దైవ ప్రార్థన

దైవ ప్రార్థన

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

విశ్వపాలకా రామచంద్రా ప్రజల దుఃఖాలు నివారించ
రావయ్యా రామయ్యా. నీకు ఎన్నో పనులు వున్నాయేమో‌.
నా మొరను మీ కుటుంబ సభ్యులకు కూడా విన్నవించుకుంటున్నా.
మా శోకాలు తగ్గించ వారి మాటైనా వినవయ్యా రామయ్యా;
ఎన్నో కష్టాల్లో వున్నామయ్యా రామయ్యా.
మాకు రక్షణ ఈయవయా శరణాగతవత్సలా.
అయినా నీకు చెప్పాలటయ్యా రామయ్యా మా వ్యధలు తీర్చమని;
రామయ్యకు మా మాటగా చెప్పమ్మా సీతమ్మ తల్లీ.
నువ్వు బాధలలో మునిగితేలావు కదమ్మా.
నీకు వున్నంత సహనం మాకు లేదు తల్లీ.
రామయ్యను ఒప్పించి, చిక్కులనుంచి మమ్ము కాపాడు జననీ;
రామయ్య నిన్ను కాదనడు కదా లక్ష్మయ్యా.
మా వెతలు తొలగించమని మీ వదినమ్మతో కలిసి
రామయ్యకు చెప్పగరాదటయ్యా లక్ష్మయ్యా;
అంజనిసుతా అంజలి ఘటిస్తూ,
మరీమరీ నిన్ను వేడుకుంటున్నా.
అయ్యా రామాజ్ణ పొంది,
మా హృదిలో ధైర్యాన్ని నింపి,
మా పీడలు వదిలించగ రాదయ్యా హనుమయ్యా;

రామయ్యలా స్వచ్ఛంగా వుందాం,
మానవతా విలువలు పాటిద్దాం,
రామపరివారం మనతోనే వుంటుంది,
మొర వింటుందనే నమ్మకమూ వుంది

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!