బలాదూర్ బలరాం..!

బలాదూర్ బలరాం..!

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

బలాదూర్ తిరిగే బలరాం ఒక రోజు కొండపైనున్న పాత గుడికి పయనమయ్యాడు. దారిలో మిత్రుడు బద్రి ఎదురై ఎక్కడికిరా అని అడగడంతో బలరాం పాతగుడికెళ్దాం పద అంటూ ఇద్దరూ కొండ ఎక్కడం ప్రారంభించారు. కొంచెం దూరం ఎక్కాక ఓ పెద్ద బండ వారిపైకి దొర్లడంతో పక్కకి దూకేశారు. బండ నేరుగా పెద్ద మర్రిచెట్టుకి తగిలి రెండు ముక్కలైంది.బద్రి ఏంట్రా ఎప్పుడూ లేనిది ఇలా బండ దొర్లడమేంటి?అసలు నువ్వు పాత గుడికెందుకెళ్తున్నావ్ నన్నెందుకు రమ్మన్నావ్. ఇంకొంచెం అయ్యుంటే ప్రాణాలు పొయ్యేవి అన్నాడు. ఒరేయ్ బద్రి..మనలా బతకడం కంటే ఆ బండ కింద పడి చావడమే నయం కదరా అన్నాడు బలరాం.”అబ్బో ఏందయ్యో నువ్వేదో కార్యవాదిలా మాట్లాడుతున్నావ్. నువ్వూ నేనూ ఒకటే కదా”అంటూ బద్రి కాలు రాతికి తగలడంతో దొర్లుకుంటూ పక్కనే ఉన్న వాగులో పడ్డాడు.బలరాం వాగులోకి దూకి బద్రిని పట్టుకొని కొండ ఎక్కుతుండగా బద్రి “ఒరేయ్ నా కాలు బాగోలేక పోయినా కొండ ఎక్కిస్తున్నావ్ కదరా”అంటూ నిరాశగా  ఎక్కాడు.ఎలాగోలా కొండ ఎక్కేశారు.
కొండెక్కాక బద్రి “ఎందుకెక్కించావో ఇప్పుడైనా చెప్పరా “అనడంతో బలరాం “నేను కయ్యల్లోకి పోదామని నాయనతో వీధిలో పోతా ఉంటే సర్పంచి బాలాజీ మామ ఎదురై ఏం మావా ఈ  సోంబేరి ఎదవని తీసుకెళ్తున్నావా ఇక నీ పని జరిగినట్టేలే అంటూ మా నాయన్ని ఎగతాళి చేశాడు.నాకు కోపం వచ్చి ఏం మావా ఎలా కనిపిస్తున్నాను నీకు అని ఉరిమి చూశా. ఆయనకి ఎక్కడో కాలినట్టుంది  నాతో ఛాలెంజ్ చేశాడ్రా”అన్నాడు .బద్రి “ఏం ఛాలెంజ్ రా స్వామీ”అన్నాడు.”కొండమీద ఉన్న గుడిని కొత్త గుడిగా మార్చగల ఓపిక ఉందా..?పాడుబడ్డ మన గుడిని మరలా కొత్త గుడిగా మారిస్తే నిన్ను సోంబేరి అనను అంతే కాదు  దేవుడి మాన్యం భూమి మొత్తం నీకే రాసిస్తాను అంటూ ఛాలెంజ్ చేశాడు. నాక్కూడా ఇది మంచి అవకాశం అనిపించింది అందుకే నిన్ను తోడు తెచ్చుకున్నా “అని బలరాం అనడంతో “ఏంటి ఈ గుడిని కొత్తది చెయ్యాలా నీకు బుద్దుందా ,మన చేతకాని తనాన్ని అందరికీ తెలిసేలా చేయడానికే బాలాజీ మామ కావాలనే చెప్పాడు”అంటూ బద్రి బలరాంని తిట్టాడు.బలరాం “పంచాయితీ ఆఫీసు ముందు అందరూ చూస్తుండగా చెప్పాడ్రా మామ మాట తప్పడు ,నా మాట విను ఇదే మంచి అవకాశం “అంటూ గుడి తలుపులు తీశారు.