స్వాతంత్ర్య జెండా
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
ఆగస్ట్ 15 వచ్చింది
ఆశల నందనం తెచ్చింది
ఆనాటి ఎందరో వీరులు
ధీరులు ప్రతి ఇంటి నుండి
దేశ స్వాతత్య్రానికి ఎంతో
ఘనమైన ఆదర్శ కీర్తి
పింగళి వారి మువ్వన్నెల జెండా
నేటికీ అనంత స్ఫూర్తి
పచ్చని చేలు ప్రగతి సోపానాలు
తెల్లని రంగు శాంతి చిహ్న ము
కాషాయం త్యాగ నిరతి మార్గము
అశోక చక్రం ధర్మ పదము
మానవాళిలో ఎన్నో మార్పులు
సమాజ హితమే దేశ హితము
పంచ సప్తతిలో దేశ స్వాతంత్ర్య
ఉత్స్తవాల ఎందరికో స్ఫూర్తి
ఇది మన స్వర్ణ భారతికి ఎంతో
కాంతి వెలుగులు పండుగ రోజు
***