతి కలవాడు
జగతిని పునర్నిర్మించ గల
యోధుడు….మానవుడు!

జీవులన్నింటితో…
జీవితాన్ని ఆరంభించి!
తనకున్న మెదడనే…
ఆయుధాన్ని ఉపయోగించి!
తపోజ్వాలను రగిలించి!
ఆలోచించి..ఆచరించి!
ప్రయత్నించి..సాధించి!
తనకంటూ..
సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న..
యెన్నో ప్రత్యేకతలున్న జీవుడు.. మానవుడు!

జ్ఞానమునే సంపదగా కలిగిన ఈ జీవి..
జీవవైవిధ్య పరిరక్షణలో వెనుకంజ వేయడం
కడు…శోచనీయం!
తను బాగుండాలనే తపనతో…
పక్షులను..జంతువులను…
అడవులను..పర్వతాలను..
జీవజలాలను..
జీర్ణం అవనంతగ వాడుకొని..
తను మాత్రం బాగుంటే చాలు
అన్నంత ఎత్తుకు ఎదిగాడు!
తన వంశం పెరగాలి అనుకుంటూ..
ప్రత్యుత్పత్తి పెంచి..సంఖ్యను పెంచి
ఇతర జీవుల సంఖ్య .. తగ్గించె!

సృష్టిలో..యే జీవియైన..
ప్రాథమిక అవసరాలైన..
తిండి..నిద్ర..నివాసం కొరకు మాత్రమే..
శ్రమిస్తాయి!
కానీ!
జాలి..దయ..కరుణ..ప్రేమ
వంటి సద్గుణాలుతో పాటు
అసూయ..ద్వేషం..పగ..స్వార్థం వంటి
దుర్గుణాలను కూడా కలిగిన
మహోన్నత మానవుడు..మాత్రం
పోలిక.. ఏలిక..అనుకుంటూ
ఒకర్ని మించి మరొకరు ఉండాలన్న
అత్యాశతో..
అడవుల్ని అంతం చేశాం..
పర్వతాలను పడగొట్టేసాం..
పక్షుల్ని..పశువుల్ని పొట్టలో వేశాం..
రసాయన ఎరువులతో..
కీటకాలను కిల్ చేశాం!

మానవాళికి మేలుచేసే..
జీవకోటిని కిల్ చేసి..
మనల్ని కిల్ చేసే..కరోనా వంటి
వైరస్ లకు.. జన్మనిచ్చాం!
వేటినైనా..సృష్టించటం అంటే..
గొప్ప ఉబలాటం కదా మానవునికి!

మానవా… ఒక్కటి మాత్రం
హృదయమునందుంచుకో!
ప్రకృతి నియమాలని పాటించే
జీవులెన్నో నశించిపోతుంటే..
మానవుని చేతిలో!
మరి ప్రకృతి ధర్మాన్ని పాటించని..
మానవుని నాశనం..
అంతకు మించి ఉండబోతుంది!

ఇప్పటికైనా…మించిపోయింది లేదు
రండి …
జీవ వైవిధ్య పరరక్షణకు..
చేయి చేయి కలుపుదాం రండి!

హామీ పత్రం:
ఈ కవిత పూర్తిగా నా సొంతం
ఏ పత్రికలోనూ ప్రచురించ లేదు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!