అనుబంధము

అనుబంధము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయానికి ముందే లేచి ఇంటి పనులు చెయ్యడం కామాక్షి కి అలవాటు. శీతాకాంలో అయితే మరీ ఆనందము, కార్తీక మాసం వచ్చిందంటే వాపి కూప,తతకాధి, నది స్నానాలు చెయ్యడం ఎంతో పవిత్రము.. అని పుణ్యం కోసం చేసేవారు పల్లెలో కాక పట్నం లో కూడా ఉన్నారు పుణ్యాలు చేసేవారు.

వెన్నెలలో తెల్ల వార గట్ల లేచి పదిమంది ఆడపిల్లలు అటు ఇటు ఒక వయస్సు దూరపు బంధుత్వం ఉన్న వాళ్ళు వారికి తోడు ఇంట్లో పెద్ద వయస్సు మగ వాళ్ళు కలిసి సాయంగా కూడా వెళ్లే వారు. అన్నలు ఉన్నా వెళ్ళేవారు కాదు కన్నెత్తి చూడటానికి భయపడేవారు అబ్బాయిలు.

ఎదో ఉాళ్లో గోదావరి ఉంది కనుక చిన్న వయస్సు కనుక దూరం తక్కువ కనుక వెడుతూ ఉన్నారు పెద్దయి పెళ్ళిళ్ళు అయితే ఎవరి తిన్న వారు వెడతారు.కదా

ఒక విధంగా అంతా బీర కాయ పీచు చుట్టాలు అనుబంధాలు ఆత్మీయ బంధాలు ఎక్కువ. వంద గడప ఉన్నది సారే అనగానే 150 పెట్టాలి. అందరికీ పంపి ఇంట్లో తినాలి అందుకని పెళ్లి పేరంటం అనగానే అందరూ కలిసి ఆనందంగా పనులు చేసేవారు. వంకలు పెట్టకుండా హాస్య చతురతతో పద్యాలు, పాటలు మాటలతో ఎంతో సందడి.

పెద్ద వాళ్ళు కూడా ఉండ బట్టి ఆడపిల్లలు ధైర్యం గా మూడు గంటలకే లేచి తయారయ్యి లైన్ గా గుమ్మా లలో అగి కలుపుకుని వెళ్ళేవారు బ్యాటరీ లైట్స్ కర్ర పట్టుకుని రెడీగా గుమ్మంలో నించుని ఉండేవారు.

వెన్నెల్లో ఇసుక మెరుస్తూ ఉంటే ఇత్తడి చెంబు గిరాటు వేసి ముందు ఎవరు పట్టుకుంటారు అంటూ పరుగు పెట్టేవారు. అలా అలసట తెలియకుండా ఆటలు ఆడుతూ గోదావరి దగ్గర స్నానానికి వెళ్ళేవారు.

నత్త గుల్లలు, గవ్వలు, రాళ్ళు ఏరుకుని ఇసుక కవర్ లో పోసుకుని తెచ్చి చిన్న ఇళ్లు మాదిరి కట్టి ఆడుకునే వారు
పెద్దవాళ్ళు నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవారు.

వేడి వేడి కాఫీ తాగి టిఫిన్ తిని పిల్లలు స్కూల్లో కి, పెద్దలు పొలానికి వెళ్ళేవారు. మళ్లీ తిరిగి బాగా పొద్దు వచ్చాక ఇంటికి వచ్చేవారు. ఒడ్డున రావి చెట్టు దగ్గర నీళ్ళు పోసి ఆడపిల్లలు మంచి భర్త, మగపిల్లలు మంచి భార్య రావాలని ప్రదిక్షణాలు చేసేవారు. కార్తీకం అంటేనే ఆనంద మాసము శివ పార్వతి వినాయక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైన మాసము దామోదర పూజలు కూడా ఉంటాయి.

కార్తీకంలో వన భోజనాలు ఎంతో సందడి, ఆదివారం వచ్చిందంటే బిల్వ దళాల పూజలు తులసి దళాలతో
పూజలు సామూహికంగా నిర్వహణ బంతి భోజనాలు
వనంలో పెద్దలు శ్రీ సత్య నారాయణ వ్రతము, శ్రీ వేంకటేశ్వర స్వామి దీపారాధన, దత్త వ్రతము కేదారేశ్వర వ్రతము సామూహిక హనుమాన్ చాలీసా పారాయణలు. మహిళల పూజలు, నోములు, పిల్లల ఆటలు,పాటలు పోటీలు నిర్వహించి మంచి బహుమతులు ఇచ్చేవారు.

