అన్ నోన్ నంబర్( unknown number )

అన్ నోన్ నంబర్( unknown number )

రచన::అశ్విని ‘సంకేత్’

“ఇప్పుడు నేను మీకు ఒక రియల్ లవ్ స్టొరీ చెప్పబోతున్నా”…..

రామాయణంలో రాముడు సీత కోసం రావణుడితో యుద్ధం చేస్తాడు…ఆ యుద్ధంలో ఎందరో వానరులు,రాక్షసులు చనిపోతారు…

అదేంటి “లవ్ స్టోరీ” అని చెప్పి ఇలా… రామాయణం, మహాభారతం…అంటుంది ఏంటి రా! బాబు! అని  డౌట్ వచ్చింది కదా!….ఆగండి, ఆగండి అక్కడకే  వస్తున్నా….

అలా చనిపోయిన వానరులు,రాక్షసుల ఆత్మలు యుద్ధం అనంతరం రాముడి దగ్గరికి వచ్చి రాముడికి ప్రణామము చేస్తాయి.అపుడు రాముడు, మీరు నా వల్ల చనిపోయారు కాబట్టి మీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను….

కలియుగంలో ప్రతి కుటుంబంలో ఒక వానరం,ఒక రాక్షసుడుగా పుట్టే విధంగా నేను మీకు వరం ఇస్తున్నాను.అలా మీరు ఆనందంగా జీవితం  గడపండి…అని వరం ఇచ్చాడని మా అమ్మమ్మ!
నా చిన్నపుడు చెప్పేది…

మా కుటుంబం చూస్తే  అది నాకు నిజమే అనిపిస్తుంది.ఆ వానరం మా చెల్లి, ఆ రక్కసి మా నాయనమ్మ!…. అని పిస్తుంది నాకు వారు నాతో, ప్రవర్తించే తీరును బట్టి…

కావాలంటే మీరూ ఆలోచించండి మీ ఇంట్లో కూడా ఒక వానరం,ఒక రక్కసి వుంటాయి….(మీ ఊహా పరిధిలో)…

ఇంకా స్టోరీ లోకి వస్తె “అచ్చు కోతి లాగే నా చెల్లి తిక్క తిక్క పనులు,పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ నన్ను ఏడిపించుకు తింటుంది”…కాని, ఎంతైనా “my one and only lovely sister”…..

ఇంకా మా నాయనమ్మ ఐతె ఎప్పుడు నన్ను తిడుతూనే వుంటుంది.అది చెయ్య వద్దు ,ఇది చెయ్య వద్దు.ఇలా వుంటే నీ మొగుడి చేత బాగా తిట్లు కాస్తావు అని తిడుతూనే వుంటాది.కాని మా చెల్లిని మాత్రం ఏమి అనదు.ఎందుకంటే, వాళ్ళు ఇద్దరు ఒక పార్టీ…నేను మా మమ్మీ ఒక పార్టీ…అందుకు…

అసలు నానమ్మకి నేను పుట్టిన దగ్గర నుంచి కోపం. ఎందుకంటే నాన్నకు మొదటి సంతానంగా చనిపోయిన తన మొగుడు పుడతాడు అనుకుంది.కాని, నేను పుట్టే సరికి కొంచం అప్సెట్ అయ్యింది.

దానికి తోడు నా పేరు…”తను, వాళ్ళ అమ్మ పేరు నాకు పెట్టాలని అనుకుంది.ఎందుకంటే నానమ్మకు కూతురు పుట్టక పోవడంతో కొడుకు కూతురికి అయిన వాళ్ళ అమ్మ పేరు పెడదాం అనుకుంది”…..

