బావిలో దెయ్యం

(అంశం:”అల్లరి దెయ్యం”)

బావిలో దెయ్యం

-కవిత దాస్యం

రామాపురం అనే అందమైన ఊరిలో ఒక పార్కు ఉంది. అక్కడ ఒక పాడుబడ్డ బావి ఉంది. ఊరిలోని జనాలకి ఆ బావి అవసరం ఉంది అలాగే ఆ చోటు కూడా. ఆ బావిలోని నీరు ని ఊరి జనాలు తాగడానికి ఉపయోగిస్తారు. చోటు ని కూడా వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. బావిలోని నీరు అందరి దాహాన్ని తీర్చేది. ఒక రోజు ఆ బావి పక్కన ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తుండగా, బావి లో నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్టుగా బావిలో కుండ పడితే మునుగుతున్నప్పుడు వచ్చే శబ్దములా అనిపించి ఇద్దరూ బావి దగ్గరికి వెళ్లి తొంగి చూస్తుండగా, రామ్ అందులో పడిపోతాడు. ఊరి జనాలందరూ వెతికిన లాభం లేకపోయింది రామ్ జాడ తెలియలేదు. శవం కూడా దొరకలేదు. పిల్లలందరూ భావి పక్కన ఆడుతూ ఉన్నప్పుడు అదే కుండ మునిగిన శబ్దం వినిపించింది పిల్లలందరూ వెళ్లి చూస్తుండగా పంకజ్ అనే కుర్రాడు అందులో పడిపోతాడు. పిల్లాడు బావిలో పడిపోయినందు వల్ల సమస్య మరింత పెద్దదయింది. అందరూ సర్పంచ్దగ్గర విన్నవించుకుదాంమని వెళ్లి బంతి పడిపోయిందని తొంగి చూస్తూ ఉండగా ఒక చేయి వచ్చి పంకజ్ ని లాగిందని చెప్తారు. కనీసం శవ మైన దొరకాలి గా అని సర్పంచ్ ఆశ్చర్యపోతాడు. ఆ దయ్యం పంకజ్ ని తినేసింది. సర్పంచ్ గారే కాక ఊరంతా దయ్యమే తినేసిందని నమ్ముతారు. భయంతో వణికి పోతారు. ఒక వారం రోజులుగా అటుపక్క గా ఎవరు వెళ్లారు.
భూపతి కి ఒక ఆలోచన వచ్చే బలవంతుడైన వాన్ని తీసుకొని బావి పక్కగా వెళ్తాడు. అతడు గజగజా వణుకుతూ మన స్నేహితులను కోల్పోయిన సంగతి అప్పుడే మర్చిపోయావా, ఆ దయ్యం అందరిని చేయి పట్టి లాగి తినేస్తుంది. ఏం కాదు నేను ఉన్నాను రా, నేను బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తాను, దెయ్యం నన్ను లాగాలని చూస్తే నా కాళ్ళను గట్టిగా పట్టుకోవాలి. స్నేహితుడిగా ఆ ఒక్క సహాయం చెయ్యి అనగా, బలవంతుడైన స్నేహితుడు తెలిసి తెలిసి మంచి స్నేహితుడిని కోల్పోలేను. అరే నాకేం కాదు రా వెళ్దాం పద అని ఇద్దరు అనుకున్న ప్రకారం బావి దగ్గరకు వెళ్తారు. వెంటనే ఆ దయ్యం చేయి పైకి చాచి లాగ పోతుంటే బలవంతుడు కాళ్ళు పట్టుకొని లాగుతాడు. దెయ్యం వారి బలానికి ఓడిపోతుంది. ఏంటి ఇలా నిజంగా నువ్వు లేకపోతే నన్ను తినేసేది చూస్తుంటే దయ్యం తిండిలేక బక్కచిక్కినట్టుంది. మన బలానికి సరితూగ లేకపోయింది. ఇద్దరూ తెలుసుకుందామని బావిలో దూకుతారు. దెయ్యం చెయ్యి అవుపడుతుంది అక్కడ ఒక తలుపు కనబడుతుంది. కు ల్ జా సిమ్ సిమ్ అంటూ తలుపు తెరుచుకోగానే పంకజ్ఆగు పడతాడు. అందులోంచి ఒక వ్యక్తి మాటలు మీరేం భయపడకండి, అందరూ దయ్యం ఉందని నమ్మేస్తారు, మనిషికి భయపడని వాడు కూడా దయ్యానికి భయపడతారు.