కారడివిలో మూడు రోజులు

కారడివిలో మూడు రోజులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఉత్కర్ష

ఎపుడో దరఖాస్తు చేసుకున్న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో రిపోర్టర్ ఉద్యోగంమంట మెయిల్  లో సారాంశం. ఎగిరి గంతేసి చేరిపోయా. మొదటిరోజే కెమెరామాన్ ఇచ్చి అడవికి పంపితే జీపు బోల్త, లోయలోకి జంపు. కళ్ళు తెరిస్తే కారడివి చిమ్మ చీకటి, చుట్టూ చిన్న పెద్ద జంతువులు అంతంత కళ్లెస్కుని నా వంకే చూస్తూ భయం భయం గా ఓ చిరునవ్వు విసిరా, పడిపోయాయాన్ని నా రాకని స్వాగతిస్తూ నాట్యం మొదలెట్టాయి, స్నేహం కుదిరింది మాకు, మొదటి రోజు: పులిమామతో దాగుడు మూతలు, మృగరాజు బావతో తొక్కుడు బిల్లా నక్క మామ తో అష్టాచెమ్మ , ఆడి ఆడి అలసి సొలసిన నన్ను చందమామ వచ్చి వెన్నెల స్నానాలాడించి నిద్రపుచ్చి వెళ్లాడు హాయిగా నిద్రపోయా. రెండవ రోజు: కొలను లో మొసలి కాక తోఈత కొట్టా, నెమలి మామ తో నాట్యం చేసిన, జింక బాబాయి తో పరుగు పందెం లో అలసి సొలసిన నన్ను కోయిలమ్మ వచ్చి జోలపాట పాడి నిద్రపుచ్చి వెళ్ళింది. ఆదమరిచి నిద్రపోయా.
మూడవ రోజు: హంస నేస్తం తో క్యాట్ వాకింగు చేసిన, చిలక పిన్ని తో అంత్యాక్షరి ఆడి,
సితాకోక చిలకమ్మ రెక్క పట్టుకొని ఆకాశం లో విహరిస్తుంటే ఎవరో పిలిచారు, కాదు కాదు అరిచారు. కిందకి చూస్తే ఎవరో బుచాడు.
స్కూల్ కి వెళ్లవా ఈరోజు అని నా పతిదేవుడు
తట్టి తిట్టి లేపుతున్నాడు కళ్ళు నులుముకుని అయోమయంగా చూసా. అప్పుడు అర్థం అయింది.
అదంతా కలని నా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో ఉద్యోగం కల, కలగానే మిగిలిపోయిందని
ఊసురుమంటూ లేచి దినచర్య లో పడిపోయా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!