కాని “మా అమ్మ! నాకు, వాళ్ళ అమ్మ పేరు మహాలక్ష్మీ అని పెట్టే సరికి, నాణమ్మకి నేను అంటే ఇంకా కోపం”…

కోపం వున్నంత మాత్రాన నన్ను ఏమి కొట్టి ,తిట్టి హింసించడం ఏమి చేయదు.ఎప్పుడో కోపం వస్తె తిడుతుంది.అంతేగాని, తనకి నేను అంటే చాలా ఇష్టం. ఎంతైనా మొదటి మనమరాలుని కదా!…

ఇంక చెల్లి విషయానికి వస్తె ఎప్పుడూ, ఏదో ఒక తిగ్గరి పని చేసి నా మీదకి తోసేసి,నన్ను తిట్లు కాయిస్తుంది…

దానికి తోడు వాళ్ళకి ఒక బ్యాచ్ కూడా వుంది… వాళ్లు  ఎప్పుడు తింగరి పనులు చేస్తూ అందరిని ఆట పట్టించి ఏడిపిస్తూ వుంటారు…

అలా ఆటలో భాగం గానే రోజు ఎవరోకరి మొబైల్  నుంచి తెలియని నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళను ఏడిపిస్తూ వుంటారు…

అందుకు గాను వాళ్ళు రోజు కంబైన్ స్టడీ చేసినట్టు అర్ధ రాత్రి దాకా చదివినట్టు అందరికీ, కలరింగ్ ఇస్తూ వుంటారు కూడా…

అలా ఒక రోజు నా మొబైల్ నుండి ఒక అన్ నోన్ నెంబర్ కి అర్ధ రాత్రి 12:00 గంటలకు ఫోన్ చేసి ఏడిపించాలి అని ప్లాన్…కాని, ఆ రోజు రాత్రి ఆ అన్ నోన్ నెంబర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యక పోవడంతో,మరియు నేను మంచి నీళ్లు కోసం లేవడంతో వాళ్ళ నుండి నా ఫోన్ లాక్కున్నాను…

తరువాత రోజు నేను ఏదావిధిగా నా మొబైల్ తీసుకుని నా క్లాస్ కి వెళ్లి పోయాను…ఆ రోజు నాకు కేమిస్ట్రి లాబ్ వుంది.అసలే కెమిస్ట్రీ సారు! చండ సాసనుడు. లాబ్ సమయంలో పిన్ డ్రాప్ సైలెంట్ గా లేకపోతే మార్క్స్ కట్  చేస్తాడు. నాకు సాధారణంగా కాలేజ్ టైమ్ లో ఫాన్స్ రావు..కాబట్టి నేను ఫోన్ సైలెంట్ లో పెట్టటం మర్చిపోయా..

లాబ్ మధ్యలో మా సార్ ఏదో వెతుకుతుంటే… అప్పుడే  నా ఫోన్ కి కాల్ వచ్చింది. అది పెద్ద రింగ్ టోన్ సౌండ్ తో

” నీకు కావలసింది నా దగ్గర వుంది. అందుకో అభిసారిక…”

ఇంకేమి వుంది అందరూ ఒక్క సారిగా గొల్లు మని నవ్వారు.చి, చీ…తల కొట్టేసినట్టు అయ్యింది నాకు. ఇంతకీ ఆ రింగ్ టోన్ నేను కాదు నా చెల్లి సెట్ చేసింది. కాని, ఇప్పుడు చెప్పే సమయం కాదు!…చెప్పిన వినే వారు లేరు!…

వెంటనే ఫోన్ కాల్ కట్ చేసా. కాని,అది మళ్ళీ మళ్ళీ మోగుతూనే వుంది. సైలెంట్ లో పెట్టా కాని అది కుయీ మని సౌండ్ ఇస్తుంది.దానితో మా సార్ కి వొళ్లు మండి నా క్లాస్ నుండి బయటికి పో అండ్ మార్క్స్ అల్సో కట్ అని గట్టిగా నన్ను తిట్టి క్లాస్ నుంచి బయటకి పంపేశారు.

ఇంక ఏమి వుంది నాకు కోపాం నషాళానికి అంటి ఆ అన్ నోన్ నెంబర్ కి కాల్ చేసా…అటువైపు నుండి “హెలో హూ ఆర్ యూ!” అనేసరికి,…

“హూ ఆర్ యూ ఏంటిరా! నీ అబ్బ! ఇందాకటి నుంచి తెగ కాల్ చేస్తున్నావ్. ఒక సారి కాల్ కట్ చేస్తే తెలియదు రా! అవతలి వారు బిజీగా ఉన్నారని అంటూ” అప్పటి వరకు నేను ఇలా కూడా మాట్లాడతాను అని నాకే తెలియనంతగా తిట్టేసాను.

