మొండి మొగుడు

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

మొండి మొగుడు 

రచన :: లోడె రాములు

వారిద్దరి మధ్య కాపురం
మొక్కుబడిగా సాగుతుంది
కనీస బాధ్యతలు కాసింతైనా
కంటికి కనిపిస్తలేవు..
ఒకరు పెంకి పెళ్ళాం..
తాను పట్టినదానికి మూడే కాళ్ళు..
ఒకరు మొండి మొగుడు..
నీవు ఎడ్డేo అంటే నేను తెడ్డేo…
ఎవరికి వారే గొప్పనుకుంటూ..
ఎడమొఖం పెడమొఖం తో
కలహాల కాపురం సాగుతుంది
డైలీ సీరియల్ గా..అంతం లేదు
ప్రతి రోజూ ఆరంభమే..
అస్తిపాస్తులున్నాయి…
అందచందాలు ఉన్నాయి..
లేనిది ఒక్కటే అన్యోన్యత…
వారి గుండెల్లో ప్రేమ ఉన్నా..
చెరువు ఎండిపోయిన అనుభూతి..
పెంకితనాన్ని..మొండితనాన్ని
చేరిపేసుకొని సంసారలోని
అమృతాన్ని ఆస్వాదిస్తే..
ఆది కావ్యానికి శ్రీకారం..
ఆ ఆలుమగలే…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!