అంశం: స్వేచ్చా స్వాతంత్రం ఎక్కడ?
మారదు లోకం మారదు కాలం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : మాధవి కాళ్ల
స్వేచ్ఛ అనేది రెండు అక్షరాలు మాత్రమే
కాని దాని ఫలితం ఒక జీవితకాలం.
లేని స్వేచ్ఛ నటిస్తూ.
లోలోపల బానిసత్వాన్ని అనుభవిస్తూ.!
ఎప్పటికో అ..బానిసత్వం విడుదల అని మనసు కుతూహల పడుతూ.!
చిగురించే కొత్త ఆశలకు వెలుగు నిస్తూ.
కన్నుల ముందు జరిగే అరాచకత్వాన్ని భరిస్తూ.
లేని స్వేచ్ఛని ఉందని భ్రమపడుతూ.!
స్వాతంత్రం తో నేను స్వేచ్ఛ పొందాను అనుకుంటూ.
గడుపుతుంది నా దేశ ప్రజానీకం.!
రోడ్లే ఇల్లుగా మలచుకుని స్వేచ్ఛ కోసం వెతుకుతూ
కాలం గడుపుతుంది నేటి వరకు కూడా
నా దేశ సామాజికంలోని ప్రజానీకం.!
👏👏👏👏👏