పరమేశ్వరుని ప్రతిరూపాలే

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

పరమేశ్వరుని ప్రతిరూపాలే
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

         సుమారు ఇరవై సంవత్సరాల క్రితం రాజమండ్రి  నుంచి నాన్నగారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. అల్లుడు శ్యామ్ ఉన్నారా అని వానితో ఒక మంచి విషయం చెప్పి నీతో అన్ని విషయాలు చెపుతాను గాబరాలేదు అన్నారు. వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరున్న శ్యామ్ కి కార్డులెస్ ఫోన్ ఇస్తే నాన్న మాట్లాడారు. మా వారు పదినిమిషాలు మాట్లాడి తప్పకుండా మామగారు వస్తాము అని సుశీల తీసుకో అని ఫోన్ నా కందించారు. అమ్మా సుశీ ధీర్గ సుమంగళి భవ అని ఆశీర్వదించి మీ తమ్ముడు సుధాకర్ కి పెళ్ళి కుదిరింది నీవు ,పిల్లోడు, అల్లుడు గారు తప్పక రావాలి  ఈ రోజే ముహూర్తం పెట్టాము వైశాఖ శుద్ధ ఏకాదశి మే పన్నెండు. మీకే ముందు చెబుతున్నా మూడు నెలలు ఉంది అమెరికా నుంచి మీరొచ్చి దగ్గరుండి తమ్ముడు పెళ్ళి జరిపించాలి ఫ్లైట్ టిక్కెట్ ముందుగా బుక్ చేసుకోండి అని అమ్మకి ఫోన్ ఇస్తే అమ్మ సావిత్రి నేను ఒకటవ క్లాస్ పిల్ల ననుకునే అన్నీ వివరంగా చెప్పింది. అలాగే అని ఫోన్ పెట్టాను, మా తల్లిదండ్రులకు నేను, తమ్ముడు సుధాకర్ ఇద్దరే పిల్లలం. మా నాన్న గారు సుబ్రహ్మణ్యం ఆదర్శహెడ్మాస్టర్ గా పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులు గా విశ్రాంత జీవనం గడుపుతున్నారు. నానమ్మ కి ఒక్కడే కొడుకు కాబట్టి ఉపాధ్యాయునిగా ఉన్నఊరు నాలుగిళ్ళ వాకిలి, లంకంత ఇల్లు దానవాయి పేటలో ఎం.ఎస్. సి. లో ప్రథమశ్రేణి లో పాసయి బొంబాయి లో ఉద్యోగం వచ్చిన కన్నతల్లిని, ఉన్నఊరుని వదలక రాజమండ్రి లో ఉండిపోయారు. మా నానమ్మ కాంతమ్మ నన్ను తమ్ముడిని ఎంతో అమ్మకన్నా అపురూపంగా చూసేది అమ్మ మేము అల్లరిచేస్తే తిడితే వాళ్ళు పిల్లలే, దైవస్వరూపాలు అని వెనుకేసుకొచ్చేది. ఏ విషయానికి, ఊరు వెళ్ళాలన్న, అప్పడాలు, వడియాలు పెట్టాలన్న ముఖ్యంగా తమ్మడు సుధాకర్ ని వేలు పట్టుకోమనేది. వాడు పట్టుకుని చెపితే నిక్షేపంగా ఊరు వెళ్ళవచ్చు, పని జరుగుతుంది, మబ్బు పోయి ఎండ కాస్తుంది ఎండపెట్టుకోవచ్చు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు రా సుబ్రహ్మణ్యం అనేది. నా పెళ్ళి కూడా చూసి నేను అమెరికా వెళుతున్నప్పుడు  కంటతడి పెడుతున్న అమ్మతో ఏమిటి సావిత్రి వసుదైక కుటుంబం ఫోనులు, ప్రయాణ సదుపాయాలు వచ్చాయి
భవిష్యత్ వాళ్ళది అన్న విశాల దృక్పథం గల మామ్మ నే నేను పోలేను తమ్ముడి పెళ్ళికి నానమ్మ  ఈ లోకం లో లేక పోవడం భాదాకరమే ఆయిన ఆమె పూర్ణాయుర్దాయంతో రాముని కడకు వెళ్ళింది.
ఇండియా తమ్ముడి పెళ్ళి కి వెళ్ళే రెండు రోజులు ముందు భర్త శ్యామ్, కొడుకు ప్రణీత్ తో వాల్ మార్ట్ కి వెళ్ళి  ఏవో కొని ఇంటికి వచ్చి పడుక్కుని మర్నాడు పెట్టె సర్దేముందు నా బ్యాగ్ వాల్ మార్ట్ లో మర్చిపోయానన్నది గుర్తుకొచ్చింది. అందులో వీసా కార్డులు, నా క్రెడిట్ కార్డులు ఉండటం వలన గుండె పగిలినంత ఏడుపువచ్చి తమ్ముడి పెళ్ళి చూడలేము అన్నబాధ కలిగింది. వెంటనే మా ప్రణీత్ ని వేలు ముట్టుకోమని అంటే  ముట్టుకుని అమ్మా డోంట్ క్రై ఏడవకు దొరుకుతుంది అన్న వెంటనే  వాల్ మార్ట్ కి ఆఘ మేఘాలపై కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మేనేజర్ ని అడగ్గా నా ఐడెంటిటీ వలన బ్యాగ్ తెచ్చి ఇచ్చినప్పుడు నానమ్మ చెప్పిన బాలవాక్కు బ్రహ్మవాక్కు అక్షర సత్యం అనిపించింది. అప్పుడు నాకు ప్రణీత్ సుబ్రహ్మణ్యస్వామి లా కనిపించగా ఎత్తుకుని ముద్దాడి నానమ్మ ని జ్ఞాపకం చేసుకున్న రోజు నా జీవితంలో మరపురాని రోజు…!!
( ఇది జీవితాన జరిగిన యథార్థ సంఘటన)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!