జీవితం ఆవలి తీరంలో

జీవితం ఆవలి తీరంలో

రచన::ముక్కా సత్యనారాయణ

జీవితం ఆవలి తీరంలో ఏముంది?
అసలు మనిషి మరణించాక ఏమవుతుంది?
ఈమధ్య అనామిక కూడా ముసలితనం పై నా పోస్ట్ చూసి ఈ ప్రశ్న వేసింది. వృద్ధాప్యం తదుపరి మరణం తప్పదు. తదుపరి ఆత్మ ఏమవుతుంది? ప్రశ్నలు నన్ను కూడా వేధించుతున్నాయి పదే పదే.
అసలు మ్రుత్యువు అంటే ఏమిటి? శరీరం కాలిపోతుంది. లేదా పూడ్చిపెట్టబడుతుంది. అందులో ఉన్న ప్రాణజ్యోతి పయనం ఎటువైపు?ఆలోచనాతరంగాల మధ్య నిదురించాను.
ఉన్నట్లుండి ఏదో తెలియని అలజడి అల్లన.
చుట్టూ చిమ్మచీకటి. తుమ్మచెట్టు ల్లా ఏవో వ్రుక్షాలు ఊడలు పాతుకుని భయం గోలుపుతూ. నల్లని మేఘాల మధ్య చుట్టూ ఏదో రవం. అర్ధం తెలియదు.
నడక సాగిస్తున్నాను. ఎన్ని రోజుల నడక?  దప్పిక, ఆకలి, నీరసం కాళ్లు నామాట వినడము లేదు ఏదో చిన్న సరస్సు.
నీటి కోసం వెళ్ళి ముఖం చూసుకొని ఆశ్చర్య పోయాను.
పళ్లు ఊడిపోయి, చింపిరి జుట్టు, వంగిపోతున్న మోకాళ్ళు, ముడతలు పడిన దేహం.
నాకు నా జీవితం గుర్తు వచ్చింది. ముఖానికి రంగేసుకోవాలి. వళ్లు కందకుండా ఎసి గది.
కూరగాయలు కోసం కూడా మోటారుసైకిల్ మంచం దిగకుండా టీ నీరు, టిఫినీలు. ఆశ్చర్యం ఏమంటే నీరు వెనక్కి వెళుతుంది.
బాధ. నేను అనుభవించాలి నా ఆత్మ?
నేను ఏమవుతున్నాను?  ఏమి జరుగుతున్నది?
ఏవో నీడలు నన్ను నెట్టుకొని వెళుతూ..
ఓ వంతెన, మనిషి మాత్రమే పట్టు వంతెన.. నడవక తప్పదు. కిందకు చూస్తే భయం వేస్తోంది. వెనక్కి చూస్తే దారి లేదు.
ముందుకే పయనం. రాళ్లు రప్పలు.
వళ్లు గీరుకుపోయింది. శరీరం పీలికలు. తప్పుకునే అవకాశము లేదు. వంతెన ఎత్తు పెరుగుతున్నది. కింద చూస్తే ఎగసిపడే అగ్ని కీలలు.
చీము నెత్తురు నిండిన ప్రవాహం పారుతూ వేగంగా, వాసన మెలిపెడుతూ… వైతరణి…?
కాలం గడుస్తూనే, నా పాదాల నడక ఆగకుండా.
….ఉన్నట్లుండి ఎవరాయన ? కాలకాయుడు…
దున్నపోతు ఆసనము.. పక్కనే ఏవో లెక్కలు చూస్తూ ఓ పెద్దాయన. చిత్రగుప్తుడు అనుకుంటా.
కేకలు, బాధతో కూడిన అరుపులు, కేకలు.
మంటలలో కాలుతూ… ఏవో గాయాలు తట్టుకోలేక… ఏమిటి సినిమాలో చూసినట్లు లేక నిర్లిప్తత తో కనిపిస్తున్నారు. ఆయనను అడగబోయే లోపు నను వెళ్ళమని సంజ్ఞ చేశారు. ఎక్కడకు వెళ్ళాలి? దారి ఏది?