ఇటు వైపు ఎవరూ రారు ,మన దారి క్లియర్ అయిపోయింది. మన పని పూర్తి చేసుకోవడానికి నాలుగు రోజులే టైముంది .పెద్ద బంగ్లా లో బోల్డంత డబ్బు మన సొంతమవుతుంది . బోల్డంత ఖజానా కూడా దొరుకుతుంది .మనకు దొరికిన డబ్బుతో ఈ దారి గుండా బయటికి వెళ్లి పోదాం ,ఇలాంటి పథకం ఎందుకు చేశారని అడుగగా ఇంతకన్నా పెద్ద ఖజానా మనకు దొరకదు ,అలాగే దారి కూడా ఎవరికి తెలియదు కదా ,తెలిస్తే సమస్య ఏర్పడుతుంది. దయ్యం మీద భయం వాళ్లకు ఎప్పటి వరకు ఉంటుందో అప్పటివరకు సంపాదించుకోవడానికి మనం సేఫ్ గా ఉండొచ్చు . ఓహో ఇదేనా బావిలోని రహస్యమని మన ఊరి నిధిని తీసుకోవడానికే ఈ విధంగా చేశారు. దొరికిపోయారు ,అరరే పోలీస్ బాబాయ్ సర్పంచ్ గారు మీరు ఏంటి ఇక్కడ, అనగా భూపతి వారికి రమ్మని చెప్పింది నేను, ఇక్కడ భూతం లేదని నాకు ముందుగానే అనిపించింది. అందుకే ధైర్యంగా నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాను. నేను అనుకున్నట్టే జరిగింది అందుకేముందుగా సమాచారం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లని సులభంగా పట్టుకోవచ్చు. మన ఊరి నిధులు వారికి దక్కకూడదని ఇలా పథకం వేశారని నీకు ముందుగా ఎలా తెలుసు అని పోలీస అడిగాడు, బాగా తెలివైనవాడలా ఉన్నావే, చూడండి సార్ ఎప్పుడు బావి దగ్గరికి వచ్చిన ఆ చెయ్యి ఒక్కరిని మాత్రమే లాగేస్ కో సాగింది. ఇద్దరు కలిసి వస్తే లాగే చేసుకోలేదని నాకు అనుమానం వచ్చి ఏభూతాని కైనా ఒకరిని లాగేసుకోవడం ఏమిటి అంతకుమించి శక్తి ఉంటుంది కదా, అలా చేయలేదు అంటే అది భూతం కాదు అని అనుమానం వచ్చి, పథకం వేసి మరి కనిపెట్టగలగాను. దానికి ఈ బావిని ఎందుకు ఎంచుకున్నారో ముందుగా అర్థం కాలేదు. ఒకరి లాగేస్ కోవడం కోసం యంత్రాన్ని వాళ్ళు వాడు కున్నారు. తప్పు బయటపడి పోయి వాళ్ళు దొరికిపోయారు కానీ, బావి దగ్గరికి వెళ్ళినప్పుడు బుడబుడ మని శబ్దం ఎలా వచ్చింది సీసీ కెమెరా లో చూడండి సర్పంచ్ గారు యంత్రం ద్వారా బుడబుడ మని శబ్దం వచ్చేలా పన్నాగం చేశారు. బావి దగ్గరికి రాగానే చేయి జాచి ఒకరిని మాత్రమే లాగ గలిగే సామర్థ్యం ఉన్న ఆయంత్రం ఇద్దరు ముగ్గురిని లాగ లేకపోయింది. ఈ విషయాన్ని పరిశీలించగా నాకు అనుమానం వచ్చి పరిశీలించగా, వారు దొరికిపోయారు. ఊరు మొత్తం భయ పడుతున్న సమయంలో భూపతి తెలివితేటల వల్ల అక్కడ జరిగే అనర్థాలు ఆపగలిగారు.
లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని భయపడడం ఎంతవరకు తెలివి తక్కువ పనో అని అందరికీ తెలియజేశాడు.
కళ్ళతో చూసింది నిజమని నమ్మకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!