ప్రేమలేఖ

అంశం: ప్రేమలేఖ

ప్రేమలేఖ
(ప్రక్రియ: ఏకపది, ద్విపది, త్రిపది)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

ఏకపది
మదిలోని మధుర భావాలన్నీ గుదిగుచ్చి…
పదిలంగా పొందుపరచిన ప్రేమలేఖ…!

ద్విపది
చేరుకోలేని దూరతీరాలకు చేరుకుంటుంది…
చేరువనున్న భావనను కలుగజేస్తుంది…!

త్రిపది
తోకలేనిపిట్ట…
తొంభై ఆమడల దూరమైనా చేస్తుంది పయనం…
అందిస్తుంది మనసైనవారికి ప్రేమసందేశం…!

చిరుకవిత
నోటితో చెప్పలేని రసరమ్య అనుభూతులను…
గుండెను గిలిగింతలు పెట్టే
తరుణ ఊహలను…
అంతరంగంలో దాచుకున్న అంతులేని ఆశలను…
అందమైన జ్ఞాపకాల నెమలీకలను…
అక్షరాల్లో పొదవుకున్న ప్రేమలేఖ…
అందినవేళ మనసు
మధురోహల సంద్రమే ఇక…!!!
******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!