అవతలి నుంచి “ఏ మెంటల్! ఎవరు నువ్వు? కారణం లేకుండా నన్ను తిడుతున్నావ్ అనేసరికి,… నాకు ఇంకా కోపం వచ్చి “నువ్వే మెంటల్…నీకే మెంటల్…నువ్వే ఫోన్ చేసి హూ ఆర్ యూ అంటున్నావ్ అని ” తిట్టేసరికి,…

అవతలి నుంచి “తల్లీ! నువ్వు ఎవరో నాకు తెల్వదు.నువ్వు ఎందుకు తిడుతున్నవో అసలే తెల్వదు.నీకు ఒక దండం.

నిన్న రాత్రి 12:00 గంటలకు ఈ నెంబర్ నుంచి నాకు 10 మిస్డ్ కాల్స్ వచ్చినాయి.నాకు అప్పుడు అవ్వక ఎత్తలే,ఏదైనా అర్జెంట్ పని మీద ఫ్రెండ్ ఎవడైనా చేశాడు ఏమో? అని నేను కాల్ చేసా….

అంతేగానీ,నీకు లెక్క అర్ధ రాత్రి 12:00గంటలకి కాల్ చేసి పరేషాన్ చెయ్యడం,ఫోన్ చేసి బూతులు తిట్టడానికి కాదు. అయినా, నేను ఒక ఇంపార్టెంట్  కాల్ కోసం వెయిట్ చేస్తున్నా ,నీతో తిట్లు తీపించుకొడానికి కాదు! అని” నా ఫోన్  కట్ చేసే సాడు…

వెంటనే నాకు కళ్ళ నిండా నీరు వచ్చి చేరింది.నేను పుట్టినప్పటి నుండి నన్ను ఎవరూ ఇలా తిట్టలే, దీనికంతటికీ కారణం నా చెల్లి…రాకాసి బల్లి…

ఐపోయింది అది ఈ రోజు నా చేతిలో అని అనుకుని, ఏది అయితే నేమి తప్పు అంతా నాదే. ముందు వెనుక ఆలోచించకుండా పాపం ఆ అబ్బాయిని అనవసరంగా తీట్టేసా.ముందు ఆ అబ్బాయి కి సారీ చెప్పాలి అని అనుకుని…

మొబైల్ తీసి ఆ  నెంబర్ కి మెసేజ్ పెట్టాను..
” సారీ! అండి! ఏం జరిగింది అంటే, అని నా చెల్లి చేసిన పని,….దాని వలన…ఈ రోజు లాబ్ లో జరిగిన సంగతి…అంతా చెప్పి…అందుకే కోపం వచ్చి మిమ్మలని తిట్టేశాను…నన్ను క్షమించండి అని పెట్టీ”  ఆ మెసేజ్ అప్ లోడ్ అయ్యి ఆ నెంబర్ తాలూకా వ్యక్తి ఆ మెసేజ్ చదివాడు అని కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ఆ నెంబర్ నీ బ్లాక్ చేసేసాను…..

దాని వలన గత మూడు ఏళ్ళ నుండి నాకు ఎటు వంటి సమస్య రాలేదు.కాని, నిన్నరాత్రి నాన్నగారు! వచ్చి,నీకు ఒక మంచి  పెళ్లి సంబంధం వచ్చింది తల్లీ!అబ్బాయి చాలా మంచి వాడు.అమెరికాలో ఉద్యోగం.పైగా వాళ్లకు నువ్వు నచ్చావ్ కూడా.
నీకు కూడా నచ్చితే వాళ్ళను పెళ్లి చూపులకు రమ్మని అంటాను.అబ్బాయి పేరు అరవింధ్.అబ్బాయి ఫోటో,ఫోను నెంబర్. నీ, మొబైల్ కి సెండ్ చేసా.చూసి,మాట్లాడి చెప్పు అని వెళ్లిపోయారు.

