పల్లెటూరు

పల్లెటూరు 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల.

వర్షాకాలం ఎడతెరిపిలేని వర్షం పొలం పనులు  మొదలు అయ్యాయి. బావకు క్షణం తీరిక ఉండదు. ఊ అంటే పొలం పనులు అంటూ వెళుతాడు. ఈరోజు పెందరాడే లేచి పొలం పని ఉందంటూ హడావుడిగా వెళ్తుంటే ఏంటి బావా అంత హడావుడి టిఫిన్ అయినా చేయకుండా వెళ్తావు ఏంటి ? ఒక నిముషం ఆగు టిఫిన్ తెస్తాను. వద్దు వద్దు కాముడు చాలా పనుంది మళ్లీ వచ్చి తింటానులే అంటూ ఆగకుండా వెళ్లాడు ఏంటో బావా మూర్ఖత్వం అనుకుంటూ తన పనిలో నిమగ్నమైంది. భావ అగ్రికల్చర్ కోర్సు నేర్చుకున్నాడు. తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం విడిచిపెట్టుకుని ఉద్యోగాలంటూ పట్నాల్లో ఉండటం బావకు ఇష్టం లేదు. అందుకే బావ వ్యవసాయం ఎంచుకున్నాడు. భావకు పల్లెటూరు అన్న  పల్లెటూరు వాతావరణం అన్న చాలా ఇష్టం. అన్ని సౌకర్యాలు అన్ని హంగులు ఉన్నప్పుడు వేరే చోటికి పోయి కష్టపడడం ఎందుకు పుట్టి పెరిగిన ఊరిలో ఉండాలి అనుకుంటాడు. బావ! బావ నిర్ణయమే తన నిర్ణయం బావ మాటకు ఎన్నడూ ఎదురు చెప్పలేదు అందరితో సరదాగా ప్రేమగా ఉంటాడు.
ఎవరికి ఏం సహాయం కావాలన్నా అన్నిటికి తనే ముందుంటాడు ఊరిలో బావ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. మేమిద్దరం ఇష్టపడ్డాం మేనరికమే కనుక మా పెద్దవాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. ఘనంగా మా ఇద్దరికీ పెళ్లి చేశారు.
అలా ఆలోచిస్తుండగా బావ పిలుపు వినబడింది. ఆలోచనలను పక్కకు పెట్టి ఆ వస్తున్నాను బావా అంటూ వెళ్లింది. అప్పుడే భావ కాళ్లు చేతులు కడుక్కుంటూ కనిపించాడు. ఏంటి బావా ఇంత ఆలస్యమైంది. తిండిమీద ఇంటిమీద చిత్తం లేకుంటే ఎలా బావా అంది నేనేమైనా ఆడుకోవడానికి వెళ్లాన పొలం పనులు చూడటానికే గా వెళ్లింది. తన వైపు చురుగ్గా చూస్తూ’ఆ చూపులకు తను సిగ్గుపడుతూ భావ నేను కూడా తినలేదు. అంది బుంగమూతి పెడుతూ ఈ బుంగమూతి లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ తెలుసా బుగ్గమీద చిటిక వేస్తూ అన్నాడు. నవ్వుతూ ఛీ.. పో బావా ఎక్కడికి పోతాను అంటూ తన చేతులతో కౌగిలిలో బంధించాడు. వదులు బావా ముద్దుముద్దుగా గోముగా అంది. చాలా టైమయింది అన్నావుగా అంటూ ముద్దుల వర్షం కురిపించాడు. ఆకలిగా వుంది బావా నీ ఆకలి నెేను తీర్చిన అన్నాడు ముద్దుముద్దుగా నీకు వేళాపాళా అంటూ లేదు బావా అంటూ తప్పించుకుని వెళ్లింది. బావ సరదాగా ప్రేమగా సీదాసాదాగా ఉంటాడు. పిల్లలు లేరన్న బాధను కూడా బయటకు కనిపించనీయడు.
ఇద్దరూ భోజనం కానిచ్చారు. ఇంతలో పరంధామయ్యగారు దుర్గా ప్రసాద్ గారు అంటూ  పిలుస్తూ వచ్చారు. ఏంటి పరంధామయ్యగారు ఇలా వచ్చారు. రండి కూర్చోండి అంటూ పలకరించాడు
మన రామాలయంలో ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. కదా వాటి గురించి మాట్లాడటానికి వచ్చాను సరె దానిదేముంది మనం అనుకున్న విధంగానే జరిపిద్దాం పనులన్నీ జరిపించండి అలాగే నండి వస్తానంటూ వెళ్లాడు. ఆరుబయట మంచాలు వేసుకుని చక్కటి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. తెల్లవారుజామున రంగయ్య పిల్చేదాకా మెల్కువ కాలేదు. వచ్చావ రంగయ్య అంటూ దొడ్డితలుపులు తీశారు. ఆవుపాలు బర్రెపాలు పిండి మందకు తోలుకువెళ్లాడు. రంగయ్య! కాముడు నాకు టీ పోస్తావా అంటూ లోనికి వచ్చాడు. కాముడు అంటే కామేశ్వరి ముద్దుగా కాముడు అని పిలుచుకుంటాడు. పెళ్లై ఐదు సంవత్సరాలు అయినా పిల్లలు కాలేదు కాముడికి అదే బెంగ బావా మనకు పిల్లలు పుట్టరా అంటూ బాధగా అడిగింది. ఎందుకు పుట్టరు? కాముడు మనకేమంత వయసైపోయిందని అలా బాధపడతావు అన్నాడు. తనకు కూడా  పిల్లలంటే ఇష్టం మొగవాళ్ళు కదా తొందరగా బయటపడరు.
