ముద్దుల పెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

ముద్దుల పెళ్ళాం

రచన :: నామని సుజనాదేవి

పెంకి పెళ్ళాం
ఎడ్డెం అంటే తెడ్డెం అంటది
దానికి నచ్చింది వండమంటే
నాకు నచ్చింది వండుతుంది
బయటికి వెళ్దామంటే
ఇంట్లోనే ఉందామంటది
ఇంట్లో ఉందామంటే
బయటికి వెళ్దామంటది
సినిమా కి వెళ్దాం అంటే
గుడికి వెళ్దాం అంటది
అడవి మాంసం వండమంటే
ఆకు కూరలు వండుతనంటది
ఆకలి భోజనం పెట్టమంటే
కాళ్లు చేతులు కడగమంటది
కాఫీ, టిఫిన్ పెట్టమంటే
మొలకలు మజ్జిగ తాగమంటది
ఆలస్యంగా లేస్తానంటే
పొద్దున్నే యోగా ఎక్సర్సైజ్ చేయాలంటది
జల్సా చేద్దామంటే
పొదుపు పొదుపు అంటది
మొత్తానికి ఎడ్డెం అంటే తెడ్డెం అన్నా
నా పెంకి ముద్దుల పెళ్ళామే నాకు ఇష్టం
అది లేకపోతే నాకు కష్టం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!