పాట సమీక్ష (బలే బలే అందాలు)

పాట సమీక్ష (బలే బలే అందాలు)

రచన: యాంబాకం

చిత్రం: భక్త తుకారం 
రచన: వేటూరి
సంగీతం: పి. ఆదినారాయణ రావు
గానం: ఘంటసాల
సందర్భం : భక్తి పారవశ్యంలో

ఒక నిస్వార్థపరుడు అందులో నిత్యం పాండురండినే ధాన్యం తప్ప ఇంకేమీ ఉపకారం ఎరుగని ఒక భక్తుని ఆవేదన ఇక్కడ కథానాయడి ద్వారా అప్పటి మానవుని గురించి భక్తి తో పాట రూపంలో. తెలిజేయడమే ఈ సినిమా తీసిన వారి అభిప్రాయం,కాబోలు!
“భక్తతుకారాం” నిత్యం శ్రీపాండురంగడి” ధ్యానంలో ఉంటాడు. ఇంటిలోజరుగుబాటు లేక చాలా కఠినమైన పరిస్థితులను,గమనించి ఒక మోతుబరి రైతు తన దగ్గర ‌ పసువుల కాపరి గా పని ఇస్తాడు. అతని తత్వం తెలిసికూడ. అతని భక్తి తత్వం తెలిసి అతడు పసువులను ఎలా! కాపరి తనం చెయగలడో ఎరిగిన వాడై మన కవి గారు నిజంగా ఒక భక్తుడి ద్వారా పకృతి లో ఉన్న జీవరాశులకు మనుష్యులకు గలమధ్య వ్యత్యాసం చాల విడమరుపుగా అందంగా రచించారు. తరువాత చివరిలో కొసమెరుపు మానవుడు దేవుడు గా మెలాగాలి అని తన కావ్యం లో వ్యక్త పరచటం ఆపాటకే వన్య కాగా ఆ పాట వినే ప్రతి వారికి వాస్తమే కదా అనిపిస్తుంది.

“మొదట గా బలే బలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం,అదే అనుబంధం ప్రభో మామనుషులకు ఎందుకు ఈయవు” అంటూ! నే
“మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవిస్తాయి, ఐక్యం గా ఉంటాయి.ద్వేషించుకోవు,
మాటలు నేర్చిన మానవులు ఎందుకో కలసి జీవిచక, మారణహోమం సాగిస్తారు”. అని చెప్పుతూనే, చమత్కారంగా నీవు అని దేవున్ని సంభోదిస్తూ మనుషులను ఎందుకు మార్చవు. అని సూటిగా పశ్నిస్తాడు. దేవున్ని.ఎందుకంటే తుకారాం శ్రీపాండురంగడి పరమ భక్తుడు భక్తుడి కి భగవంతుడికి ఉండే అవినాభావ సంబంధం కవిగారు గ్రహించి, రాయడం మహా అద్భుతం.

ఇక రెండవ చరణం లో చల్లగా సాగే సెలయేరు లాగ,చల్లగా మనుషులు ఉండాలి అంటూ,గుంపు గా ఎగిరే గువ్వల జంటలుగా పయణించాలి మానవులను ఉద్దేశించి ఎందుకు వాటిలాగ కలసి ఉండలేక,పయణించ లేక పోతున్నారు.అని తన తోటీ వారికి హెచ్చరిక చేస్తూ,చాల గొప్ప భావాలను వ్యక్త పరిచారు.కవిగారు.చివరి గా చక్కగా హితవు నేర్పడానికి కూడ ప్రయత్నించారు. స్వార్ధంమాను కొని సిరులు పంచుకొని “మంచిగ మానవుడు మాధవుడై” మనం ఏరూపాన్ని అయితే దేవుడు అని అనుకొంటున్నామో అది పతి మానవుని లో చూడాలని అందరి హృదయాల్లో కలగాలి అని ముగించారు.

ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకొవాలసిన పాట వినాలసిన పాట భక్తతుకారం చిత్రం ద్వరా మనకు ఇంత మంచి పాట ఇచ్చిన పెద్దలకు మనసు విప్పి పాదాభివందనాలు.

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!