పాడ్యమి మొదలు పర్వదినాలు నాగుల చవితి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ధన్వంతరీ వ్రతము, చతుర్దశి పూర్ణిమలు తప్పనిసరిగా స్నానాలు పూజలు ఓపిక ఉంటే ఉపవాసము కామాక్షి అందరికీ లీడర్ మాదిరి కార్య క్రమాలు నిర్వహించేది.

కామాక్షి కూతురుకి సంగీతం, కొడుక్కి వేదం చెప్పించింది.ఆఖరి రోజు పాడ్యమి నాడు పోలి స్వర్గానికి గంగ పూజ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని గంగాదేవి పేరుతో తాంబూలాలు పంచేవారు దీనికి పాడి పంట సుభిక్షంగా ఉంటాయి.

ఈ వన భోజనంలో పెళ్లి సంభందాలు పెళ్లి చూపులు జరిగిపోతు ఉండేవి. మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోండి అనో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాము అని చెప్పేవారు, చెప్పించే వారు కూడా కార్తీక మంటేనే కృతిక మహలక్ష్మి మాసము పెళ్ళిళ్ళు ఇతర ఫంక్షన్స్ అంటూ కొందరు పిలిచేవారు.

అసలు ఖాళీ ఉండదు వంట వాళ్ళకి నెల ముందే బుక్ చేసుకుంటారు. కంద బచ్చలి, పనస పొట్టు కూర, అరటికాయ ఆవ పెట్టిన కూర, వంకాయ అల్లం కూర,చింత కాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, తియ్య గుమ్మడి పులుసు పులిహార, దద్దోజనం, లడ్డూలు, బూరెలు, పాయసం, బజ్జీలు ఇలా ఎన్నో రకాలు వంటలతో భోజనాలు ఐకమత్యం కోసం కంద బచ్చలి తప్పనిసరి అంటే వంటకాల్లో కూడా అనుబంధాలు.

పిల్లని పిల్లాడిని పట్నం పంపి పై చదువు చదివించింది. భర్త మంచి జమీందారు. ఏ లోటూ లేదు. పెద్ద చదువులు ఉద్యోగాల రీత్యా సిటీ జీవితం పిల్లకి విదేశీ జీవితం పిల్లాడికి ఎన్నో రకాల అనుభవాలు కొత్త స్నేహితులు కామాక్షి పిల్లల కోసం అన్ని తిరిగి చూసి వచ్చింది. ఇప్పుడు కామాక్షి కూతురు పాడ్యమినాడు ఇత్తడి వెడల్పు గిన్నెలో నీళ్ళు పోసి పువ్వులు దీపాలు పెట్టీ పూజ చేసేది.

కోడలు విదేశంలో గాజు బౌల్ లో నీళ్ళు పోసి పూజ చేసీ దీపాలు పెట్టేది. సిటీలో వివిధ సంస్థల వారు ఘనంగా చేసేవారు కామాక్షి కూతురుకి సంగీతం నేర్పి ఉండటం వల్ల భక్తి పాటలు బాగా పాడేది. కొడుకు కి వేదం చెప్పించే వారు.. అది వాడికి విదేశాల్లో కూడా బాగా పేరు తెచ్చింది.

ఎంత పెద్ద చదువు చదివినా మన సంస్కృతి సంప్రదాయాలు పెద్దల మాట గౌరవం వల్ల పిల్లలు వదలకుండా ఆచరిస్తూ ఉంటారు. కామాక్షి ఫ్రెండ్ కొడుకు సాఫ్టు వేర్ ఇంజనీర్ విదేశాల్లో కూడా ఇంకా వార అంతరంలో వేదం నేర్చుకుంటున్నాడు.

వాళ్ళ ఆవిడ సంగీత విద్వాంసురాలు అమె ప్రోగ్రామ్స్ ఇస్తుంది శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పిల్లలకి నేర్పుతూ పండగల్లో పాడుతూ పాడిస్తూ ఉంటుంది.

ఏ దేశ మెగినా ఎందు కాలిడినా మన భారతీయ సంస్కృతికి ప్రతి బింబాలుగా ఉన్నారని కామాక్షి పిల్లల వీడియోలు పెడుతూ గర్వంగా చెపుతూ ఉంటుంది.

ఆ నాటి బ్రతుకు నాటకము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పినట్లు మానవునికి విద్య ఉద్యోగం కోసం ఎక్కడ ఉన్నా “ఎక్కడ రూకలు ఉంటే అక్కడ నూకలు కదా.”

కార్తీకం ఇక్కడ అయినా శోభా యామాన ప్రకృతి అందాలు దీపాల సందడి వన భోజనాలు సామూహికముగా ఉంటాయి.

ఐకమత్యం అనుబంధ మాసము శాంతి శుభము

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!