బూజు సాలెగూళ్ళతో ఆ గుడి గందరగోళంగా ఉంది.కర్రలు తీసుకొని గుడిలోని బూజుని,సాలె గూళ్ళని తీసేసి అలసిపోయారు.ఒరేయ్ బద్రీ ఛాలెంజ్ అయితే చేశాను కానీ బూజుకే ఇలా డీలా పడిపోయాం ఇంత పెద్ద పని చేయగలమంటావా అన్నాడు బలరాం, దానికి బద్రి “ఏదైనా పనిని మొదలెట్టేముందే అవన్నీ ఆలోచించాలి.మొదలుపెట్టాక ఆపడమనేది ఉండకూడదు”అన్నాడు. ఏం చెప్పావ్ రా అంటూ ఆవేశం పునికిపుచ్చుకొని గుడి చుట్టూ శుభ్రం చేసేశాడు.చీకటి పడిపోయింది.కొండ దిగాలని బలరాంకైతే లేదు.ఆకలి వేస్తున్నా సరే ఇంటికెళ్ళాలని అనిపించట్లేదు.అందరూ మనిద్దరిని పనికిమాలిన వాళ్ళుగా జమ కట్టారు కదరా వాళ్ళకి మన పనితనమేంటో చూపించాలి అంటూ ఇద్దరూ చేతిలో చెయ్యేసి ఈ రాత్రికి ఇంటికెళ్ళి రేపు అవసరమైన సామాను ,వంట సామాను తెచ్చేసుకొని పనంతా అయ్యాకే కిందికి దిగుదాం అనుకొని ఇంటికొచ్చేశారు.
రాత్రంతా బలరాంకి నిద్ర పట్టలేదు.అదే ఆలోచన ఎలా గుడిని మార్చాలా అని.తెల్లారేసరికి ఇంట్లో అమ్మకి పనికెళ్తున్నా మూడురోజులు రానని చెప్పి బయలు దేరి బద్రి వాళ్ళ  ఇంటికెళ్ళి బద్రీ అన్నాడు.అక్కడ బద్రి వాళ్ళమ్మ కన్నీరు మున్నీరవుతూ ఇంకెక్కడ బద్రీ రా మనల్ని వదలి వెళ్ళిపోయాడంటూ రోదించడంతో బలరాంకుప్ప కూలిపోయాడు.మిత్రుడు చెప్పిన ఒక పనిలోకి దిగాక వదలకూడదన్న మాట ని గుర్తు చేసుకొని సామాన్లను తీసుకొని కొండెక్కేశాడు.వారం రోజుల తర్వాత కాందకి వచ్చి బాలాజీ మామని పిలిచి “మామా నీ ఛాలెంజ్ లో నేను గెలుచానో లేదో తెలియదు కానీ మన గుడి మాత్రం అందంగా తయారయ్యింది “అన్నాడు.బాలాజి “ఏంట్రా నువ్వు చెప్పేది నిజంగా మన గుడిని మార్చేశావా,నిజమేనా “అంటూ బలరాం ముఖంలో నమ్మకం తాండవించడంతో  ఊర్లో వాళ్ళందరినీ కొండెక్కించాడు.అక్కడ గుడి రూపురేఖల్ని మార్చేసిన బలరాం నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.ఇంత మంచి పనివంతుడివి ఖాళీగా ఉంటే ఇలాంటి అద్భుతాలు ఎలా జరుగుతాయంటూ బలరాం కి దేవుడిమాన్యాన్ని రాసివ్వబోగా బలరాం మామా దేవుడి మాన్యాన్ని నాకు కాదు బద్రి వాళ్ళమ్మకి రాసివ్వండి అంటూ ప్రాధేయపడ్డాడు.బాలాజీ బలరాం స్నేహానికిచ్చిన విలువకి డబ్బుపై ఆశ చూపించక పోవడం నచ్చి తన కూతురినిచ్చి పెళ్ళిచేసి అల్లుడిని చేసేసుకున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!