దుర్గాలోచన

దుర్గాలోచన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

 రచన: భామ

    ఓర్నీ అసాథ్యం కూలా! దుర్గా! నీది దురా లోచనే!నాలుగో క్లాసు పాసవటానికి నాలుగు పదుల సార్లు డింకీ లు కొట్టిన మన తింగరి పిచ్చి సన్నాసి కి, డాక్టర్ చదువుకున్న మా ఓనర్ గారి అమ్మాయిని చేసుకుందామని ప్లానేస్తావా? పైగా ఆ పిల్లకి లేనిపోనివి అంట గట్టి నిందలేసి, వచ్చే మంచి సంబంధాలన్ని చెడగొట్టి మరీ! ఇన్నాళ్లు ఎందుకా సంబంధాలు చెడు తున్నాయనుకున్నా. ఇదా మతలబు. హమ్మా హమ్మా! దుర్గా, హేంతటి గుండెలు దీసిన బంటువే. బిత్తర పోయాడు దుర్గ భర్త ఏకాంబరం. ఇదుగో, ఇదిగో..ఊరికే అలా గుండెలు బాదేసుకోకండి! మీ దగ్గర ఏళ్లకి ఏళ్ళు వచ్చాయన్నమాటే గానీ, కూసింత లౌక్యమూ లేదూ, వాడి దగ్గర కాసింత లావణ్యమూ లేదు. మరి కోట్లకి పడగెత్తిన మీ ఓనర్ గారి అమ్మాయి లాంటి అమ్మాయి ఇంటికి కోడలు గా వస్తేనే కదుటండీ. మన చేతికి ఆస్తీ వచ్చేది, మన పిచ్చి సన్నాసికి పెళ్ళీ అయి చచ్చేదీ. లేకపోతే ఈ పిచ్చి సన్నాసికి మొహం
చూసి మీ సన్యాసి వేషం చూసీ ఎవడిస్తాట్టా పిల్లని?
కోట్ల ఆస్తి అప్పనంగా చేతికెట్టా వచ్చేదీ అనీ, ఏమిటో, తాటి చెట్టుకి మల్లే ఎదిగారు గానీ, తాటి ముంజంత గుజ్జు కూడా బుర్రలో లేదమ్మా మొగుడికి. ఎంచేస్తాం, నాకు తప్పదు కదా. సరి సరి. ఇదిగో మీరలా మాట్లాడకుండా కూర్చోండి. మిగిలిన గ్రంథం నేను నడిపిస్తాగా. ఇదుగో ఇప్పుడే చెబుతున్నా, మధ్యలో వచ్చి దుర్గా, నీది దురా లోచన, వంకాయ అంటూ మాట్లాడితే, నా సంగతి తెలుసుగా! ఆ..అదీ మరి. అయినా నాది దురాలోచనే మిటండీ? మీ మొహం మండా!దూరాలోచన అయితేనూ! ఏమిటో నమ్మా,
ఆ సన్నాసి కొడుకుతో, ఈ సన్యాసి మొగుడితో వేగలేక ఇప్పటికే చిక్కి సగ మయ్యాను. అయినా ఎవరికోసం నా తాపత్రయం? అర్థం కాదాయే ఈ మహాను భావుడికి. అనాల్సినవన్నీ గుక్క తిప్పుకోకుండా, మొగుడ్ని మరీ మాటాడనివ్వకుండా అనేసి మరీ అపసోపాలు పడి పోయింది దుర్గమ్మ. ఇక ఏకాంబరం, మీ మీదోట్టు తేరుకుంటే. హమ్మ నా పెళ్ళామా! నీ చావు తెలివితేటలు తగలెయ్య” అనుకుంటూ మనసులోనే షాక్ లోవుండి పోయాడలా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!