నాన్న వెళ్ళిపోయాక.ఆ అబ్బాయి ఫోటో చూసా, పేరుకు తగ్గట్టు అందంగానే వున్నాడు.ఏ వంక పెట్టటానికి నాకు ఏమి కనపడ లేదు.నాన్న గారికి ఓకె చేపుధాం అనుకుని,అతని మొబైల్ నెంబర్ నీ సేవ్ చేద్దాం అనుకునే సరికి, ఈ నెంబర్…ఆ అన్ నోన్ నంబర్… ఒకటే అని వచ్చేసరికి నాకు చెమటలు పట్టేసాయి.వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి ఇ పెళ్లి సంబంధాన్ని నా మైండ్ నుంచి తీసేసా…

అది జరిగిన వారం రోజులకి నేను వర్క్ చేస్తున్న స్కూల్ కి ఎవరో నాతో మాట్లాడడానికి వచ్చారు అని ప్యున్ చెప్పడంతో నేను అతనిని కలవడానికి వెయిటింగ్ హల్ కి  వెళ్ళాను.

ఓ…సారి! చెప్పడం మరచి పోయాను. నేను డిగ్రీ పూర్తి చేసి Bed చేసి,ఇపుడు ఒక స్కూల్ లో టీచర్ గా చేస్తున్నా….

వెయిటింగ్ హాల్ కి వెళ్లి చూసే సరికి అక్కడ ఉన్నది
అరవింద్….

ఆ అన్ నోన్ నంబర్ వ్యక్తి…నా కోసమే ఎదురు చూస్తున్నట్టు నేను వెళ్ళగానే ఒక స్మైల్ చేసి కూర్చో మంటు పక్కనే వున్న ఇంకో కుర్చీ చూపించాడు. ఎందుకు వచ్చాడో అని నేను ఆలోచిస్తూ కూర్చున్న తను ఆఫర్ చేసిన కుర్చీలో.

మా ఇద్దరి మద్య కొన్ని నిముషాలు మాటలు లేవు. తనే ముందుగా…హాయ్,నా పేరు అరవింద్…తెలుసు అన్న అప్రయత్నంగా…తన మొఖం లో ఒక చిన్న నవ్వు.నాకు వెంటనే సిగ్గు వేసి నా ముఖం పక్కకి తిప్పుకున్న.

నేను మీకు నచ్చాను అని మీ  ముఖం చూస్తే తెలుస్తుంది.మరి ఎందుకు పెళ్లి ఇష్టం లేదు అన్నారు అన్నాడు చాలా బాధగా.

అదీ…నేను…అనేసరికి, “తను, నాకు కొంచం దగ్గరగా చైర్ లాక్కుని నాకు తెలుసు! మీరు, ఎందుకు ఈ పెళ్లి వద్దు అంటున్నారో! కాని, మీకు తెలియవలసింది విషయం ఒకటి ఉంది.ముందు వినండి ప్లీజ్ అని చెప్పడం ఆరంభించాడు…

ఆ రోజు మీరు ఫోన్ చేసి అనవసరంగా తిట్టేసరికి నాకు, మీ మీద చాలా కోపం వచ్చింది.కాని, మీ మెసేజ్ చదివేక అర్థం అయ్యింది.మీరు తిట్టటంలో తప్పు లేదు! అని.ఆ పరిస్థితులలో ఎవరైనా అలాగే చేస్తారు.మీరూ అలాగే చేశారు. ఆ విషయమే మీకు చేపుదాం అనుకుంటే, మీరు నా నెంబర్ నీ బ్లాక్ చేసేశారు.వేరే నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడవచ్చు కాని,మీకు ఇష్టం లేకుండా మాట్లాడడం సంస్కారం కాదని ఊరుకున్నా. అంటూ… నా వైపు చూసే సరికి నేను వింటున్నా అని గ్రహించి చెప్పడం కొనసాగించాడు..

అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, ఆ రోజు నేను నా అమెరికా వీసా గురించి మధ్య వర్తి చేసే కాల్ కోసం వెయిట్ చేస్తున్నా.ఇంతలో మీరు ఫోన్ చేసి తిట్టటం,నేను మిమ్మల్ని విసుకోవడం జరిగి పోయాయి.మీ కాల్ తరువాత బ్రోకర్ ఫోన్ చేసి వీసా కన్ఫర్మ్ అయ్యిన్ది అని చెప్పాడు.

వెంటనే నేను ఆ విషయం అమ్మకి చెప్పేసరికి, అమ్మ! చాలా సంతోషించి ఈ రోజు చాలా మంచి రోజు. పొద్దున్నే లేచి ఎవరు ముఖం చూశావో! ఎవరితో మాట్లాడావో! ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పని ఇప్పుడు అయ్యింది అని చాలా సంబరపడి పోయింది.