ఉన్నట్లుండి నీర్ణవమైనా, నిర్లిప్త గుహ్వంగం లోకి వెళ్ళాను. నేను వెళ్ళానా?  ఆ గుహ లో ఓ శిఖరం పై జఠాధారి. తపోముద్రలో ఉన్నారు.  కళ్ళు తెరవడం లేదు. ఆ కళ్ళేనా సకల చరాచర జగత్తు ను శాసించేది ? ఏమిటి జరుగుతున్నది? నాకెందుకు ఈ పరీక్ష? ఆయన నాకెందుకు కనిపించారు? నాకేనా?
అడిగానా??  ఏమో. చెవిలో చిన్న గుసగుస. కామక్రోధ, లోభమోహమదమాత్సర్యాల అసలుసిసలు ఉనికిని బయట పెట్టాలని పరీక్ష.
నేను ఆత్మ నా, శరీరాన్నా? నీ దర్శనము ఎలా సిద్ధించినది? ఎవరో సిద్ధుని వలె ఉన్నారు? నవ్వు, సన్నని నవ్వు. మనసును కట్టేసే మందహాసం. విముక్తి కోసం ఎదురు చూపులు చూసావుగా..
నీనుండి విముక్తి. శ్రుంఖలాలు తెగుతాయి. నీకు నీవు బందీవి అయితే బిగుసుకుంటాయి.
ఇపుడు నేను బందీనా, విముక్తుడనా? నీనుండి విముక్తి వద్దు. నీ చెంతన ఏదో తెలియని హాయి. నన్ను వీడకు.

“…..వెళ్ళు. నీ బాధ్యత ఇంకా ఉంది. నెరవేర్చు. “నీవెవరు స్వామి?  ప్రశ్న పూర్తి కాలేదు
చీకట్లు పెటేల్ మని తోలగిపోయాయి. కళ్ళు చూడలేని వెలుతురు. హాయి కలిగించు చల్లదనము. అయినా ఆ మూర్తి పైన ధ్యాస.

ఉన్నట్లుండి గాలిలో తేలుతున్నాను. ఏదో పక్షి రాజము. వర్ణమయ మేఘాల మధ్యగా.
మధుర భావనల కలిగించు కుసుమ పరాగాల సుమపరిమళం. ఆ వనం తేలిక చేయును మదిని. ఆ అద్భుతమైన పుష్పలతల మధ్యన పయనించిన, విహంగ రాజము వర్ణమయ, విలాస భవనం లోకి దారి తీసింది. పారదర్శక వలువల మధ్య మదిని వికసింప చేయు సౌందర్యముతో విలాసినుల న్రుత్యము. మధు పాత్రలతో సుందరీమణులు.
మత్తులో మునిగి తేలుతూ నవయువకులు. సినిమాలో చూసిన స్వర్గం ఇదేనా?
ఊరిలో తాగి దోర్లినవాడిని ఛీదరించుకుంటాము. మరి ఇక్కడ? నవ్వు వచ్చింది. నా చెవిలో ఎవరిదో మందహాసం.
ఇంత ఆనందం మధ్య ఆ మూర్తి జటాధారి గుర్తు వస్తున్నారు. నవరత్నఖచిత మణిమకుటం ధరించిన ఓ సుందరుడు సప్తభంజికాలంక్రుత సింహాసనం పై కూర్చుని…
మీరు ఎవరు?  మరలా అదే అనుభవం. మాట దాటిందా పెదవి?
గుసగుస చెవిలో. నీకు ఏ ప్రశ్న తో పనిలేదు. హాయిగా సుఖపడు. అన్ని సమకూరగలవు.
..అయినా అయోమయం. ఆయన సమక్షములో ఉన్న హాయి ఇక్కడ లేదే? నిశీధి నీర్ణవం నడుమ, రాళ్ళు రప్పలు మధ్య హాయిగా నవ్వుతూ, ధ్యానించు ఆయన ఆనంద తాండవం చూడవలే…
ఆ సదానంద, చిదానంద చిద్విలాస మర్మం తెలియని సుఖాలు నాకు ఏల???

ఉన్నట్లుండి ఏవో పెటపెటలు నందులు నర్తిస్తూ వస్తున్నాయి.. భయం లేదు. హాయిగా చేతులు చాపాను.
ఎలా వసింపచేసుకున్నదో ఆ మహానంది తనపై నన్ను???
ఓ ఉదుటున విదిలించినది. మలయమారుతం తరంగాల నడుమ పయనం. తేలుతూ తేలుతూ…
మంచం కింద పడ్డానేమో… ఆవిడ కేకలు.
ఇదంతా కలయా? నా దేహం పై చూసుకున్నా. నందీశ్వరుడు కుమ్మిన చోట ఓ మచ్చ నన్ను ప్రశ్నిస్తూ!!!
..ఈశ్వరా ఏమి నీ లీల?  ఇంతకీ జీవితం ఆవలి తీరంలో ఏముంది? నిన్ను తలచి నిద్రించితే నీవే ఇస్తావు సమాధానం.
నాకెందుకు నీవుండగా?  ఉత్సుకత..
నిరామయ నిర్వికారా, నిర్గుణ, నీలకంథరా.. ఆదిదేవా, మహాదేవా, మహాలింగా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!