చిత్రము

 చిత్రము

రచన : ఆర్కా

అహో ఏమని తెలుపుదును నా వేదన…
నా మది నిండిన ఆవేదన…

నా ప్రియ సఖుని చూచి
ఎన్ని యుగములైనవో కదా…

ఓ ప్రియుడా మన్నింంపుమా…
నీ చిత్రము చేజార్చుకుంటిని…

నేనెంతటి అభాగ్యురాలను…
సఖుని చిత్రము చూడక
క్షణమొక యుగమాయెనే…

ఓ ప్రియుడా…
నీకు నాపై ప్రేమున్నదో
లేదో నాకెరుక లేదు…

కానీ… నీవే నాకు ఊపిరి…
నీవు నన్ను కన్నెత్తి చూడవు
నీవు నాతో మాటాడవు
నాకు నీ మనసున
స్థానము లేదని తెలిసినా
నాకు బాధగ లేదు…

నన్ను బ్రతికించేది నీ చిత్రము…
నాకు ఊపిరి నీ నవ్వు…
నీ కంటిచూపు నా జీవితము…

నా ప్రాణము వంటి
నీ చిత్రము నే చేజర్చుకుంటిని…

ఓ…. అంబరమా…
నీవే తెల్లని కాగితముగా మారుమా…
ఓ…. మేఘమా…
నీవే నా సఖుని రూపుని దాల్చుమా…
ఓ… ప్రకృతి…
నాపై కరుణ చూపుమా…

నీలో నా ప్రియసఖుని
చుచుకొను భాగ్యమునివ్వుమా…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!