మా ప్రేమ గుర్తు

మా ప్రేమ గుర్తు

రచన : మాధవి కాళ్ల

     సంధ్య మనం రేపే హైదరాబాద్ కి వెళుతున్నాము అని చెప్పాడు ఆది. సరే అని చెప్పింది సంధ్య. అన్నం పెట్టు రా అని చెప్పాడు ఆది. సంధ్య,ఆది కలిసి అన్నం తింటున్నారు. తరువాత రోజు ఉదయం బయలుదేరారు. హైదరాబాద్ కి రావడం ఇదే మొదటిసారి కావడం వల్ల సంధ్య కొంచం భయం పడుతుంది.

ఆది కి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, సంధ్య భయపడుతుంది అని ధైర్యం చెప్పాడు ఆది. సంధ్య ఆది ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెద్ద వాళ్ళని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. సంధ్య వాళ్ల  అన్నయ్య కి ఆదికి గొడవ జరిగింది. ఆ గొడవలో సంధ్య ని చూసి ప్రేమించాడు ఆది. సంధ్య ఇంటర్ చదువుతునప్పుడు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వెంట పడేవాడు ఆది. కాలేజీలో కొంత మంది అబ్బాయిలు సంధ్య ని ఏడిపిస్తారు ఆది చూసి వాళ్ళని కొడతాడు. సంధ్య అప్పుడు నుంచి ఆదిని మంచివాడు అని అనుకుంది. తరవాత ఇద్దరు ప్రేమించుకోవడం. వాళ్ల ఇంటిలో ప్రేమ గురించి చెప్పారు కానీ ఒప్పుకోలేదు. పెద్ద గొడవ జరిగింది. తరువాత ఎవరికీ తెలియకుండా దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నారు ఆది, సంధ్య. హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్ కి కాల్ చేసి తన ప్రేమ విషయం చెప్పాడు ఆది. మీరు ఇక్కడికి రండి నేను నీకు జాబ్ చూస్తాను అని చెప్పాడు ఆది ఫ్రెండ్.