మనం కావాలన్నప్పుడు వచ్చే వస్తువు కాదు కదా అని సరిపెట్టుకున్నాడు. ఎప్పుడు బాధపడినా అలాగే ఓదారుస్తాడు. ఇంతలో ఫోన్ రింగ్ కావడంతో ఫోనెత్తాడు ప్రసాద్ హలో అన్నాడు. హలో అల్లుడు బావున్నావ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు ఆ బావున్నాను మావయ్య మీ అత్తగారు నేను రేపు ఉదయాన్నే! వస్తున్నామంటూ తీపి కబురు చెప్పాడు? రండి మావయ్య మీ కూతురు కూడా మీకోసం కలవరిస్తోంది. రండి అలాగే మీ అత్తయ్య తన కూతుర్ని చూడాలని ముచ్చట పడుతుంది అల్లుడు అంటూ పెట్టేశాడు అలాగే అంటుూ తను పెట్టేశాడు. అదే విషయం కాముడికి చెప్పాడు చాల సంతోషపడింది ఎప్పుడు తెల్లవారుతుందా అంటూ ఎదురుచూస్తూ పడుకుంది. తెల్లవారగానే తల్లిదండ్రులు రావడంతో చాల సంతోషపడింది కుశలప్రశ్నల తర్వాత భోజనం కానిచ్చారు. కాముడు ఇలారా అంటూ పక్కకు  పిలిచింది లోపలికి వస్తు ఏంటమ్మా అంది. ఏం లేదు కాముడు మన పక్క ఊరిలో ఒక స్వామీజీ వచ్చాడు తను ఏం చెప్పిన నిజం అవుతుందట మనం ఓసారి వెళ్ళివద్దాం. పక్కింటి విశ్వేశ్వరి వెళ్లింది. తనక్కూడా అనుకున్నది అయింది. మనము ఎందుకు వెళ్ళకూడదు అంది. అమ్మా బావకు ఇష్టం   ఉండదేమోననే అంది అనుమానంగా మనం చెప్దామా ఏంటి! బావ తెలిస్తే అంది భయంగా భయపడకులెే నేనున్నానుగా నేను ఏదో ఒకటి చెప్తానుగా ముందు తయారవ్వు అంది అనడంతోనే ఇద్దరు తయారై వెళుతూ అల్లుడు గారు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాము అంటూ వెళ్లారు. బావా వైపు చూస్తూ వెళ్ళన అంటూ సైగ చేసింది. వెళ్లు అన్నట్టుగా తల ఊపాడు ఇంకేముంది సంతోషంగా వెళ్లారు. స్వామికి నమస్కరించి జరిగిన విషయమంతా చెప్పారు ఏదో విభూతి మంత్రించి ఇచ్చారు ఇది రోజు పెట్టుకోమని అలాగే అంటూ ఇద్దరు నమస్కరించి బయటకొచ్చారు. అమ్మా రామాలయంలో ఉత్సవాలు ఘనంగా జరిపిస్తారు. మనం కూడా వెళ్దాం అమ్మ అలాగే అంటూ ఉత్సవాల సంబరాలకు వెళ్లారు. నువ్వు బాగా దణ్ణం పెట్టుకో పండంటి బిడ్డ కలగాలని అలాగే అమ్మ అని దండం పెట్టుకుంది అదేం మహిమనో కానీ నెల రోజులు తిరగకుండానే కాముడు  నీళ్ళోసుకుంది. ఇళ్లంతా సందడి కాముడు ప్రసాద్ ల సంతోషాలు ఇంతాఅంతా అని వర్ణించలేము కాముడు పండంటి మగబిడ్డను కన్నది. బారసాల ఘనంగా చేశారు ఆ బాబు పేరు చంద్రశేఖర్ అని పెట్టారు చంద్రుడిలా వెలిగిపోవాలని అలా పెట్టారు. కాముడు ప్రసాద్ ఆ బాబును చూసుకుంటూ సంతోషంతో ముందుకు సాగిపోయారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!