నా అనుభవం

నా అనుభవం

రచన::రమాకాంత్ మడిపెద్ది

కరోనా జాడలు కూడా కానరాని రోజుల్లో… ఎప్పటి లాగే లేటుగా వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తున్న…. ఆరోజుకీ బాగానే వర్షం పడి నాలుగు రోజులు అయ్యింది
రోడ్లు కూడా చాలా బాగా ఉండటంతో అక్కడక్కడ గుంటలు గతుకులతో అతుకులు వేసిన అట్ట ముక్కలా ఎక్కడకక్కడే నీరు ఆగి మట్టి ఉన్న చోట బురద చేరింది
ఇంతలో బస్సు వచ్చి ఆగింది. వారంలో మొదటి రోజు కావడంతో జనాలతో బస్సంతా కిక్కిరిసి పోయింది. ఆ ఉక్కిరి బిక్కిరి ఊపిరి ఆడని పరిస్థితి చూసి ఒక రకమైన భయం మొదలైంది.
మళ్లీ వచ్చే మరో బస్సులో వెళ్దాం అనుకున్న కానీ మహా కోపిష్టి మా హెచ్.ఆర్. ముఖం గుర్తుకు వచ్చి ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న నేను ఎందుకు రిస్క్ చేయడం అనుకోని  ఓ మద్య తరగతి ఉద్యోగిలా ఆలోచించి అన్ని సార్లు సరదాలు కాదు
కొన్ని సార్లు సర్దుకు పోవాలి ధైర్యం చేసి నిటూర్పు తో గట్టిగా గాలి పీల్చుకొని ఓ చేతిలో లాప్టాప్ బ్యాగ్ మరో చేతిలో లంచ్ బ్యాగ్ పట్టుకొని అమాంతం ఎక్కేసాను
ఓ మూడు నాలుగు నిమిషాల నిర్విరామపు కుదుపుల తర్వాత ఫుట్ బోర్డ్ కి కుడి పక్కన ఉన్న కిటికీ వైపు ఓ మూల అలా చోటు దొరికింది.
నాలో నేనే హమ్మయ్య! బతికేసాను రా బాబు! అనుకోని ప్యాంట్ జేబులోంచి హెడ్ఫోన్ తీసుకొని నాకు బాగా ఇష్టమైన గాయిని శ్రేయ ఘోషల్ పాటలు వింటూ అల కాసేపు రిలాక్స్ అయ్యాను.
ఓ వైపు నేను హిందీ సినిమా “రబ్ నే బానది జోడీ” లో నా ఫేవరెట్ సాంగ్ వింటూ మైమరచి పోతుంటే మరోవైపు కండక్టర్ టికెట్స్ టికెట్స్ అంటూ అరిచే అరుపు కాస్త వినిపిస్తూ నా ఫోకస్ మార్చాలని చూసిన ఇంకాస్త వ్యాలుమ్ పెంచి చుట్టుపక్కల చూడక పక్కన ఏం జరుగుతుందో పట్టక నా లోకంలో అల ఉండిపోయాను
పది నిమిషాల్లో మా ఆఫీస్ కి ముందు బస్టాప్ అనుకునే సమయంలో అకస్త్మాతుగా బస్ డ్రైవర్ కొట్టిన బ్రేక్ తో ఒక్కసారిగా నా వెనకాలే ఉన్న ఓ వ్యక్తి నా మీద పడటం గమనించా ఒక్కసారిగా వెను తిరిగి చూసేలోపు
“సుడలేదు బిడ్డ! ఏం అనుకోకు అయ్య !” ఓ ముసలాయన తన నెత్తి మీద బట్టల మూటను సర్దుకుంటూ అన్నాడు.
మహా నగరంలో అదోరకమైన యాస అతని వేషధారణ అంతలో నన్ను ఆశ్చర్యానికి ఆలోపే అసహ్యానికీ నా కళ్లల్లో చేసింది.
దానికి సమాధానంగా అతని చిరునవ్వు నన్ను ఇంకా ఎదో తెలియని అసౌకర్యానికి గురి చేసింది.
నేను తన చూపును మాటను మార్చాలన్న ఉద్యేశంతో బలవంతంగా నేను ఓ నవ్వు నవ్వి అది చిరు నవ్వు కాదని అస్పష్టంగా తెలిసేలా తనికి అర్థం అయ్యేలా నా దృష్టిని మరల్చాను.
నా స్టాప్ వచ్చేసింది..
చాలా సేపటి నుండి నించున్న అతనిని చూడలేక బస్సు దిగుతూ “నేనూ వెళ్తున్నాను కూర్చోండి కళ్ళతో సైగ చేస్తూ ఖాళీ  సీటును చూపించా.
తను మాత్రం కాస్త దూరమే పర్లేదు అనే అర్థం వచ్చేలా పైన అంతా బరువున్న తేలిక కళ్లతో నవ్వాడు..
ఓ మిని యుద్దం తర్వాత మళ్లీ ఆఫీస్ నుండి వెనక్కి వెళ్ళే బస్సు కోసం స్టాప్ దగ్గర ఎదురు చూస్తు 20-30 నిమిషాల ఎదురు చూపు తర్వాత అదరా బాదరాగా బస్సు ఎక్కాను.
అలసిన శరీరంతో బస్సు ఎక్కగానే చివర్లో పొద్దున చూసిన అదే ముసలాయన అలా హాయిగా నిద్ర పోతున్నాడు.. చూసి చూడనట్టు చూసి నా స్టాప్ రాగానే దిగి వెళ్లి పోయాను..
గత వారం రోజులుగా అతన్ని గమనిస్తూనే ఉన్నాను. పొద్దున తల మీద అంత బరువు ఉన్న  పెదాలపై ఆ నవ్వు చెదరలేదు.
సాయంత్రం సీటు మీద ఎండలో ఆడి అలిసిన చిన్న పిల్లాడిలా నిద్ర పోతున్న ఆ నవ్వు చెరగలేదు. మనం మాత్రం ఈ తరం యువతరం చిన్న చిన్న విషయాలకు చిరాకు పడతాం .కుటుంబాన్ని బరువుగా, ఉద్యోగాన్ని భద్రతగా, కష్టాల్ని నరకంగా, ఇష్టాన్ని కాల క్షేపంగా అనుకోని ఉన్న కాస్త జీవితాన్ని అనవసరపు ఆలోచనలతో హైరానా పడుతున్నాం.. ఆయన తో పరిచయం కూడా లేదు నిజానికి అవసరం కూడా లేదు
చదువు లేని తన నిత్య జీవితం
చదువుకున్న నాకు జీవితపు అంతరార్థాన్ని అన్వయించిన తీరు గురువును తలపించింది
సందర్భం ఏదైనా సహనంతో సమన్వయంతో ఉండమని నా అహనికి అర్థం అయ్యేలా చెప్పింది
ఈ తరం మాకు (నాకు) ఆ తరం వాళ్లపై ఉన్న ఉద్దేశ్యాన్ని పూర్తిగా మార్చేసింది.
గతంలో తనపై నేను చూపిన మూర్ఖపు వైఖరికి సిగ్గు పడేలా చేసింది..
ఆఖరికి నా వయసు తన అనుభవం ముందు తలవంచేలా చేసింది
నాకు ఓ మంచి అనుభవాన్ని ఇచ్చింది…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!