ట్రైన్ లో వెళుతున్నారు. ఎదురుగా ఇద్దరు భార్య, భర్తలు ఉన్నారు. భార్య ఏవండీ మీరు ఆఫీస్ కి వెళ్ళిన తరువాత నాకు బోర్ కొడుతుంది. మన పక్కన ఉన్న ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇస్తే బాగుంటుంది అని చెప్పింది. భర్త సరేలేవే అని చెపుతాడు. సంధ్య ఈ విషయం విని ఆదికి చెప్పుంది, ఆది కొంచం సేపు ఆలోచించి వాళ్ళని అడుగుతాడు. వాళ్లు ఆలోచించి రేపు ఉదయం చెపుతాము అని చెప్పారు భార్య , భర్తలు. నా పేరు ఆది ,నా భార్య పేరు సంధ్య అని చెప్పాడు వాళ్లకి. నా పేరు ఆనంద్ ఆమె నా భార్య పేరు సరళ అని పరిచయాలు చేసుకున్నారు. ఉదయం బాబూ ఆది మీరు కుడా మాతో రండి అని చెప్పారు భార్య భర్తలు. సరే అంకుల్ అని చెప్పి వాళ్ళతో వెళ్లారు ఆది సంధ్య. ఆది వాళ్ల ఫ్రెండ్ కి కాల్ చేసి విషయం చెప్పాడు. సరే ఆది నేనే వస్తాను మీ దగ్గరకు అని చెప్పాడు. ఇల్లు చాలా బాగుంది ఫస్ట్ పాలు పొంగిచారు. ఇంటికి కావాల్సిన సరుకులు ఆది తీసుకొని వచ్చాడు. తరువాత రోజు ఆది ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడు ఆది ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు. సంధ్య ని చూసి ఆది లేడా అని అడిగాడు. లేరు బయటికి వెళ్లారు అని చెప్పింది సంధ్య. సరే నేను తరవాత వస్తాను అని చెప్పి వెళుతుంటే ఆది ఎదురు అవుతాడు. ఏంట్రా శేఖర్ ఇప్పుడా వచ్చేది అని అడిగాడు. అది కాదు రా ఆది వర్క్ బిజీ వల్ల రాలేకపోయాను సారీ రా అని చెప్పాడు శేఖర్. సరే రా అని చెప్పి ఇంటికి తీసుకొని వెళతాడు ఆది. కొన్ని రోజులు తరువాత ఆదికి జాబ్ వస్తుంది ఈ విషయం సంధ్య కి చెప్పాడు. సంధ్య ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పింది ఆదికి. అప్పుడప్పుడు శేఖర్ ఆది ఇంటికి వస్తుండేవాడు. ఆ టైంలో ఆది ఇంట్లో ఉండే వాడు కాదు కానీ శేఖర్ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది సంధ్య కి. ఆంటీ ఏం చేస్తున్నారు అని అడిగింది సంధ్య సరళ ని. ఏమీ లేదమ్మా ఇంటి పని అయిపోయింది ఇప్పుడే కూర్చున్నా ఇప్పుడే మీ అంకుల్ ఆఫీస్ కి వెళ్లారు అని చెప్పింది సరళ. ఆది ఆఫీస్ కి వెళ్ళాను అమ్మ? హ వెళ్లారు ఆంటీ అని చెప్పింది సంధ్య. ఆఫీసులో ఆది కి కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. కొత్త కొత్త అలవాట్లు కూడా నేర్చుకున్నాడు
ఆది. ప్రతి రోజు ఇంటికి తాగేసి వస్తున్నాడు. సంధ్య ఎన్నిసార్లు చెప్పినా తాగడం మాత్రం మానలేదు ఆది. కానీ ఒకరోజు తాగేసి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది ఆదికి. ఈ విషయం తెలిసి హాస్పిటల్ కి వెళ్ళారు ముగ్గురు ఆనంద్, సరళ, పాపం సంధ్య ఏడుస్తూనే ఉంది. తరవాత డాక్టర్ వచ్చి మీ ఆయనకి యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు పోయాయి అని చెప్పారు. సంధ్య ఇంకా ఎక్కువ బాధ పడుతుంది బయటనుంచి ఆదిని చూసింది అప్పుడే సంధ్య ప్రెగ్నెంట్ అని తెలిసింది ఈ విషయం తర్వాత ఆది కి చెప్పింది ఆది కొంచెం బాధ పడుతూ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు.శేఖర్ వచ్చి ఆది ని చూసాడు బాధపడకు ఆది అని చెప్పి సంధ్య నిన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసి సంధ్య తల్లిదండ్రులు ఆదిని వదిలి వచ్చెయ్ అని చెప్పారు. కానీ సంధ్య నేను మాత్రం ఆదిని వదిలి రాను నాకు ఇప్పటి నుంచి ఇద్దరు బిడ్డలు అని అనుకుంటాను. సంధ్య గురించి వాళ్ల అన్నయ్య కి చెపుతారు తల్లితండ్రులు. ఒక రోజు రాత్రి ఆది ని చంపడానికి సంధ్య వాళ్ళ అన్నయ్య వస్తాడు. అది చూసిన సంధ్య ఆదికి అడ్డుగా నిలబడుతుంది సంధ్య ని కత్తితో పొడిచేస్తాడు తర్వాత ఆది ని కూడా చంపేస్తాడు వాళ్ళ అన్నయ్య .. సంధ్య అరుపు విని ఆనంద్,సరళ వచ్చి చూస్తే  వాళ్ల అన్నయ్య పారిపోతాడు. వారిద్దరిని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. అప్పుడే సంధ్య కి పెయిన్స్ వస్తాయి. ఆది మాత్రం చాలా సీరియస్ గా ఉంది అని చెప్పారు డాక్టర్. సంధ్య కి బాబు పుడతాడు ఈ విషయం ఆది కి చెప్తాడు ఆనంద్. ఆది సంతోషంతో నవ్వుతూ చనిపోయాడు. చాలా బాధ పడుతూ సంధ్య కి ఈ విషయం చెప్పింది సరళ. సరళ బాబు ని జాగ్రత్తగా చూసుకో మా ప్రేమకు గుర్తుగా పుట్టిన వాడు అని సరళకి బాబు ని ఇస్తుంది.. సంధ్య కూడా బాగా ఏడుస్తూ ఆది అని గట్టిగా అరుస్తూ చనిపోయింది.. ఆనంద్ సరళ ఎంతో బాధపడుతూ బాబుని తీసుకొని వెళ్ళిపోతారు ఎంతో గారాబంగా పెంచుకుంటారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!