ఓటరు మహాశయా మేలుకో

ఓటరు మహాశయా మేలుకో

రచన::వి. విజయశ్రీదుర్గ

రామరావు గారు భార్యసునంద ఇద్దరు బట్టల వ్యాపారం చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చే రుణాల కోసం భార్య భర్తలిద్దరూ నెలరోజులు అప్పు కోసం తిరిగారు అనేక విషయాలు బయటకొచ్చాయి వారికి లంచం మరియు అసత్యం చెపితే పనులు అయ్యేటట్టు అగుపించింది దంపతులకు .
కులాల సర్టిఫికెట్ ఆదాయం సర్టిఫికెట్ ఆధార్ కార్డు అంటు అటు నుంచి ఇటు తిప్పి కనీసం నెలరోజులపాటు తిప్పారు లంచం ఇస్తే తప్పక లోన్ ఇస్తాము అంటు తేల్చి చెప్పారు ఆఫీసర్లు
నిజంగా కంట తడి పెట్టింది సునంద ప్రభుత్వం ఇచ్చే రుణాలు కూడా అధికారుల మోసంచేస్తున్నారు అంటు అస్సలు ఓటు వేసి తప్పు చేస్తున్నాం
మనం ఈసారి ఓటు అలోచించి వేద్దాం
లేదు సునంద లేదు హౌస్ టాక్స్ కరెంటు బిల్ ఇవన్ని మనం నోరుమూసుకుని కట్టేస్తేనే రొజులు నడుస్తాయి అంతే కాని ఓటు ఎప్పుడొనోటుకు అమ్ముడయిపోయింది
లంచం ఇచ్చేసి అప్పు తెచ్చుకుందాము అంటు భార్యను నెమ్మదిగా శాంత పరుస్తున్నారురామారావుగారు ఇది అంత వింటున్న సునంద తండ్రి రఘురామయ్యగారు అల్లుడుగారు !!ఓటంటే వేలి మీద చుక్కకాదు.ఓటు ఒక అస్త్రం. ఓటు మన బాద్యత మరియు హక్కు మనది ప్రజాస్వామ్య దేశం
ప్రతి పౌరుడు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దేశ భవిష్యత్తు మనమే లిఖించే మంచి అవకాశం.
ఒక్క ఓటు చాలు చరిత్రను తిరగ రాస్తుంది.
అవసరం అయితేఒక్క ఓటుతో ఎందరో మేధావులని పడేయొచ్చు.
సేవాసంస్థలు గవర్నమెంట్ ఓటు విలువ ఎంతో టి.వి పేపర్ చరవాణి ద్వారా తెలియచేస్తున్నాయి ఊరుకులు పరుగులు పెట్టే ఉద్యోగులు, వ్యాపారులకు ఎన్నికలు అంటే ఒక రోజు సెలవు వస్తుందని భావనే తప్ప ఎవరికిప్రజలను పాలించే నాయకుడు ఎన్నుకోవటం చేతకావట్లేదు పట్టణవాసుల కంటే గ్రామీణ ప్రాంతవాసులే ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉన్నారు. యువకులు మొదలు వృద్ధుల వరకు ఓటును ఓ హక్కుగా భావించి ఉపయోగించుకుంటున్నారు. భారతదేశంలో జరిగిన సర్వేలు చెప్పిననిజాలు . ఇది నూటికి నూరు పాళ్లు నిజం ఓటు హక్కును కోల్పోతే నిరుపేదలు మధ్య తరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆందోళనే . అదే ఉన్నత వర్గాలవారు మాత్రం ఓటు గురించి ప్రశ్నించడం లేదు. అసలు పోలింగ్‌ బూత్‌కుకూడా వస్తారన్న నమ్మకంలేదు.ఫలితంగాఓటుహక్కుదుర్వినియోగమవుతోంది..ఈ పరిస్థితి మారాలి మనమంతా నడుము బిగించాలి అంటు ఉద్వేగంగా చెప్పారు అల్లుడుతో రఘురామయ్యగారు . ఓటరు మేల్కొనాలి బాధ్యతగా మెలగాలి
మంచినాయకుడు ఎన్నుకుని ఎన్నో మంచి పనులు చేసాము మా రోజులలో తప్పక మంచి రొజులు వస్తాయి అని సమాధానపరుచుకున్నారు కొడుకు కోడలు ముందర.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!