సంక్రాంతి కథల పోటీ 2022

తపస్వి మనోహరం

(అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సంక్రాంతి కథల పోటీ 2022

2022 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తపస్వి మనోహరం మరో సరికొత్త కథల పోటీతో మీ కలం ముంగిట నిలిచింది.

పోటీ వివరాలు::

కథ అంశం: ఐచ్ఛికం
కథ నిడివి 300 నుండి1500 పదాల వరకు ఉండవచ్చు.
ఒక్కొక్కరూ 3 కథల వరకు పంపవచ్చు.

పోటీ మొదలయ్యే తేదీ: 21-11-2021
పోటీకి ఆఖరి తేదీ: 31-12-2021
పోటీ ఫలితాల తేదీ: 15-01-2022

(ఫలితాల కోసం 15-01-2022 రోజున తపస్వి మనోహరం వెబ్సైట్ లో “పోటీలు- ఫలితాలు” విభాగంలో పరిశీలించగలరు.)

బహుమతుల వివరాలు::
పోటీలో ఐదుగురు విజేతలను ఎన్నుకుని, ఒక్కొక్కరికి 500/- చొప్పున ఇవ్వబడుతుంది.
మరో ఐదుగురు రచయితలను కూడా ఎంపిక చేసి వారి ఇతర రచనలు కూడా సేకరించి పర్సనల్ e-book గా రూపొందించి మనోహరం వెబ్సైట్ లో పుస్తక విభాగంలో పెట్టడం జరుగుతుంది.

పోటీలో బహుమతులు ఎన్నుకునే ప్రక్రియ::
రచయితలు పంపిన ప్రతి కథ ‘తపస్వి మనోహరం’ వెబ్సైట్ లో ‘కథలు’ విభాగంలో “సంక్రాంతి పోటీ రచనలు” అనే ఉప విభాగంలో upload చేసి, ఆ కథ యొక్క లింక్ మరుసటి రోజే రచయితకు పంపించటం జరుగుతుంది.
మీ కథలో కథనంతో పాటుగా, వెబ్సైట్ లో వచ్చే వ్యూస్, కామెంట్స్ కూడా పరిగణలోకి తీసుకుని విజేతలను ఎన్నుకోవడం జరుగుతుంది. కావున రచయితలు కథ రాసి పంపించడంతో తమ బాధ్యత అయిపోయింది అనుకోకుండా.. మాతో పాటుగా మీరు కూడా మీ కథ పాఠకులకి చేరే విధంగా కూడా కృషి చేయవలసి ఉంటుంది.
విజేతలను ఎన్నుకోవడంలో పాఠకులు, ఇతర రచయితలు మీకు, మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము.

సంక్రాంతి కథల పోటీల్లో గెలిచిన రచయితలను 2022 లో జరగబోయే తపస్వి మనోహరం ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో సత్కరించటం జరుగుతుంది.

నిబంధనలు::
–    మీరు పంపే కథ ప్రింట్, వెబ్ పత్రికలలో గానీ, పర్సనల్ బ్లాగ్స్, సోషల్ మీడియాలో గానీ ప్రచురితం కాలేదని, కథ అనుకరణ, అనుసరణ, అనువాదం కాదని, ఏ పోటీ పరిశీలనలో లేదని,       సొంత రచన అని.. హామీ పత్రంతో పాటుగా మీ పేరు, కథ శీర్షిక(టైటిల్), ఫోన్ నెంబర్/మెయిల్ ఐడి పంపవలెను.
–   రాత ప్రతులు, స్కాన్ కాపీలు, pdf లు తీసుకోబడవు.
–  మీరు పంపిన రచనలను వెబ్సైట్ నుండి తొలగించుట కుదరదు.
–  మీ కథలను వర్డ్ డాక్యుమెంట్ గా లేదా వాట్సప్ లో పంపవచ్చు. మీ కథ ఎడిటింగ్ చేయబడదు, అక్షర దోషాలు సరి చేయబడవు.
–  పోటీ ఫలితాలలో తుది నిర్ణయం నిర్వాహకులదే. ఇందులో ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు.

పై నిబంధనలకు అంగీకారం అయిన యెడల మాత్రమే మీ రచనలను మాకు పంపించండి.

పోటీకి కథలు పంపవలసిన చిరునామా:
వాట్సప్ నంబర్: +91 7893467516
మెయిల్ ఐడి:: manoharam.editor@gmail.com

తపస్విమనోహరం వెబ్సైట్: https://thapasvimanoharam.com/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!