స్వేచ్ఛ..

అంశం: స్వేచ్ఛాస్వాతంత్రం ఎక్కడ!?

స్వేచ్ఛ..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ధన

ఎక్కడా ఉంది ..
బహుశా పేరులోనా!?
అవును పేరు లోనే ఉంది …

స్వేచ్చగా నవ్వగలమా!!
నవ్వితే నవ్వులు పాలు అవుతావు అంటు
హిత బోధ చేస్తారు….
స్వేచ్ఛగా మనస్పూర్తిగా ఏడవగలమా!??
నువ్వు అంత బలహీనమా!???
అంటూ ఎగతాళి చేస్తారు …

మనస్పూర్తిగా స్వేచ్చగా నచ్చిన మాటను
గట్టిగ మాట్లాడగలమా ..!???..
హుష్..చిన్నగా అంటు అదుపు చేస్తూ
మనం చేసింది తప్పుమో అనేలా
చేస్తూ మాట్లాడటమే తప్పు అనేలా
చేస్తూ వాక్ స్వాతంత్రం లాగేస్తారు

స్వేచ్ఛగా నచ్చిన పని చేయగలమా!???
లేదు కదా…..
బాధ్యాయుతంగా ఉండాలి అంటు
అడ్డుకట్ట వేస్తారు…
హాయిగా,స్వేచ్చగా పక్షిలాగ ఎప్పుడైనా
ఎక్కడికైనా వెళ్ళగలమా…
ఏమో ఏదైనా జరిగితే అన్న మీమాంసలో
కాళ్ళకి అడ్డు పుల్లలు వేస్తారు..

నచ్చిన భాగస్వామిని ఎన్నోకొగలమా…!??
కులము,గోత్రము…
ఆస్తి,సమాజం అంటు బిడ్డ సంతోషం కన్న
నాలుగు రోజుల్లో అన్నీ మర్చిపోయి
తమ లోకంలో తాముండే జనాలు
గురించి ఆలోచిస్తూ  బలవంతపు బంధాలను
ముడివేసి జీవితాంతం స్వేచ్ఛగా ఉండే హక్కును
కోల్పోయి కష్టాల్లో బ్రతికేలా చేస్తారు.

స్వేచ్చగా నచ్చిన కథలు, కవితలు
రాయగలమా…..లేదు కదా….!??
ప్రేమ కవితలు అయితే ప్రేమలో మునిగిపోతూ ఉన్నారా అంటు,విషాద కథ అయితే జీవితంలో
వైఫల్యం చెందరా అంటూ….
పుల్ల విరుపు మాటలు అంటు…
స్వేచ్చగా కలాన్ని కదలకుండా
చేస్తూ మనసుకి బాధను కలిగేలా…
అక్షరాలను పదాలుగా మార్చాలంటే భయపడేలా
చేస్తున్నారు కాదని అనగలరా…
స్వేచ్చగా నచ్చిన దుస్తులు ధరించే సౌలభ్యం
ఉందా….!?లేదు కదా….
మీ రంగుకు,మీరున్న ఆకారానికి ఇది అవసరమా
అంటూ ఎగతాళి చేస్తూ మనసుని చిత్రవధ చేస్తున్నారు…కాదు అనగలమా!???
స్వేచ్చగా ఎప్పుడైతే
నవ్వగలమో…
ఏడవగలమో..
నచ్చినట్టు బ్రతకగలమో..
నచ్చిన మాట అనగలమో..
నచ్చిన చోటకి వెళ్ళగలమో..
స్వేచ్చగా గాలి పీల్చగలమో
అప్పుడే మనకి వచ్చేది అసలు సిసలైన స్వేచ్ఛ ప్రపంచం.
అప్పుడే కదా నిజమైన
అదే కదా అసలు సిసలైన స్వాతంత్రం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!