చిలుక కబ్జా

చిలుక కబ్జా

రచన:: మంగు కృష్ణకుమారి

మా మేనత్తగారి ఇంటినిండా పిచికల గూళ్ళు, వాటికి ముద్దులూ, మురిపాలు అన్నీ.

ఒక రామచిలుక పిచుకగూట్లో చేరి పిచికలని తోసేసి, దాని
జోడు చిలకని తెచ్చే ప్రయత్నం చేసింది. మా వాడు పాపం చిలుకకీ గూడు ఇచ్చి, పిచుకలకి సకల ఏర్పాట్లు చేసేడు.

మురిపం ఆగక
నేనో కవిత గిలికేసాను.
👇👇👇👇

చిలుక కబ్జా

****************************

హన్నా ! రామ చిలుకవా? రాకాసి చిలుకవా? నేను చూసి ఊరుకొనే ఉంటాననా? ఏమీ అనన్లే అనా?

మా మనుషుల సావాసం
నీకు బాగానే అబ్బిందే! పిచిక మీద ‘కబ్జా అస్త్రం’ వేసేద్దామనే?

చిట్టీ పొట్టీ పాపలూ, అక్కలూ, చెల్లెళ్ళూ, తమ్ముళ్లూ చూసేరా?
రాలుగాయి చిలుక గూటికోసం పిచికమీద చేస్తున్న తోపులాట!

నాకు చిట్టి పిచికా ముద్దే!
వయ్యారి చిలకా ముద్దే!
బుద్ధి చెప్పాలంటే వింటాయా!

చూడండి అందరూ! చిలుకకీ ఇల్లిచ్చేసాం! పిచికలకీ గూడు
కట్టేసాం!

అవేం మనుషులు కాదుకదూ! కబ్జా చేసి సాటి మనుషులని తోసేసే రాక్షసులూ కాదు! తమతమ నెలవులకోసం పోరాటం! జోడు పిట్టకో
గూడు ఇవ్వాలని ఆరాటం

మనం‌ దారి చూపిస్తే ఒకళ్ళతో ఒకళ్ళు నేస్తాలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!