మానవత్వం నశించలేదు

మానవత్వం నశించలేదు

రచన: సుజాత కోకిల

ఏమండీ లేవండి, మీ ఆఫీస్ టైం అవుతుంది. అంటూ కాఫీ కప్పుతో వచ్చింది రవళి ఏమండీ కాఫీ తీసుకోండి అప్పుడేనా రవళి ఇంకా ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ?అన్నాడు తేజ్. మళ్ళీ దుప్పటి కప్పుకుంటూ.. ఏంటండీ మళ్లీ పడుకుంటున్నారు! గోముగా అంది. మీకేం అలాగే అంటారు లేవండి? సుతారంగా తట్టిలేపుతూ అంది రవళి. ఏంటి అప్పుడే టైమ్ అయిందా? అంటూ కళ్లు నులుముకుంటూ రవళి వైపు చూస్తూ అన్నాడు. అప్పుడే ఏంటి టైమ్ చూడండి మీకే తెలుస్తుంది. నెే లేపితే కాని లెేేవరూ ముద్దుముద్దుగా అంటూ తన రెండు చేతులతో వెంట్రుకలను నిమిరింది. మీకేంటి హడావుడిగా లేస్తూ నన్ను తొందరపెడతారు.

తొందరగా లేవండి అంటూ కాఫీకప్పును టేబుల్ పై పెట్టి వెళ్లబోతుంటే కొంగు పట్టుకుని తన పైకి లాక్కున్నాడు. నవ్వుతూ తన పెదవులపై తన పెదవులతో నోరు మూశాడు. ఊ…ఊ… వదలండి? ఏంటండీ ప్రొద్దున్నే మీ సరసం మీరు మరీను నవ్వుతూ తప్పించుకోబోయింది. వదలకుండా గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాడు.

సిగ్గు పడుతూ తన రెండు చేతులతో కళ్లు మూసుకుంది. అబ్బో సిగ్గే నా అందాల రాణికి ఇంత సిగ్గా!? ఏది నేను చూడని అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు ఈ సిగ్గు లో ఎంత అందంగా ఉన్నావో చూడు!. ప్లీస్ వదలండి సిగ్గు పడుతూ అంది. రోజు నా మామూలు ఇవ్వందెే పక్క దిగెేది లెేదుగా మై డియర్ లవ్లీ డార్లింగ్ అంటూ బుగ్గమీద చిటిక వేశాడు. ఛీ పొండి అంటూ పరుగెత్తింది. నైట్ చెప్తాలే నీ పని అంటూ వాష్ రూమ్ లోకి వెళ్ళాడు తేజ్.

తేజ్ ఫ్రెష్ అయి వచ్చేలోగా టిఫిన్ చేసి రెడీగా టేబుల్ పై పెట్టింది. ఏమండీ శ్రీమతిగారు! టిఫిన్ రెడీనా?. రండి
వేడి వేడి ఉప్మా చల్లారిపోతుంది, మీదే ఆలస్యం అంది వేడి చెయ్యడానికి నీవున్నావుగా కొంటెగా చూస్తూ అన్నాడు. మీతో నెేవేగలేను బాబోయ్.. అలాగా!! మరి మీ పుట్టింటికి వెళ్తావా?? నన్ను వదిలి పెడితే నిక్షేపంగా వెళ్తాననీ నవ్వుతూ అంది. మరి ఇంకో పెళ్లి చేసి వెళ్లు. అబ్బో మీ బడాయి మాటలు మీరును సరే లెండి మీతో ఇలాగే కూర్చుంటే కాలక్షేపానికి ఏం కొదవలేదు. మీరు ముందు టిఫిన్ చేయండి. టిఫిన్ కాస్త తొందరగా కానిచ్చాడు, మీతో ఇలాగే కూర్చుంటే మీ ఆఫీసు కూడా లేట్ అవుతుంది. త్వరగా వెళ్ళండి వెళ్ళండి అంటూ గుమ్మం దాకా వచ్చింది బాయ్ అంటూ ఆఫీసుకు వెళ్లాడు.

