సెకండ్ ఇన్నింగ్స్

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

సెకండ్ ఇన్నింగ్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సీతా సుస్మిత

సాయంత్రం ఆరుబయట కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్న చింటుగాడికి వార్తాపత్రిక చూపిస్తూ , ” ఇందులో ఈ అమ్మాయి దగ్గర ఏదో రాశారు , ఏమని రాశారురా??” అడిగింది వరమ్మ . అప్పటికే బామ్మ అలా అడగడం మూడోసారి కావడంతో, విసుగొచ్చిన చింటూ, ” అబ్బా ,బామ్మా!! ఎన్నిసార్లు అడుగుతావ్?? నేను చదువుకుంటున్నాను కదా ఊరికే నన్ను కదిలించకు నేను చెప్పను !! ” కోపంగా అన్నాడు చింటూ.
అయ్యో!! అంత కోపమేమిట్రా ?? ఏదో పెద్దదాన్ని , చదవడం రాకనే కదా అడిగింది !!” అలిగింది బామ్మ.
“మరి నువ్వు కూడా చదవడం నేర్చుకో!! అప్పుడు ఎంచక్కా నన్ను అడిగే పని ఉండదు నీకు నువ్వే అన్ని చదువుకోవచ్చు !! ” అన్నాడు చింటూ.
“మరే ఈ వయసులో చదువుకుని ఎవరిని ఉద్దరించాలిట ?? మీ అమ్మ , పెద్దమ్మలలాగా పెద్దవారికి ఎదురు చెప్పాలా?? ” ఓరగా కోడళ్లను చూస్తూ అన్నది.
“మధ్యలో వాళ్లనెందుకు తీసుకొస్తావ్, నీ చదువు గురించి మాట్లాడుకోండి !!” అని కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు రవి.
ఇంటి నుంచి స్నేహితుల దగ్గరకు వచ్చిన రవి, అబ్బబ్బా ఇంట్లో మా బామ్మ గోల తట్టుకోలేకపోతున్నాము రా!! అమ్మా, పిన్ని మాట్లాడే వాటిల్లో ఏదోకటి అపార్థం చేసుకుని, చిన్న దాన్ని పెద్దది చేసి ఏదోకటి రభస చేస్తుంది. ఇందాక ఆ చింటుగాడు ఊరుకోక, బామ్మా నువ్వు కూడా చదువుకోవచ్చు కదా “అని అన్నాడు. దానికి ఆవిడ ఆ విషయాన్ని కూడా అమ్మవాళ్లతో ముడిపెట్టి మళ్లీ ఏదోకటి అంటుంది !!” అని తల కొట్టుకున్నాడు రవి.
“మీ ఇంట్లోనే కాదురా బాబూ, మా ఇళ్ళల్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఇంటింటి రామాయణం ఇది. మనం ఏమి చేయలేం !!” భూజలేగారెస్తూ అన్నాడు ఇంకో స్నేహితుడు.
“ఏదోకటి చేయాలిరా !! లేకపోతే ఆ గొలతో ఇంట్లో ఉండాలంటే పిచ్చెక్కిపోతుంది. అమ్మా వాళ్ళు ఇంకెంత కాలం భరిస్తారు ??! ” అంటూ ఆలోచించాడు రవి.
“ఒరేయ్ ఒక ఐడియా రా!! ఇందాక చింటుగాడు అన్నట్టు వాళ్ళని చదువుతో బిజీగా ఉంచితే??!” అర్థంకానట్టు చూశారు మిగతావారు.
ఇప్పుడు వాళ్ళకి ఏమి తోచక ఇలా చిన్నవాటిని పెద్దదిగా చేసి దానితో గొడవలు పడి ఆ విషయాల మీద మిగిలిన బామ్మలతో కలిసి చర్చలు పెడుతున్నారు. అదే బామ్మలందరిని చదువుతో బిజీ చేశామనుకో, వాళ్ళంతట వాళ్ళు వార్తాపత్రిక చదువుతూ అందులో విషయాల్ని చర్చిస్తారు. ఆ ఖాళీ సమయాన్ని ఇలా వ్యాపకంగా మార్చుకుంటారు.!!” అన్నాడు రవి
అందరూ ఈ ఉపాయం బాగుందని ఇంట్లో బామ్మలను, తాతయ్యలను ఒప్పించారు.
“ఈ వయసులో మాకు చదివెందుకు రా??” అని వారు అడిగిన దానికి పిల్లలు చెప్పిన సమాధానం ఇప్పుడు నువ్వు చదువుకుని ఏమి చేస్తావ్?? నా పేరుని నా చేతులతో రాసుకుని సంతోషిస్తాను రోజూ చదివే దేవుడి శ్లోకాలు ఎలా రూపాంతరం చెందాయో చదువుతాను !! ” ఓ బామ్మ కోరిక.
ఈ వయసులచదువెందుకు ?? లోకజ్ఞానం కోసం వార్తాపత్రిక చదువుతాను, నా శ్రీమతికి ఎప్పటికీ ఇవ్వలేని ప్రేమలేఖను నా స్వహస్తాలతో రాసి బహుమతిగా ఇస్తాను !!” ఓ చిలిపి తాత కోరిక.
ఇద్దరు పిల్లలతో ఉన్నత విద్య ఎవరి కోసం??” మా సొంతింటి కలలో కొన్ని ఇటుకలు పేర్చడం కోసం
నాలో విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం!! ” ఒక ఇల్లాలి కోరిక.
ప్రపంచంలో నిస్స్వార్థమైన కోరిక చదువు మాత్రమే !! కాబట్టి మీరు కూడా చదువు అనేది వ్యాపకంగా మొదలుపెట్టి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి !! ” అని చెప్పారు.
మొత్తానికి ” బాలవాక్కు బ్రహ్మ వాక్కు ” అన్న చందాన చింటూగాడు సరదాకి అన్నదానితో పిల్లలందరూ వారి పాఠశాల ముగిసిన తర్వాత పెద్దలకు చదువు చెప్తూ దానికి ” సెకండ్ ఇన్నింగ్స్ పాఠశాల ” అని నామకరణం చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!