నాకు అప్పుడే గుర్తు వచ్చింది.నేను ఏడాదిగా ఎదురు చూస్తున్న వీసా పని మీతో మాట్లాడాక కన్ఫర్మ్ అయ్యిన్ది.అంటే మీరు,నా జీవితంలోకి అనుకోకుండా వస్తేనే నాకు ఇంత కలిసివచ్చింది.మరి మీరే నా జీవిత బాగస్వామి అయితే నేను అదృష్ట వంతుడనే అనుకుని మీ గురించి డీటైల్స్ ఎప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటున్నాను.

నేను అమెరికాలో చదువు కుంటున్నానని మాటే గానీ, మీ ప్రతి కదలిక నాకు తెలుస్తూనే ఉన్నాయి. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను అంటే మీ ముఖం కూడా చూడకుండా నా గుండెలలో మీకు గుడి కట్టేసా!…నా ప్రేమ దేవత! మీరే, ఎన్ని జన్మలకైనా అని గట్టిగా నమ్మాను.

నాకు చదువు అయ్యి,ఉద్యోగం వచ్చాకే ఈ విషయం మీకు,అమ్మా వాళ్లకు, చెప్పాలి అనుకున్నా. అనుకున్నట్టుగానే నాకు ఉద్యోగం రాగానే రెక్కలు కట్టుకునీ ఇండియాలో వాలిపోయా.

మీ కోసం…కాదు…కాదు…నా మనసు కోసం ఎందుకంటే అది ఎప్పుడో మీకు ఇచ్చేసా…

కావాలంటే చూడండి మీరు పెట్టిన మెసేజ్ నీ నేను రోజుకి ఎన్ని సార్లు చదివే వాడినో నాకే తెలియదు చూడండి అని తను నాకు మెసేజ్ చూపించే సరికి. నేను చూసాను మెసేజ్ నీ కాదు. ఆ మెసేజ్ పై సేవ్ చేసుకున్న నా పేరు నీ “”ప్రియమైన రాక్షసి””..

ఇంక అరవింద్ ఏమి చెపుతున్నాడో…వినే స్థితిలో నేను లేను.ఎప్పుడో  నేను తన ప్రేమ జడిలో కొట్టుకుపోతున్నా…

అది స్కూల్ అనే సంగతి కూడా నేను మరచి, ఏడుస్తూ…అరవిందుకు దగ్గరగా వెళ్ళి తనని గట్టిగా హత్తుకుని “I love u ,I can’t live without u..”
అని చెప్పి అక్కడ నుండి వడి వడిగా అడుగులు వేసుకుంటూ నా క్లాస్ రూం కి వచ్చేశా…

ఆ తరువాత అరవింద్ మా పేరెంట్స్ తో,తన పేరెంట్స్ తో మాటలు ఆడి డైరెక్ట్ గా పెళ్ళికే ముహూర్తాలు పెట్టించేసాడు…

ఆ తరువాత కొన్ని రోజులకు మా పెళ్లి ,అరవింద్ తో నా అమెరికా ప్రయాణం…ఒక ఏడాదిలో మా ప్రేమకు చిహ్నంగా నాకొక బేబీ…ఇవన్నీ కాలంతో ప్రమేయం లేకుండా వాటంతట అవే జరిగి పోయాయి…

హా! అన్నట్టు చెప్పడం మరిచా మా పాప పేరు మా నానమ్మ పేరే పెట్టాను “బాలా త్రిపుర సుందరి అని”…

సుందు అని ముద్దుగా పిలుచుకుంటున్నాం…ఇపుడు మా నానమ్మకు నేనే ఫేవరెట్ మనమరాలిని…

ఇంక నా చెల్లి సంగతికి వస్తె, అది ఆ మధ్య ఏడిపిద్ధాం అని ఏదో అన్ నోన్ నెంబర్ కి ట్రై చేస్తే. అది కాస్తా  కమిషనర్ నెంబర్…దానితో దానికి, గట్టిగా చీవాట్లు పడడంతో బుద్ధి వచ్చి అలాంటి తింగరి పనులు మానేసి బుద్ధిగా చదువు కుంటుంది.

కథ సుఖాంతం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!