బాయ్ అంటూ ఆఫీస్ కి సాగనంపింది. తను తిని టేబుల్ సర్ది నడుము వాలుద్దామని బెడ్ రూమ్ లోకి రాబోతుండగా ఫోన్ రింగయింది. ఎవరై ఉంటారనుకొని ఫోన్ ఎత్తింది. అమ్మా! రవళి బాగున్నావా అల్లుడు గారు బాగున్నారా! అంటూ తల్లి కుశల ప్రశ్నలు అడిగింది. ఆ అమ్మ మీరెేలా ఉన్నారమ్మా!. మీ నాన్నగారు నేను కులాసాయే తల్లి! ఇప్పుడే మా ఆయన ఆఫీసుకు వెళ్లారు. ఎలా ఉందమ్మా నీ కొత్త కాపురం. ఆ.. ఆ.. బావుందమ్మా మీ అల్లుడు గారు చాలా బాగా చూసుకుంటున్నారు.

అమ్మా మీ ఫ్రెండ్ వనజ వచ్చి వెళ్లిందమ్మా! నిన్ను చాలా గుర్తు చేసుకుంది. అవునా అమ్మ! ఎలా ఉంది అది?. ఆ కులాసాగా ఉంది. వాళ్ల ఆయనకి బెజవాడ నుండి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిందట ఇక్కడికెే షిఫ్ట్ అవుతారట, నీవు ఉన్నావేమో కలిసి వెళ్దామని వచ్చింది. అవునా అమ్మ ఇంకేం కబుర్లు ఇంకేం ఉంటాయి. అల్లుడు గారు ఎక్కడికైనా తీసుకువెళ్లాడ?.
లేదమ్మా తనకి ఆఫీస్ వర్క్ తోటెే సరిపోతుంది. పోనీలే అమ్మ అల్లుడిగార్ని ఇబ్బంది పెట్టకు, సరేనమ్మ జాగ్రత్త! ఇంకా ఉంటాను తల్లి ఫోన్ పెట్టేసింది.

ఏంటి గొడవ గొడవగా వినిపిస్తుంది ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఏమిటా అనుకుంటూ బయటకు వచ్చి చూశాను మా ఎదురు అపార్ట్మెంటులోనే గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ అపార్ట్మెంట్లోకి జనాలు వస్తున్నారు చాలామంది. అక్కడ చాలా మందే ఉన్నారు. అయ్యో పాపం అనుకుంటూ వెళ్లిపోతున్నారు. నాకేమో కొత్త వెళ్తే ఏమనుకుంటారో!? వెళ్లాలని ఉంది. ఎవరో ఇటుగా వస్తున్నారు. సరేలెే ఇతన్ని అడిగి తెలుసుకుందాం అనుకుని ఏమండీ అక్కడ ఏమైందండీ?? అలా అందరూ ఎందుకు వెళుతున్నారు. అంటూ మనసు ఆగలేక అడిగాను.

అనుమయ్య గారు చనిపోయారండీ! ఆయన భార్య ఏడుస్తుంది. అయ్యో పాపం! అవునా.. ఏమైందండీ అతనికి?. వయసు అయిపోయింది. పిల్లలు వదిలి వెళ్లిపోయారు బెంగతో మంచం పట్టి పోయారు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఏం పిల్లలోనండి ఈ కాలం పిల్లలు మరీను రాత్రి అనంగా పోయారు. దిక్కు మొక్కు లేదు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తలోరకంగా అంటున్నారు. లలితమ్మ మనసు విలవిలలాడిపోతుంది.. కొడుకులుండీ కూడా ఎవరూ లేని అనాథలా మిగిలిపోయాను. గుండెలవిసేలా ఏడుస్తుంది ఇంకా ఎంతసేపు చేస్తారు, ఇంకా ఉంచడం మంచిది కాదు అంటూ ప్రశ్నలతో విసిగిస్తున్నారు. రవళి ఇంటికి తాళం వేసి తేజ్ కు ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం అంతా వివరంగా చెప్పింది. సరే నేను ఇప్పుడే వస్తున్నాను, వెళ్లు అలాగే అని ఆవిడ దగ్గరికి గబగబా వెళ్లింది.

అక్కడి వారందరూ తలో ఓ ప్రశ్న వేస్తూ విసిగిస్తున్నారు.
నా కళ్ల వెంట నీళ్లు కారాయి చాలా బాధగా అనిపించింది. ఆ వస్తున్నారు వెనుక నుండి సమాధానమిచ్చింది. మీరు కాస్త ఆగండి ఎందుకు ఆవిడను బాధపెడుతున్నారు, ఆ మాటలకి లలితమ్మ ఇటువైపుగా చూసింది. ఈ అమ్మాయెవరు నేనెప్పుడూ ఏక్కడ చూసినట్టుగా లేదు. ఎవరై ఉంటారు అనుకున్నది మనసులో ఇంత చక్కగా అందరి నోర్లు మూసింది. ఆవిడ అంత బాధలో ఉంటే మీ యక్ష ప్రశ్నలతో ఇంకా ఆమెను బాధపెడుతున్నారు. ఇది కరెక్టయిన పద్ధతేనా? లలితమ్మ కండ్లకు ఆ అమ్మాయి అమ్మవారిలా కన్పించింది. ముక్కు మొహం తెలియని అమ్మాయి కూడా ఇలా వచ్చి పలకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కన్నబిడ్డలు ఉంటే ఏం లాభం ఇలాంటి బిడ్డ ఇంటికి ఒక్కరు ఉన్న చాలు.. కనిపెంచిన పిల్లలే ఇలా ఒంటరిగా వదిలి వెళ్లిపోయారు. ఎంతో కష్టపడి పెద్దవాళ్లను చేసిన తల్లి దండ్రులంటే జాలి ప్రేమ గౌరవం లేదు. ఏమండీ మీరేం కంగారు పడకండి మా వారు వస్తారు. ఎవరో అమ్మాయి వచ్చి ఆధరణగా పలకరిస్తుంటే కళ్ళు చెమర్చాయి. మీకు అన్నీ దగ్గరుండి చేస్తారు బాధపడకండి అంటూ ఓదార్చింది.

లలితమ్మకు దుఃఖం ఆగలేదు, చిన్నపిల్లలా ఆమె ఒళ్లో తల పెట్టుకుని ఏడ్చింది. ఎంతో ఆదరణ చూపింది. అంతలో తేజ్ వచ్చాడు. ఏమైంది రవళి!? ఇక్కడ జరిగిన విషయమంతా చెప్పింది ఏం ఫర్వాలేదు రవళి మనమే చేసేద్దాం అన్నాడు. తేజ్ వైపు కృతజ్ఞతగా చూసింది. నిమిషాల మీద కార్యక్రమమంతా జరిపించారు రవళి తేజ్. మీరెవరు ఈవిడకు మీరేం అవుతారంటూ అడిగారు. అందరూ వింతగా ఈవిడకు మేమేమీ కాము మేము ఈ ఎదురుగానే ఉంటాము ఈ మధ్యనే వచ్చాము అంటూ చెప్పారు. అందరూ చాలా పొగిడారు మీలాంటి వాళ్లు ఉండాలి సార్ చాలా మంచి పని చేశారు. మీకు కృతజ్ఞతలు అంటూ పొగిడారు. మాదేం లేదండి ఆ దేవుడి దయ మాకు చేతనైన సహాయం చేసాము. అంతే మనమంతా మనుషులమే ఎదుటి వారికి సహాయం చేయకుంటే మనం మనుషులం ఎలా అవుతాము చెప్పండి!.

పన్నెండు రోజుల కార్యక్రమాలు అయ్యాక ఓల్డేజ్ ఊమెన్ లో చేర్పించారు. లలితమ్మ కళ్ళతోనే వీళ్లను దీవించింది. మీకేం అవసరమున్న నాకు ఫోన్ చేయండి అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు తేజు. తేజ్ స్వచ్ఛమైన మనసుకు మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంది. ఇంటికి వచ్చాక తేజ్ ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఏంటి రవళి! చిన్న పిల్లలా? ఏమండీ మనకు పిల్లలు అవసరమా అంది. ఏంటి అలా అడుగుతున్నావు? రేపు మన పరిస్థితి కూడా అంతేనా అంది. అలా ఎందుకనుకుంటావ్ రవళి అందరూ అలాగే ఉంటారా? ఇంత సెన్సిటివ్ అయితే ఎలా నువ్వేమీ ఆలోచించకు పడుకో అన్నాడు. తన మనసంతా ప్రశాంత హాయిగా ఉంది. అలాగే కళ్ళు మూసుకుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!